స్పందించేంతవరకు ‘నిరాహార దీక్ష’
- చిన్నారి కుటుంబానికి షర్మిల పరామర్శ
- అక్కడే దీక్షకు దిగిన వైసిపి తెలంగాణ నేత
- కెసిఆర్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డ షర్మిల
- బాధిత కుటుంబానికి పదికోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనపై ప్రకంపనలు రేగుతున్నాయి.రాజకీయ, సినీ ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తున్నారు. చిన్నారి చైత్ర కుటుంబాన్ని తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధినేత్రి షర్మిల పరామర్శించారు.సైదాబాద్‌లో హత్యాచారానికి గురయిన చిన్నారి కుటుంబ సభ్యులను బుధవారం వైఎస్సార్ తెలం గాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పరామర్శించారు. బాధితురాలి ఇంటి వద్ద వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. సీఎం కేసీఆర్ స్పందించేంతవరకు నిరాహార దీక్ష చేస్తానని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి రూ.10కోట్ల పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.సీఎం కేసీఆర్ హయాంలో మహిళలపై లైంగికదాడులు అధికమయ్యాయని మండి పడ్డారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించేంతవరకు నిరాహార దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న ప్రాంతమే ఇట్లా ఉంటే… ఇక రాష్టాన్న్రి ఎలా అభివృద్ధి చేస్తారని నిలదీశారు.తల్లిదండ్రుల అనుమతి లేకుండా చిన్నారికి పోస్టు మార్టం చేశారని విమర్శించారు.సీఎం ఇంట్లో కుక్క హస్కీ చనిపోతే డాక్టర్ ఉద్యోగం తొలగించారని,మరి ఆరేళ్ల చిన్నా రిపై అత్యాచారం జరిగితే సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించరని షర్మిల ప్రశ్నించారు. ప్రగతి భవన్లో కుక్క చని పోతే చర్యలు తీసుకున్నారు ? కానీ ప్రజలు అంటే లెక్కలేదా అని మండిపడ్డారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు 938 వేధింపులు కేసులు ఉంటే..అవి 2020 కి మూడు రెట్లు అయ్యాయని నిప్పులు చెరిగారు.తెలంగాణలో గంజాయి, డ్రగ్స్, మద్యం ఏరులై పారుతుందని.. బంగారు తెలంగాణ కాదు.. బారులు, బీర్ల తెలంగాణ అయిందని మండిపడ్డారు. ఈ ఘటనపై కెసిఆర్ స్పందించేంత వరకు నిరాహార దీక్ష కు కూర్చుంటానని స్పష్టం చేశారు. ఈ ప్రాంతలో ఇక్కడ నీళ్లు దొరకవు, కానీ మద్యం దొరుకుటుందట అని.. ఇది పోలీసుల వైఫల్యం కాదా ? అని నిలదీశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా ? మండిపడ్డారు. పోలీసులు ఎంతబాగా పనిచేస్తున్నారో తెలియజేయడానికి ఇదొక ఉదాహరణమన్నారు.