‌ప్రతి గ్రామం…1000 మొక్కలు #Green‌‌Challenge

  • సీఎం కేసీఆర్‌ ‌జన్మదినం కానుకగా గ్రీన్‌ ‌ఛాలెంజ్‌
  • ‌ప్రతీ గ్రామానికి వెయ్యి మొక్కల చొప్పున నాటే లక్ష్యం
  • హరిత సంకల్పం కృషికి వనమాలి బిరుదులు
  • గ్రామ పంచాయతీ సిబ్బందితో ప్రత్యేక సమావేశాలు
  • జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎంపీ సంతోష్‌ ‌పిలుపు

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :

‌సీఎం కేసీఆర్‌ ‌పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 17న కోటి వృక్షార్చన కార్యక్రమం తీసుకున్నట్లు ఎంపీ సంతోష్‌ ‌క•మార్‌ ‌తెలిపారు. ఆ రోజు ఒక్క గంటలో కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించి, కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాల నేది గ్రీన్‌ ఇం‌డియా చాలెంజ్‌ ‌సంకల్పం అని పేర్కొన్నారు. కేసీఆర్‌ను అభిమానించే వారితో పాటు వ్యాపార, వాణిజ్య, సినిమా, పారిశ్రామిక రంగ ప్రముఖులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేందుకు సుము ఖత వ్యక్తం చేశారని తెలిపారు. కాగా, కోటి వృక్షార్చన కార్యక్రమానికి అండగా ఉందా మని ప్రిన్స్ ‌మహేష్‌బాబు అన్నారు. తన కూతురు సితార, కొడుకు గౌతమ్‌ ‌తనతో పాటు మొక్కలు నాటుతున్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్ ‌చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌జన్మదినం సందర్భంగా గ్రీన్‌ ‌చాలెంజ్‌ ‌కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఈనెల 17న కోటి వృక్షార్చన కార్యక్రమానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గ్రీన్‌ ‌చాలెంజ్‌కు సంబంధించిన విధి విధానాలను జిల్లా పంచాయతీ, అటవీ, గ్రాణాభివృద్ధి శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత రెండు రోజుల క్రితమే రాష్ట్రస్థాయి అధికారులు సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా గ్రీన్‌ ‌చాలెంజ్‌పై సక్షించారు. ప్రతీ ఒక్కరు మూడు మొక్కలను నాటే విధంగా చర్యలు తీసు కోనున్నారు. నర్సరీలలో గ్రీన్‌ ‌చాలెంజ్‌కు అవసరమైన మొక్కలు లేకపోవడంతో అటవీ శాఖ నిర్వహిస్తు న్న నర్సరీల నుంచి మొక్కలను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ గ్రామానికి వెయ్యి మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకుం టున్నారు. కనీసం మూడు సెంటీటర్ల ఎత్తులో ఉన్న మొక్కలను మాత్రమే నాటాలని సూచిస్తున్నారు. గ్రామ నర్సరీలలో మొక్కలు అందుబాటులో లేకపోతే ఇతర నర్సరీల నుంచి మొక్కలను తీసుకొచ్చి అందు బాటులో ఉంచుకోవాలని గ్రామ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చారు. మొక్కలు నాటే స్థలాలను ఎంపిక చేసి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా గ్రామ పంచాయతీల అధికారులకు సూచిస్తున్నారు. కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రతీఒక్కరు మూడు మొక్కలను నాటిన ఫొటోలను ఈ యాప్‌లో అప్‌లోడ్‌ ‌చేస్తే వారం రోజుల తర్వాత పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి వనమాలి బిరుదులను ప్రకటిస్తారు. ’ఒక రోజులో.. ఒక గంట.. ఒక కోటి మొక్కలు’ అనే నినాదంతో చేపడుతున్న గ్రీన్‌ ‌చాలెంజ్‌ ‌కార్యక్రమాన్ని ఈ నెల 17న ఉదయం 10గంటల నుంచి 11గంటల వరకు చేపట్టను న్నారు. హారిత సంకల్పానికి కృషి చేసిన వారికి ప్రభుత్వం వనమాలి బిరుదులకు ఎంపిక చేయనుంది. ఈ బిరుదు లను అందుకున్న వారికి ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యతను కల్పించనున్నారు. జిల్లాలవ్యాప్తంగా మొక్కలు నాటే స్థలాల గుర్తింపును పూర్తి చేశారు. అన్ని మొక్కలు ఒకే చోట కాకుండా గ్రామంలో ఎంపిక చేసిన నాలుగైదు స్థలాల్లో నాటాల్సి ఉంటుంది. నాటిన మొక్కలను తప్పనిసరిగా సంరక్షించే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రత్యేక సమావేశాలలో గ్రామకార్యదర్శులకు సూచించారు. మండలాల వారీగా ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులతో పాటు సర్పంచ్‌లకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారులతో పాటు జిల్లాస్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా గ్రీన్‌ ‌చాలెంజ్‌పై సక్షించారు. ప్రతీ సర్పంచ్‌ ‌తప్పనిసరిగా ఒక్క మొక్కనైనా నాటాల్సి ఉంటుంది. గ్రామాల్లో సర్పంచ్‌లే ఈ కార్యక్రమానికి పూర్తి బాధ్యత వహించాలి.