మే 7 వరకు లాక్ డౌన్ పొడిగింపు…!!

తెలంగాణలో మే 7 వరకు లాక్ డౌనను పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. తదుపరి కార్యచరణను మే 5న మరోసారి సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏప్రిల్ 20 తర్వాత కూడా రాష్ట్రంలో ఎలాంటి సడలింపులు ఉండవని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సడలింపులు ప్రకటించినప్పటికీ, తెలంగాణలో పరిస్థితుల దృష్ట్యా మే 3 వరకు నిబంధనలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. మే 7 వరకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు అనుమతి రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఎలాంటి పండగలైనా పరిమిత సంఖ్యలో ఇళ్లలోనే జరుపుకోవాలని చెప్పారు. రంజాన్ మాసం అయినప్పటికీ ఎలాంటి సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదన్నారు.