స్వీయనియంత్రణ పాటించాలి

మంత్రి హరీష్ రావు 

సిద్ది పేట: లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బంది ఉంది కాబట్టి ప్రభుత్వం తరుపున ప్రజలకు సరుకులు అందజేస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కొండా మల్లయ్య గార్డెన్ లో సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారాయణరావు పేట మండలాల ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువుల కిట్ ను హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మా తప్పని సరిగా ధరించాలన్నారు. రోడ్ల పై ఉమ్మి వేయవద్దని ప్రజలకు సూచించారు. లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బంది ఉంది కావున ప్రభుత్వం తరుపున సరుకులు అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, 1500 రూపాయలు ఇస్తున్నామని హరీష్ రావు తెలిపారు. బ్యాంక్ లో డిపాజిట్ అయిన డబ్బులను సామాజిక దూరం పాటించి తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. అందరూ ఇళ్లకే పరిమితమై సమాజాన్ని కాపాడేందుకు కృషి చేయాలని హరీష్ రావు తెలిపారు.