తెలంగాణలో పులుల సంఖ్య పెరిగింది…!
- – గతంలో 20ఉంటే.. ఇప్పుడు 26 పులులున్నాయి
- – ప్రభుత్వం చేపట్టిన అటవీరక్షణ చర్యలవల్లే పులుల సఖ్య పెరిగింది
- అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
హైదరాబాద్, జులై29 : తెలంగాణలో పులుల సంఖ్య గతంకంటే ప్రస్తుతం పెరిగిందని, పులల సంఖ్య పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ‘ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్-2018’ను సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం తెలంగాణ అడవుల్లో 26 పులులు ఉన్నట్లు తేలిందని మంత్రి తెలిపారు. గతంలో 20 పులులు ఉన్నట్లు ఓ అంచనా ఉండేదని.. రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ చేపట్టిన అటవీ రక్షణ చర్యల వల్లే పులుల సంఖ్య పెరిగేందుకు దోహదపడ్డాయని మంత్రి పేర్కొన్నారు. వేటాడడం, అడవుల నరికివేత, ఆవాసాల విధ్వంసం,
పర్యావరణ మార్పులు, మనిషి – పులుల మధ్య ఘర్షణ తదితర కారణాల వల్ల పులులు, ఇతర వన్యప్రాణులు అంతరించిపోతున్నాయని మంత్రి గుర్తు చేశారు. వన్యప్రాణులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వన్యప్రాణుల పట్ల మరింత బాధ్యతాయుతంగా మెలగాల్సిన అసవరం ఉందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వన్యప్రాణుల రక్షణ, అటవీ సంరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న రెండు పులుల సంరక్షణ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం మంచి రేటింగ్‌ను ఇచ్చిందని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు, సిబ్బందిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి