తెలంగాణకు ‘తాళం’
- తెలంగాణలో నేటినుంచి లాక్‌డౌన్
- ఉదయం 6నుంచి 10 వరకు సడలింపులు
- పదిరోజుల పాటు అమలు చేయాలని నిర్ణయం
- హైకోర్టు ఆదేశాలతో కేబినేట్‌లో సమగ్రంగా చర్చ
- వ్యాక్సిన్ కొనుగోళ్లకు గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయం
- తెలంగాణ లాక్‌డౌన్ మార్గదర్శకాలు విడుదల
- కేటీఆర్ అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
- వ్యవసాయం, మీడియా, విద్యుత్ రంగాలకు మినహాయింపు
- ఎటిఎంలు, బ్యాంకులు యధావిధిగా పని చేస్తాయి
- 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆర్టీసీ,మెట్రో సర్వీసులకు అనుమతి
- ఉదయం సమయంలో వైన్ షాపులు యధావిదిగా తెరుచుకోవచ్చు
- ఈ నెల 20న మరోసారి కేబినెట్ భేటీలో లాక్‌డౌన్‌పై సమీక్ష
- లాక్‌డౌన్ ప్రకటన..వైన్ షాపుల ముందు బారుల
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించనున్నట్టు ప్రకటించింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశం ఉంటుందని క్యాబినెట్‌లో నిర్ణయించారు. మరోవైపు టీకా కొనుగోళ్ల కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది. హైకోర్టు తీవ్రంగా పరిగణించి పదేపదే చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో క్యాబినేట్ అత్యవసర భేటీ జరిగింది. సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఇప్పటికే అనేక చర్యలను తీసుకున్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే ధాన్యం కొనుగోళ్లపైనా చర్చించారు. ఇకపోతే తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. ఈ విచారణలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. గత విచారణలో ఎక్స్‌పర్ట్ కమిటీ వేయమని చెప్పాం వేశారా? అని హైకోర్టు ప్రశ్నించింది. పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్స్ ఆపమని ఎవరు చెప్పారు? ఈ సమయంలో అంబులెన్స్‌లు ఆపడం మానవత్వమా? అంబులెన్స్ రేటులను నియంత్రించాలని చెప్పాం.. చేశారా? రాష్ట్రంలో జరుగుతున్న వాటికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటుంది. కుంభ మేళా నుంచి తిరిగి వచ్చిన వారిని గుర్తించి టెస్ట్‌లు చేయాలని చెప్పాం చేశారా? పాతబస్తీ వంటి ప్రాంతాల్లో మత పరమైన కార్యక్రమాలను ఎందుకు నియంత్రించడం లేదు? రంజాన్ తరువాత లాక్‌డౌన్ పెడతారా? ఈ లోపే వైరస్ విజృంభిస్తుంది కదా? మేం ఆదేశాలు ఇచ్చిన రోజు హుటాహుటిన ప్రెస్ ట్ లు పెట్టి పరిస్థితి అంతా బాగుంది లాక్‌డౌన్ అవసరం లేదని ఎలా చెప్తారు? యాక్టివ్ కేసులు ఎందుకు తగ్గుతున్నాయి? మేం టెస్ట్‌ల సంఖ్య పెంచాలని చెబితే అందుకు భిన్నంగా తగ్గించారు – హై కోర్టు అంటే ప్రభుత్వానికి లెక్క లేదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నేథ్యంలో లాక్‌డౌన్ తప్ప మరో గత్యంతరం లేకుండా పోయింది. ఈ మేరకు క్యాబినేట్ చర్చించి పదిరోజులపాటు లాక్‌డౌన్ అమలుకు నిర్ణయించింది. దీనికి సంబంధించి విధివిధానాలు విడుదల చేయాల్సి ఉంది.
తెలంగాణ లాక్‌డౌన్ మార్గదర్శకాలు విడుదల
కరోనా కట్టడి కోసం తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తూ తీసుకున్న నిర్ణయం మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నెల 20న మరోసారి కేబినెట్ భేటీ జరగనుంది. లాక్‌డౌన్ కొనసాగించడమా లేదా అన్న దాని గురించి ఈ భేటీలో చర్చించనున్నారు. ఇక మే 12 నుంచి లాక్‌డౌన్ అమల్లోకి రానుండటంతో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం వ్యవసాయం, డియా, విద్యుత్ రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు నిచ్చారు. ప్రభుత్వ ఆఫీసులన్ని 33 శాతం సిబ్బందితోనే పని చేస్తాయి. బ్యాంకులు, ఏటీఎంలు యథావిధిగా కార్యక్రమాలు కొనసాగిస్తాయి. వ్యవసాయ సంబంధిత కార్యకలపాలు, ఉపాధి హా పనులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు లభించింది. సినిమా హాల్స్, స్విమ్మింగ్ ఫూల్‌లు, జిమ్ములు మూసివేయాలని ఆదేశించారు. రవాణా విషయానికి వస్తే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులు,మెట్రో సర్వీసులు నడుస్తాయి. సిటీ బస్సులు, జిల్లా సర్వీసులు కూడా లాక్‌డౌన్ సడలింపు సమయంలోనే నడుస్తాయి. ఆయా డిపోల పరిధిలో బస్సుల సమయాలను అ•-జడెస్ట్ చేస్తారు. ఇతర రాష్ట్రాలకు బస్సులు నడపమని తెలిపారు. జాతీయ రహదారులపై రవాణాకు అనుమతి ఇచ్చింది. అంత్యక్రియలకు 20 మంది.. వివాహాలకు 40 మందికి మాత్రమే అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం ఉంటుందని పేర్కొంది.ఇకపోతే యుద్ధ ప్రాతిపదికన కోవిడ్ వ్యాక్సిన్ ప్రొక్యూర్‌మెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ రంగంతోపాటు, ప్రైవేట్ రంగంలో కూడా రెమిడెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని, వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను క్యాబినెట్ ఆదేశించింది. అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్‌ఓ, జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయం. ప్రతిరోజూ ఆయా జిల్లాల మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సక్ష చేయాలని సీఎం ఆదేశిచారు. రెమిడెసివిర్ ఇంజక్షన్ ఉత్పత్తిదారులతో క్యాబినెట్ సమావేశం నుంచే ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాష్ట్రానికి తగినన్ని మందులను సరఫరా చేయాలని కోరారు. ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం పరిశ్రమల శాఖా మంత్రి కెటిఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్‌లో సభ్యులుగా ఉంటారు.
లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు:
వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు. తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్టిబ్యూట్రర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు. గ్రాణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి. జాతీయ రహదారుల ద రవాణా యధావిధిగా కొనసాగుతుంది. జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి. కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు ఇచ్చారు. ప్రింట్ అండ్ ఎలక్టాన్రిక్ డియాకు మినహాయింపు ఇచ్చారు. ఉపాధిహా పనులు యధావిధిగా కొనసాగుతాయి.
ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి. గత లాక్ డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి. అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి ఇస్తారు. అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. తెలంగాణ చుట్టూ రాష్టాల్ర సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయంతీసుకున్నారు. ఇకపోతే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి. పైన తెలిపిన మినహాయింపులను పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని క్యాబినెట్ ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్టాల్లో్ర లాక్‌డౌన్ అమల్లో ఉంది. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి 10 రోజులపాటు లాక్‌డౌన్ విధించడంతో చాలామంది స్వగ్రామాలకు ప్రయాణమయ్యారు. దీంతో నగరంలోని ప్రధాన బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. నిన్నటిదాక అరకొర ప్రయాణికులతో కనిపించిన ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్‌లు ప్రయాణికులతో నిండిపోయాయి. రేపు 10గంటల వరకు మాత్రమే ప్రయాణానికి అనుమతి ఉండటంతో రాష్ట్రంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు హడావిడిగా ప్రయాణమయ్యారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్సుల్లో ప్రయాణించే వారు విధిగా మాస్కులు ధరించాలని. చేతులు శానిటైజ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
లాక్‌డౌన్ ప్రకటన..వైన్ షాపుల ముందు బారులు
నేటి నుంచి తెలంగాణలో లాక్‌డౌన్ అమల్లోకి రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో మందు బాబులు మద్యం షాపుల వద్ద బారులు తీరారు. లాక్‌డౌన్ ప్రకటనతో మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి. మద్యం కోసం పలు వైన్‌షాపుల వద్ద తోపులాటలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే వైన్ షాపులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. టోలిచౌకి, గోల్కొండ, లంగర్ హౌస్ తదితర ప్రాంతాల్లో లిక్కర్ షాపుల ముందు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా గుమికూడారు. కోవిడ్ రూల్స్ పాటించకుండా మద్యం కోసం ఎగబడుతున్నారు. ముందస్తుగానే మద్యం కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొందరు పది రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేస్తున్నారు. కాగా, లాక్‌డౌన్ అమల్లోకి వస్తే మద్యం హోం డెలివరీకి అనుమతి ఇవ్వాల్సిందిగా లిక్కర్, బీర్ సప్లయర్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. లిక్కర్ ఉత్పత్తిని కూడా ఆపకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది.