అమెరికా – భారత్ మరింత బలోపేతం
వాషింగ్టన్: భారత్‌తో ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై అమెరికా ప్రత్యేక ద ష్టి సారించిందని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ అల్లుడు, సలహాదారు జారెడ్ కుష్నర్ చెప్పారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో జరిగిన అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) ద్వితీయ నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడారు. అమెరికాను అంతర్జాతీయం గా మరింత పోటీ పడగల వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా భారత్ వంటి దేశాలతో సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. భారత్‌లో అద్భుతమైన విద్యావంతుల జనాభా ఉంది. అమెరికాతో భారతీయులకు సారూప్య విలువలు ఉన్నాయి అని చెప్పారు. ట్రంప్ వలస ఉద్యోగులకు వ్యతిరేకి కాదని, అక్రమ వలసలకు వ్యతిరేకమని స్పష్టంచేశారు. అనంతరం యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ 2019 గ్లోబల్ ఎక్స్‌లెన్స్ అవార్డును మాస్టర్‌కార్డ్ సీఈఓ-అధ్యక్షుడు అజయ్ బంగాకు కుష్నర్ అందజేశారు.