ఏ ఒక్కరూ మరణించలేదు : డాక్టర్‌ ‌రాజారావు | Gandhi Hospital

సికింద్రాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌కరోనా వైరస్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌వేయించుకున్న ఏ ఒక్కరూ కూడా ప్రాణాలు కోల్పోలేదని సికింద్రాబాద్‌ ‌గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ‌డాక్టర్‌.‌రాజారావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ ‌వేయించుకుంటే కరోనా నుంచి రక్షించుకోవచ్చని సూచించారు. టీకా తీసుకున్న తర్వాత ఆసుపత్రిలో చేరిన 15 మంది కోలుకున్నారని వెల్లడించారు. బాధితుల్లో కొందరికి వెంటిలేటర్లు అవసరమైనా ఒక్కరి ఆరోగ్యం కూడా విష మించలేదని,అందరూ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వివరించారు. టీకా వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనా లకు ఇది చక్కని ఉదాహరణ అని తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 650 మంది ఐసీయూలో చికిత్స పొందు తున్నారని, 400 మందికి ఆక్సిజన్‌ అం‌దిస్తున్నట్టు చెప్పారు. వీరిలో దాదాపు 15 శాతం మంది వరకు ఇంట్లో చికిత్స తీసుకుని ఆ తర్వాత ఇక్కడకు వచ్చినవారేనని, ప్రైవేటు ఆసుపత్రులలో చేరి డబ్బులు ఖర్చు చేసినా నయంకాకపో వడంతో ఆఖరి నిమిషంలో ఇక్కడకు వచ్చిన వారేనని తెలిపారు.చాలామంది భయంతో ముందే ఆసుపత్రులలో చేరడం వల్ల బెడ్స్ ‌నిండిపోతున్నాయని డాక్టర్‌ ‌రాజారావు తెలిపారు.