నిరాడంబరంగా బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం
-పార్టీ పతాకావిష్కరణలో సామాజిక దూరం పాటించాలి – కార్యకర్తల త్యాగ ఫలితమే నేటి ప్రగతి – పార్టీ కార్యాలయాలలో జెండావిష్కరణ చేయండి -శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ప్రముఖులకు నివాళులర్పించండి -దీప ప్రజ్వలన ద్వారా దేశ ప్రజలు సంకల్ప బలాన్ని చాటారు – కరోనా పై యుద్ధంలో అంతిమ విజయం మనదే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు చేస్తున్న పోరులో భారతీ యులందరినీ ఏకం చేసేందుకు వివిధ కార్యక్రమాలకు పిలుపునిస్తున్న ప్రధాని మోదీ తాజాగా భాజపా కార్యకర్తలకు మరో టాస్క్ ఇచ్చారు. సోమవారం భాజపా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కొవిడ్ పై పోరాడుతున్న వారికి సంఘీబావంగా కార్యకర్తలంతా ఒకపూట భోజనం మానెయ్యాలన్న పార్టీ సూచనను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. పార్టీ జెండా ఆవిష్కరణలో సామాజిక దూరం పాటించాలని సూచించారు. పార్టీని ఈ స్థాయికి తీసుకురావడంలో అనేక మంది కార్యకర్తలు కృషి చేశారని.. వారి త్యాగ ఫలితంగానే నేడు ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని వ్యాఖ్యానించారు. అంతకుముందు పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఆ సమయంలో సామాజిక దూరం పాటించాలని సూచించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయకు నివాళులర్పించాలని కోరారు. లాక్ డౌ తో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు వివిధ రూపాల్లో సంఘీభావం తెలపాలన్నారు. అందులో భాగంగా ఒకపూట భోజనం మానెయ్యాలని పిలుపునిచ్చారు. ‘ఫీడ్ ద నీడ్’ కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యకర్త ఆరుగురికి భోజనం అందించాలని కోరారు. పోలింగ్ కేంద్రం స్థాయిలో ప్రతి ఒక్కరూ మరో ఇద్దరికి మాస్క్ లు అందజేయాలని సూచించారు. ఈ కష్టకాలంలో విధులు నిర్వహిస్తున్న ఉ ద్యోగులకు ధ కరోనా తీవ్రతను దేశ ప్రజలంతా అర్థం చేసుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. మహమ్మారి పై పోరులో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. నిన్న రాత్రి 9 గంటలకు లైట్లు ఆపి దేశ ప్రజలంతా దీపాలు వెలిగించి సంఘీభావాన్ని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. 130 కోట్ల మంది ప్రజలు తమ సంకల్ప శక్తిని చాటారన్నారు. నేడు భాజపా 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిర్వర్తించాలని కార్యకర్తలకు సూచించారు. మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరం ఒక్కటవుదాం అని పిలుపునిచ్చారు. దేశాన్ని కరోనా పట్టిపీడిస్తున్న నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. కరోనా కట్టడికి కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల సహకారంతో ముందుకు సాగుతున్నామన్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా సహకరించాలని మోదీ పిలుపునిచ్చారు. మరింత సంఘటితమై మహమ్మారిని తరిమికొట్టాలన్నారు. జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్, దీపాలు వెలిగించడం.. ఇలా ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ప్రజలు పరిణితితో వ్యవహరిస్తున్నారని మోదీ అభిప్రాయపడ్డారు. భారత్ తీసుకుంటున్న చర్యల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా ప్రశంసించిందని గుర్తుచేశారు. జీ-20 వంటి సమావేశాల్లో భారత్ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. కరోనా పై చేస్తున్న యుద్ధంలో కచ్చితంగా విజయం సాధించి తీరతామని ధీమా వ్యక్తం చేశారు. కరోనా వైరస్ పై సుదీర్ఘ పోరాటం చేయాల్సివుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మహమ్మారిపై విజయం సాధించాల్సినందున అప్పటి వరకు దేశ ప్రజలు అలసిపోవడంగానీ, ఆదమరిచి విశ్రమించడంగానీ చెయ్యొదన్ని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. “కరోనా వైరస్ మహమ్మారిపై ఇప్పుడు జరుగుతున్నది సుదీర్ఘ యుద్ధమని నేను పూర్తి బాధ్యతాయుతంగా చెబుతున్నాను. అయితే ఈ యుద్ధంలో మనం అలసిపోవడంగానీ, విశ్రమించడంగానీ చేయరాదు. ఇది గెలిచి తీరాల్సిన యుద్ధం. ఇవాళ దేశం ముందున్న ఒకే ఒక్క లక్ష్యం, సంకల్పం ఈ యుద్ధంలో గెలవడమే…” అని పేర్కొన్నారు.