వైద్య పరికరాల తయారీ పై దృష్టి
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్
న్యూఢిల్లీ: దేశంలో 325 జిల్లాల్లో కరోనా కేసులు లేవని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. అలాగే, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 941 కరోనా పాజిటివ్ కేసులు 37 మరణాలు నమోదైనట్టు వెల్లడించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. “మేకిన్ ఇండియా ద్వారా వైద్య పరికరాల తయారీ పై దృష్టి పెడుతున్నాం. లా డౌన్లో పనిచేసే సిబ్బంది ఆరోగ్యం పై దృష్టిసారిస్తున్నాం. లాక్ డౌనను మరింత కఠినతరం చేయాలని రాష్ట్రాలను కోరాం. వలస కూలీలు, కార్మికులకు వసతి, ఆహారం అందిస్తున్నాం. ఇప్పటివరకు 2.90లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించాం. అత్యవసరాల కొరత లేకుండా చూస్తున్నాం. డబ్ల్యూ హెచ్ వోతో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నాం” అని వివరించారు. 11 కేసులొచ్చాయ్.. అందరూ డిశ్చార్జ్ అయ్యారు అండమాన్ నికోబార్ దీవుల్లో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందరూ కోలుకొని డిశ్చార్జి అయినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) చేతన్ సంఘి వెల్లడించారు. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను తమ కేంద్రపాలిత ప్రాంతంలో కొనసాగించనున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2.90 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. 12,380 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటివరకు 1489 మంది బాధితులు కోలుకోగా 414 మంది మృతి చెందినట్లు చెప్పారు. నిన్న ఒక్కరోజే 941 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. 37 మంది మృతిచెందారన్నారు. దేశంలో 325 జిల్లాల్లో కరోనా కేసులు లేవని ఆయన వెల్లడించారు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దిల్లీలో మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎక్కడా అత్యవసరాలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మేకిన్ ఇండియా ద్వారా వైద్య పరికరాల తయారీ పై దృష్టిసారించామన్నారు. లాక్ డౌన్లో పనిచేసే సిబ్బంది ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలను కోరినట్లు లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 20 తర్వాత గ్రీన్ జోన్ ప్రాంతాల్లో కొన్ని రంగాలకు వెసులుబాటు కల్పించేందుకు అవకాశాలున్నాయన్నారు. వలస కూలీలు, కార్మికులకు ఆహారం, వసతి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు.