చిట్టినాయుడూ.. కొద్దిరోజులు ఓపికపట్టు
- – విూరు నిప్పులో, తప్పులో ప్రజలే చెబుతారు
- – సతీశ్‌తో బాబు, టీడీపీ నేతల సంబంధాలపై కేంద్రం దర్యాప్తు జరిపించాలి
- – చంద్రబాబు, లోకేశ్‌పై వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శలు
అమరావతి, జులై29 : మాంసం వ్యాపారి మొయిన్‌ఖురేషీ మనీల్యాండరింగ్ కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సాన సతీశ్‌కుమార్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుతోనే సీబీఐ ఉన్నతాధికారుల మధ్య లుకలుకలు బయటపడటమే కాదు, ఒకరిపై ఒకరు కేసులు నమోదుచేసుకునే వరకు వెళ్లి, ఆ సంస్థ ప్రతిష్ఠను బజారుకీడ్చింది. తాజాగా, సానా సతీశ్‌ను ఈడీ అరెస్ట్ చేయడంతో మరోసారి ఈ కేసు వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. సాన సతీశ్‌తో బాబు, ఇతర టీడీపీ నేతల సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో పలు ఆరోపణలు చేస్తూ… చిన్న ఉద్యోగం చేసుకునే సాన సతీశ్, అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లకు పనులు చేసిపెట్టే స్థాయికి ఎదగడం వెనుక చంద్రబాబు ఉన్నారని, ఈ విషయం అందరికీ తెలుసని ఆరోపించారు. అలాగే రాజధాని అమరావతిలో వేల ఎకరాలు లాగేసుకున్నారని లోకేశ్‌ను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు. అమాయక రైతుల పొట్టకొట్టి విూరు, విూ బినావిూల లాగేసుకున్న వేలాది ఎకరాల స్టోరీలను సీరియల్‌గా బయటకు తీసుకొస్తాయని వ్యాఖ్యానించారు.
కొద్ది రోజులాగు చిట్టి నాయుడూ.. అమరావతి కలల రాజధానో, కులపు రాజధానో తెలుస్తుంది. ఇన్సైడర్
ట్రేడింగుతో అమాయక రైతుల పొట్టకొట్టి విూరూ, విూ బినావిూలు లాగేసుకున్న వేల ఎకరాల స్టోరీలన్నీ సీరియల్‌గా బయటకొస్తాయి. విూరు నిప్పులో తుప్పులో ప్రజలే చెబుతారు. కాండ్రించి ఉమ్ముతారంటూ విజయసాయి ట్వీట్లో పేర్కొన్నారు.