కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

కేసీఆర్ సర్కార్ పై అఖిల పక్ష నేతల అసహనం

హైదరాబాద్: నాంపల్లి ఎగ్సిబిషన్ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో బుధవారం కరోనో వైరస్, ప్రభుత్వ చర్యల విషయంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అఖిలపక్షం నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారం పై కేసీఆర్ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సూచనలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి.హనుమంతరావు, టీటీడీపీ నుంచి ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, టీజేఎస్ నుంచి కోదండరాం, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, మనఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ బేటీలో ముఖ్యంగా తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా ప్రబలుతుందని అఖిలపక్షం ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేయాలని అఖిలపక్ష నేతలు భావిస్తున్నారు. సమావేశం అనంతరం అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా కలవాలని దీనికి సంబంధించి ఒక లెటర్ తయారుచేసి ఎజెండాగా పెట్టుకున్నారు. గులాబీ ప్రభుత్వం పై అఖిలపక్ష నాయకులు మరోసారి మండిపడ్డారు. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ప్రభుత్వం నిరు పేదలకు, వలస కూలీలకు తగు న్యాయం చేయక పోగా తప్పుడు ప్రచారం చేస్తోందని అఖిలపక్షానికి హాజరైన నేతలు విమర్శించారు. నాంపల్లి ఎగ్సిబిషన్ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో కరోనో వైరస్, ప్రభుత్వ చర్యల విషయంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. టీటీడీపీ అధ్యక్షులు ఎల్. రమణ, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం, ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్ పాల్గొన్నారు. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ప్రభుత్వ సహాయ చర్యలు ప్రకటనలకే పరిమితమయ్యాయని నేతలు ఘాటుగా విమర్శించారు. కరోనా కష్టకాలం.. ప్రభుత్వ సహాయ చర్యల పై కాంగ్రెస్ ఆధ్వర్యంలో అఖిలపక్షం.. కోవిడ్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ముందుండి పోరాడుతున్న వైద్యులు, పోలీసులు ఇతర సిబ్బంది కి అఖిలపక్షం తరుపున అభినందనలు తెలిపారు ప్రొఫెసర్ కోదండరాం. ప్రజలు వైద్యులకు సహకారాన్ని అందించాలని, వారి పై దాడులు చేయడం సరికాదని కోదండరాం సూచించారు. లాక్ డౌన్ సమయంలో ప్రతిపక్షాల మద్దతు ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉంటుందని తెలిపారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే సరిపోదని, ఏరియా ఆస్పత్రి అభివృద్ధి, 104, 108 అంబులెన్స్ లను పునరుద్ధరించి రోగులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా మానవత్వంతో ఉపాది కోల్పోయిన ప్రతి ఒక్కరికి రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. టీ సర్కార్ తప్పుడు లెక్కలు.. అంతే కాకుండా రాబోయే రెండు నెలలకు రెక్కాడితే గాని డొక్కాడని నిరు పేదలకు, వలస కూలీలకు 5వేల ఆర్థిక సాయం అందించాలని అఖిల పక్ష నేతలు డిమాండ్ చేసారు. ఇళ్ల కీరాయిల చెల్లింపుల పై వాయిదా వేస్తూ ఆర్డర్ తేవాలని ఇది చాలా మంది చిరు ఉద్యోగులకు లాభసాటిగా ఉంటుందనే అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేసారు. అంతే దూర ప్రాంతాల నుండి వచ్చి ఇరుక్కు పోయిన వారిని వారి స్వస్థలాలకు పంపించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని టీ సర్కార్ కు అఖిల పక్ష నేతలు సూచించారు. కరోనా మహమ్మారి వలన రెండవ ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ మంది చనిపోయే పరిస్థితి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారని టీపిసిసి చీఫ్ ఉ త్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. మీడియా స్వేచ్చను కోల్పోయిందని, మీడియా పై తెలియని నిర్బంధాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విధిస్తున్నారని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేసారు. గత నెల 22న ప్రకటించిన సాయం ఇప్పటికీ కూడా లబ్ది దారులకు అందలేదని చెప్పారు. వలస కూలీల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతున్నారని, వారి జీవనోపాది కోసం 12కిలోల బియ్యంతో పాటు ఆర్ధిక సాయం అందిచాలని డిమాండ్ చేసారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం వాస్తవాలు చెప్పాలి.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం.. సీఎం వాస్తవాలు చెప్పాలన్న అఖిలపక్షనేతలు.. అంతే కాకుండా ముఖ్యమంత్రి అనాలోచిత చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు నేతలు. కేవలం రెండు వారాల పాటు లాక్ డౌన్ ఉంటేనే వేతనాల్లో కోత విధించే పరిస్థితి ఏర్పడిందని, దీంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎంత చితికిపోయిందో తేటతెల్లం అవుతుందని టీడిపి తెలంగాణ అధ్యక్షుడు యల్ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి, ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్ అభిప్రాయపడ్డారు. అంబెడ్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు పై పెట్టిన కేసులు ఉపసంహరణ చేసుకోవాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది.