‘‌గీత’దాటోద్దు…!

  • లాక్‌డౌన్‌ ఆం‌క్షలు గాలికొదిలిన జనం
  • రంగంలోకి దిగి కఠనంగా వ్యవహరిస్తున్న పోలీసులు
  • ఎక్కడిక్కడే చెక్‌ ‌పోస్టులతో వాహనాల తనిఖీలు
  • అనుమతి లేకుండా బయటకు వచ్చి వారిపై చర్యలు
  • అనేక వాహనాలను సీజ్‌ ‌చేసి జరిమానాలు విధిస్తున్న పోలీసులు
  • ఉల్లంఘనలపై కఠిన చర్యలు: సజ్జన్నార్‌

‌హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ‌పక్కాగా,కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఎక్కడిక్కడ చెక్‌ ‌పోస్టులు పెట్టి వాహనాలను చెక్‌ ‌చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్‌ ‌చేశారు. ఉదయం మినహాయింపు సమయాల్లో కూడా రోడ్ల ద భారీగా వాహనాలు తిరుగుతున్నాయి. దీంతో లాక్‌డౌన్‌ ‌మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు పోలీస్‌శాఖ స్పష్టం చేసింది. విచ్చలవిడిగా వాహనాలు రోడ్లపై రావడంపై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లకి వచ్చే వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేయాలని, ఆధారాలు లేకుంటే కేసులు నమోదు చేసి….వాహనాలు సీజ్‌ ‌చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి పోలీస్‌ ‌శాఖకు ఆదేశాలు జారీ చేశారు. నాలుగు గంటల సడలింపుతో రోడ్లపైకి విచ్చల విడిగా వందలాది వాహనాలు వస్తున్నాయి. దీంతో బేగంపేట్‌లో భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ అయ్యింది. రెండు కిలో టర్ల మేర భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ ‌కావడంతో రెండు అంబులెన్స్‌లు చిక్కుకున్నాయి. రిలాక్సేషన్‌ ‌తరువాత కూడా అనుమతి లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్‌ ‌చేసారు. షేక్‌ ‌పేట్‌ ‌టు టోలి చౌకి మార్గంలో భారీగా ట్రాఫిక్‌ ‌జాం అయ్యింది. రోడ్లు పైకి వందలాది వాహనాలు విచ్చల విడిగా వచ్చేశాయి. దీంతో షేక్‌ ‌పెట్‌ – ‌మెహదీ పట్నం వరకు మూడు కిలోటర్ల మేర ట్రాఫిక్‌ ‌నిలిచిపోయింది. వాహనాలను ఎక్కడికక్కడ పోలీసులు సీజ్‌ ‌చేస్తున్నారు. రిలాక్సేషన్‌ ‌తరువాత కూడా అనుమతి లేకుండా వాహనాలతో జనం రోడ్లు పైకి వచ్చారు. దీంతో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. కరోనా వైరస్‌ ‌కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ ఆం‌క్షలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌ ‌వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 330 తనిఖీ కేంద్రాల్లో పోలీసులు ఉదయం 10 గంటల తర్వాత తనిఖీలు చేపట్టారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను పోలీసులు సీజ్‌ ‌చేసారు. ఆస్పత్రుల నుంచి దృవీకరణ పత్రాలు ఉన్న వారికే అనుమతి ఇస్తున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ ‌నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్‌ ‌సీపీ వీసీ సజ్జనార్‌ ‌హెచ్చరించారు. గురువారం నగరంలోని మియాపూర్‌ ‌పరిధిలో లాక్‌డౌన్‌ అమలు తీరును సక్షించారు. జేపీనగర్‌,‌చందానగర్‌ ‌తారానగర్‌ ‌మార్కెట్లతోపాటు రాజీవ్‌ ‌గృహకల్ప కాలనీల్లో పర్యటించి పోలీసులు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న తీరు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని, ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని కోరారు. లాక్‌డౌన్‌ ‌సమయంలో వాహనదారులు రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉల్లంఘనలపై కఠిన చర్యలు: సజ్జన్నార్‌
‌లాక్‌డౌన్‌ ‌నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్‌ ‌సీపీ వీసీ సజ్జనార్‌ ‌హెచ్చరించారు. గురువారం నగరంలోని మియాపూర్‌ ‌పరిధిలో లాక్‌డౌన్‌ అమలు తీరును సక్షించారు. జేపీనగర్‌, ‌చందానగర్‌ ‌తారానగర్‌ ‌మార్కెట్లతోపాటు రాజీవ్‌ ‌గృహకల్ప కాలనీల్లో పర్యటించి పోలీసులు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న తీరు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని, ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని కోరారు. లాక్‌డౌన్‌ ‌సమయంలో వాహనదారులు రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.