నగరంలో నేరాలు తగ్గాయి

ఒక్కసారిగా 33 నుంచి 55 శాతం తగ్గిన క్రైం రేటు

-హత్యలు,కిడ్నాప్ లు, ఇతర నేరాలు తగ్గుముఖం – కరోనాను నియంత్రించేందుకు విధించిన లాక్ డౌనే కారణం – జనమంతా ఇళ్లలోనే ఉండటంతో తగ్గిన దొంగతనాలు -వాహనాల రాకపోకల బం’ తగ్గిన రోడ్డు ప్రమాదాలు – రోడ్లపైకి ఎక్కనీయకుండా చేస్తున్న పోలీసులు 

హైదరాబాద్: లా డౌన్ కారణంగా రా ష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయి. సాధారణ రోజుల కంటే కాస్త అటూ ఇటుగా 33 నుంచి 55 శాతం తగ్గుద ల నమోదైంది. రోడ్లపై, వీధుల్లో జ నసంచారం లేకపోవడం నేరాలు త గ్గడానికి ప్రాథమిక కారణమైతే.. ప్ర తీ వీధిలోనూ పోలీసు గస్తీ, ని ఘా పెరగడం రెండో కారణం. అదే సమయంలో లాక్ డౌన్ కు సంబంధించిన కేసులు మాత్రం పెరుగుతున్నాయి. నగరాలు, పట్టణాల్లో ప్రజలు ముఖ్యంగా యువత లాక్ డౌన్ నిబంధనల ను ఇష్టానుసారంగా ఉల్లంఘిస్తున్నారు. మార్చి 22 నుంచి 31 వ రకు 10 రోజుల పాటు రాష్ట్రం లోని వివిధ జిల్లాలు, కమిషనరేట్లలో 4 వేలకు పైగా నేరాలు నమోదయ్యాయి. 2018 నేషనల్ క్రైం బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం.. ఈ నేరా లను పోల్చి చూసినపుడు ఐపీసీ సెక్షన్ల కింద రోజూ 383 నేరాలు నమోదు కాగా, 33 శాతం (254 నేరాలు మాత్రమే) తగ్గుదల నమోదైంది. ఇందులో సాధారణంగా పెట్టి కేసులు ఎక్కు వగా ఉంటాయి. ప్రస్తుతం నమోదైన ఐపీసీ కే సుల్లో అధికశాతం లాక్ డౌను సంబంధించిన వే కావడం గమనార్హం. ఇక కిడ్నాపుల పరంగా చూస్తే… రోజుకు సగటున దాదాపు 5 కిడ్నాపు కేసులు నమోదు కాగా… ఈ పదిరోజుల్లో రోజు కు 2.5 కేసులే నమోదయ్యా యి. 2018 ఎన్‌సీఆ ర్ బీ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో రోజుకు 2.5 హత్యల చొప్పున నమోదవగా.. ఈ పదిరోజుల్లో రోజుకు 1.4 హత్యల చొప్పున రికార్డయింది. పదిరోజుల్లో 4,369 కేసులు.. డెకాయిటీ (1), రాబరీ (2), పగ టి చోరీలు(2), రాత్రి చోరీలు (17), దొంగతనాలు (153), హత్య లు (14), అల్లర్లు (14), కి డ్నా ప్లు (24), లైంగిక దాడులు (8), తీవ్రంగా గాయపర్చడం (4), స్వల్పదాడులు (260), మోసాలు (101), నమ్మకద్రోహం (12), మాద కద్రవ్యాల సరఫరా (0), హ త్యాయత్నాలు (18), తీవ్ర రోడ్డు ప్రమాదాలు (48), సా ధారణ రోడ్డు ప్రమాదాలు (92), ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసులు (2,546), ఇతర సెక్షన్ల కింద 1,053 కేసులు కలిపి మొత్తంగా పదిరోజుల్లో 4,369 కేసులు నమోదయ్యాయి. అధిక రోడ్డు ప్రమాదాలు అందువల్లే.. రోడ్ సేఫ్టీ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో రో జుకు సగటున 63 రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. అందులో 60మంది గాయపడగా, 18 మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ పది రోజు ల్లో చిన్నా పెద్దా అన్నీ కలిపి 140 రోడ్డు ప్రమా దాలు జరిగాయి. వీటిలో 90 శాతం ప్రమాదా లు వాహనదారుల స్వయంకృతాపరా ధం వల్లే జరిగాయని పోలీసులు చెబుతున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. దాంతో అందరు ఇళ్లకు పరిమితమయ్యారు. ఈ లాక్ డౌన్ కారణంగా నేరస్థులు దొంగతనాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రాల్లో దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల వల్ల మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గినట్లు తెలుస్తుంది. గత రెండు వారాలుగా లాక్ డౌన్ కారణంగా క్రైమ్ రేటు తగ్గుతూ వస్తుంది. లాక్ డౌన్ కారణంగా చాలామంది ఇండ్లలో ఉండటం వల్ల దొంగతనాలు, దోపిడిలు చేయటానికి వీలుగా లేకపోవటం. వీధుల్లో పోలీసు బలగాలు మోహరించి ఉండటం వల్ల నేరస్థులు తప్పించుకుని పోవటానికి అంత సులభంగా కాదు. దొంగతనం చేసిన వస్తువులను అమ్మటానికి మార్కెట్లు తెరచి లేకపోవటం వంటి వాటి వల్ల క్రైమ్స్ జరగటం లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో పాటు బార్లు, వైన్ షాపులు మూసివేయటం కూడా సహాయ పడిందంటూ పోలీసులు అంటున్నారు. గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో బెంగుళూరులో క్రైమ్ రేటు తక్కువగా నమోదయ్యింది. ఉదాహరణకు గొలుసు స్నాచింగ్ విషయానికి వస్తే మార్చి నెలల్లో కనిష్టంగా 5 కేసులు నమోదయ్యాయి. వెహికల్ దొంగతనాల సంఖ్య కూడా గతేడాది మార్చి నెలతో 432 కేసులు నమోద్యతే ఈ నెలల్లో మాత్రం 249 గా నమోదయ్యినట్లు నివేదికలు వెల్లడించాయి. రోడ్డు ప్రమాదాల వల్ల మరణించే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఒడిశా ప్రాంతంలో కూడా గత రెండు వారాలుగా అత్యాచారాలు, దొంగతనాలు,దోపిడీలు వంటి నేరాల సంఖ్య తగ్గినట్లు తెలుస్తుంది. అంతకుముందు రాష్ట్రంలో ఒక రోజులో దాదాపుగా 332 కేసులు నమోదయ్యేయి. ప్రస్తుతం వీటి సంఖ్య 150 కి పడిపోయింది. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా భువనేశ్వర్, పూణే, భోపాల్ వంటి పాంత్రాల్లో నేరాలు సంఖ్య తగ్గినట్లు నివేదికలు తెలిపాయి. హైదరాబాద్ రాష్ట్రంలో కూడా నేరాల సంఖ్య తగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అని కొన్ని నివేదికలు వెల్లడించాయి.