ఏపీలో తొలి కరోనా మరణం
రాష్ట్రవ్యాప్తంగా 161కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 161కి చేరిందని వైద్య ఆఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో ప్రకటించింది. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9గంటల వరకు కొత్తగా 12 కేసులు నమోదయ్యాయని తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరు 8, విశాఖలో 3 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తొలి కరోనా మరణం నమోదైంది. విజయవాడకు చెందిన వ్యక్తి(55) కరోనా వైరతో బాధపడుతూ సోమవారం మృతి చెందినట్లు వెల్లడైంది. కరోనా మరణాన్ని ప్రభుత్వం ధ్రువీకరించింది. మార్చి 30న ఉదయం 11.30గంటలకు చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చారని, గంట వ్యవధిలో మధ్యాహ్నం 12.30గంటలకు ఆ వ్యక్తి చనిపోయాడని ప్రభుత్వం ప్రకటించింది. కుమారుడి నుంచి తండ్రికి వైరస్ సోకిందని వైద్యులు భావిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తి ఆసుపత్రినుంచి డిశ్చార్జి అయ్యాడు. లండన్ నుంచి వచ్చిన రాజమహేంద్రవరానికి చెందిన విద్యార్థి కాకినాడ జీజీహెచ్లో చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు తెలిపారు. విద్యార్థి కుటుంబ సభ్యులు, స్నేహితుల నమూనాలు అన్నింటిలోనూ నెగిటివ్ ఫలితాలు వచ్చాయని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ నయీం హస్మీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ రాఘవేంద్రరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చూస్తోందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్న ఆయన, కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం కొంత ఊరటనిచ్చే విషయం అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. అయితే ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులన్ని ఢిల్లీ మర్కజ్కి వెళ్లి వచ్చిన వాళ్లవేనని, ఇంకా ఎవరైనా ఢిల్లీ వెళ్లి వచ్చిన వాళ్ళు ఉంటే స్వచ్ఛదంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి బాలినేని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నిత్యావసర సరుకులు అధిక రేట్లకు అమ్ముతున్నట్లు తనకు ఫిర్యాదులు వచ్చాయని, అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని బాలినేని మరోసారి హెచ్చరించారు. సీఎం జగన్ ముందు చూపుతో వాలంటీర్ల వ్యవస్థ అమలు చేశారని, కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో వారే కీలకంగా మారారన్నారు. అధికారులు, ఉద్యోగులు అందరూ బాగా కష్టపడుతున్నారని వారి సేవలు అభినందనీయమని కొనియాడారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న రేషన్ కార్డుదారులకు శనివారం నుంచి రూ. 1000 అందజేయనున్నామని బాలినేని తెలిపారు. క్షయ వ్యాధిని తరుముదాం మనదేశంతోపాటు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఈ క్షయరోగం కారణంగా ముఖ్యంగా పేద కుటుంబాలు ఉక్కిరిబిక్కిరయిపోతున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మంది క్షయ వ్యాధికి గురవ్రతుండగా 16 లక్షల మంది ఈ వ్యాధికారణంగా అసువ్రులు బాస్తున్నారు. కరోనా, సార్స్, స్వైన్ఫ్లూ, క్షయ ఇవన్నీ శ్వాసకోశ సంబంధ అంటువ్యాధులే. అయితే కరోనా, సార్స్, స్వైన్ఫ్లూ, ఉప్పె నలా విరుచుకుపడేవయితే, క్షయను మాత్రం నిశ్శబ్ద హంతకిగా చెబుతారు. ఎయిడ్స్ తర్కాత ఎక్కువ మందిని బలిగొబంటున్న అంటు వ్యాధి ఈ క్షయ. మైక్రో బాక్టీరియామ్ ట్యూబర్ క్యులోసిస్ అనే బాక్టీరియా ఈ క్షయ వ్యాధిని కలిగిస్తుంది. డాక్టర్ రాబర్ట్ కోచ్ క్షయవ్యాధికారక బాక్టీరియాను 1882 మార్చి 24న కనుగొన్నందున, ఆ రోజున ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినంగా జరుపుతున్నారు. మనదేశంతోపాటు ప్రపంచమంతటా ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజలను భయకంపితులను చేస్తున్నది. దీర్ఘకాలంగా ఉండే దగ్గు, రాత్రిపూట జ్వరం, చెమటలు పట్టడం, శ్వాసించడంలో ఇబ్బందులు, ఛాతినొప్పి, ఆకలి తగ్గటం, బరువ్ల తగ్గడం మొదలైన లక్షణాల ద్వారా ఈ వ్యా ధిని ప్రాథమికంగా గుర్తించవచ్చు. ఛాతీ ఎక్సరే, పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. ఊపిరితిత్తులకు కాకుండా ఇతర అవయవాలకు సోకిన క్షయను గుర్తించడానికి సి.టిస్కాన్ ఎమ్ఎ ఱ స్కాన్ లాంటి పరీక్షలు ఉపకరిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 30 శాతం జనాభా ఈ మహమ్మారి బారినపడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది భారత్ లోనే ఉన్నారు. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది క్షయరోగులు ఉంటారని ఒక అంచనా. 2018లో ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది ఈ వ్యాధితో మ రణించగా మనదేశంలో ఈ మరణాలు నాలుగు లక్షలకు పైగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. 2019 టిబి ఇండియా నివేదిక మనదేశంలో ఈ వ్యాధి తీవ్రతను కళ్లకు కట్టింది. ఈ నివేదిక ప్రకారం మనదేశంలో 2017-18లో లక్షల కేసులు నమోదుకాగా, 2018లో 17 శాతం పెరిగి 21.5లక్షల కేసులు నమోదయినట్లు తెలుస్తుంది. హెచ్ఐవి రోగుల మరణాలకు టిబి ఒక కారణంగా మారుతుంది. మనదేశంలో 25 లక్షల హెచ్ఐవి బాధితుల్లో 18 లక్షల మంది క్షయరోగులున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ఈ వ్యాధి మూలంగా ఏటా సుమారు 20 వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ప్రధాని వెల్లడించారు. 2030 నాటికి ప్రపంచంలో క్షయలేకుండా చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సంకల్పిస్తుండగా దానికి ఐదు సంవత్సరాలు ముందుగానే 2025 నాటికి మనదేశంలో క్షయవ్యాధిని నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నది. కేంద్రం 2019 సెప్టెంబరు ఐదున ‘టిబి హారేగా దేశ్ జీతేగా నినాదంతో ఈ వ్యాధి నిర్మూలనకు నడుం బిగించింది. పొగ త్రాగేవారిలో, మద్యపానం, అధికంగా చేసే వారితో, పాన్ పరాగ్, గుట్కా, మత్తు పదార్థాలు వాడేవారు ఎక్కువగా క్షయబారిన పడుతున్నారు. నిరక్షరాస్యత, పౌష్టికాహారలోపం, పేదరికం, వ్యాధి గురించి అవగాహన లేకపోవడం తదితర కారణాలతో ఈ వ్యాధి విజృంభిస్తున్నది. బహిరంగంగా పొగతాగరాదన్న నిబంధన ఎక్కడా అమలు జరగడం లేదు. సరైన మోతాదులో మందులు వాడకపోయినా, మధ్యలో మందులు మానివేసినా ఈ వ్యాధి లొంగని మొండి వ్యాధిలా మారుతుంది. కొన్ని రకాల టిబిలు మందులకు కూడా లొంగడం లేదు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఈ వ్యాధి సులభంగా సోకి ఇబ్బందులకు గురిచేస్తుంది. ఔషధాల కొరత కారణంగా ప్రపంచం లో ప్రతి ముగ్గురు రోగుల్లో ఒకరికే చికిత్స జరుగుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇంకా ఎన్నో క్షయ కేసులను గుర్తించక లెక్కల్లోకి రావడం లేదు. దగ్గటం, తుమ్మటం ద్వారా తుంపరులతో ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. క్షయ నిర్మూలన కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా, ఆశించినంతగా ఫలితాలు రావటం లేదు. ఈ రోగ నిర్మూలనకు కేటాయించే నిధులు సక్రమంగా పారదర్శకంగా ఖర్చయ్యేలా చూడాలి. ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. క్షయవ్యాధి నిర్ధారణ, నిర్మూలన కార్యక్రమాలు విస్తృతంగా కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొబైల్ లాబ్స్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. అధునాతనమైన వైద్యం అందుబాటులోకి వచ్చినా వ్యాధిని అరికట్టలేకపోవడంపై ఆలోచన చేయాలి. 1962లోనే జాతీయ టిబి నియంత్రణ ప్రణాళిక మొదలయినా ఫలితాలు మాత్రం ఆశించినంతగా లేవ్ల. లక్ష్యాలు నిర్దేశించుకుంటే సరిపోదు. ఆ లక్ష్యాలను చేరడానికి సరైన కృషి, ప్రణాళిక అవసరం. రోగ నివారణలో మన పొరుగు దేశాలు కొన్ని పురోగతి సాధిస్తుండగా మన వెనుకబాటుకు కారణాలను నిజాయితీగా గుర్తించాలి. టిబి నివారణలో రాష్ట్రాల మధ్య మంచి పోటీ ఏర్పడాలి. గుట్కాలను నిషేధించినా ప్రతి గ్రామంలో ఎక్కడో ఒక చోట ఇప్పటికీ వీటి అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. సిబ్బందిలో జవాబుదారీతనం పెంచడంతోపాటు రోగం ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి నివారణ చర్యలు సమగ్రంగా చేపట్టాలి. క్షయవ్యాధి పీడితులున్న కుటుంబాల్లోని బాలలు తప్పనిసరి పరిస్థితుల్లో బాలకార్మికులుగా మారుతున్నారు. వెంట్రుకలు, గోళ్లు,మరికొన్ని భాగాలు మినహా ఏ శరీర భాగంపైనయినా దాడి చేయగలదీ రోగం. క్షయ వ్యాధి బాధిత కుటుంబాలకు కేంద్రం ‘నిక్షయపోషణ్ యోజన కార్యక్రమం కింద 500 రూపాయలు చొప్పున 26 లక్షల మందికి ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఈ సాయాన్ని వెయ్యి రూపాయలకు పెంచాల్సిన అవసరం ఉంది. మందులు వాడిన కొన్ని రోజుల తర్వాత సానుకూల ఫలితాలు వచ్చినా మందులు మధ్యలో ఆపకుండా డోసు ప్రకారం వాడాలి. పసిపిల్లల్లో క్షయవ్యాధి రాకుండా బిసిజి టీకా వేయించాలి. క్షయ నిర్ధారణకు భారత శాస్త్రవేత్తలు రూపొందించిన ట్రూనాట్ టీబిటెస్ట్ తొంభై నిమిషాల్లోనే క్షయ లక్షణాలను పట్టేస్తుంది. ఈ పరీక్షను ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఆమోదించింది. ప్రభుత్వాల చర్యల్లో పురోగతి కనిపిస్తున్నా, ఇంకా అనేక మంది ఈ వ్యాధి కారణంగా అసులుభ్ర బాస్తున్నారు. ఈ వ్యాధి గురించి సమాజాన్ని మరింత చైతన్యం చేయాల్సిన అవసరం చాలా ఉ ంది. పోలియోలాగా క్షయను కూడా సమూలంగా నిర్మూలించడానికి ప్రభుత్వంతో పాటు యావత్ సమాజం కంకణబద్ధులు కావాలి. కుష్టువ్యాధి, గజ్జి, క్షయ (టీబీ) వంటి వ్యాధుల్ని మనం లైట్ తీసుకుంటాం. ఎందుకంటే ఆ జబ్బులు ఇప్పుడు లేవని మన ఫీలింగ్. నిజమే కుష్టువ్యాధి, గజ్జి, తామర వంటివి ఇప్పుడు దాదాపు లేవు. కానీ, క్షయ వ్యాధి మాత్రం సైలెంట్ గా విస్తరిస్తోంది. దురదృష్టమేంటంటే ప్రపంచంలోనే క్షయ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నది భారత్ లోనే. వ్యాధి గురించి సరిగా తెలియకపోవడం, దాన్ని నిర్లక్ష్యం చేస్తుండటంతో… దేశంలో ప్రతి సెకనుకు ఒకరికి టీబీ వ్యాధి వస్తోంది, రోజూ దేశంలో 1000 మంది క్షయ వ్యాధితో చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. తెలంగాణలో 72,674 టీబీ కేసులు ఉన్నాయంటే నమ్మగలరా. అసలా వ్యాధి ఎలా సోకుతుంది? రాకుండా ఏం చెయ్యాలి? వస్తే, ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకుందాం. ప్రాణాలు తీసే క్షయ వ్యాధి మైకోబ్యాక్టీరియమ్ టూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల సోకుతోందని 1882, మార్చి 24న జర్మనీ శాస్త్రవేత్త రాబర్ట్ కుచ్ తెలుసుకున్నాడు. దాని నివారణ కోసం ప్రయత్నించాడు. 1905లో ఆయన్ను నోబెల్ బహుమతి వరించింది. గొంతులో ఏదో (కఫం) ఉన్నట్లు దగ్గు వస్తూ ఉంటుంది. దగ్గకుండా ఉందామన్నా ఉండలేం. పొడి దగ్గు వస్తూ ఉంటుంది. ఏం చేసైనా సరే… రెండు వారాల్లో పొడి దగ్గును తగ్గించేసుకోవాలి. లేదంటే అదే క్షయ వ్యాధి వచ్చేందుకు కారణం అవుతుంది. క్షయ వస్తే ఇక దగ్గు ఆగదు. కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. సాయంత్రం, రాత్రి వేళల్లో జ్వరం వస్తూ ఉంటుంది, చెమటలు పడతాయి.లి బరువు తగ్గిపోతూ ఉంటారు. ఇది స్పష్టంగా కనిపించే లక్షణం. ఎంత తిన్నా బరువు తగ్గిపోతారు. అసలు ఆకలే వెయ్యదు. పెద్దగా పనిచెయ్యకపోయినా ఆయాసం వచ్చేస్తుంది. నీరసం కూడా వస్తుంది. వ్యాధి ముదురుతూ ఉంటే, దగ్గుతోపాటూ (కఫంతోపాటూ)… రక్తం కూడా వస్తూ ఉంటుంది. సమస్యేంటంటే… టీబీ ఒక రకమైన అంటు వ్యాధి. ఈ వ్యాధి ఉన్నవాళ్లు మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఉమ్మివేసినప్పుడు… బయటకు వచ్చే గాలిలో ఉండే తుంపర్లలో బ్యాక్టీరియా… చుట్టుపక్కలవాళ్లకు చేరుతుంది. అలా వ్యాధి వాళ్లకు కూడా సోకుతుంది. ఈ వ్యాధి రెండు రకాలు. మొదటిది ఊపిరితిత్తుల క్షయ. ఇది మనం రెగ్యులర్గా చూస్తుంటాం. రెండోది ఇతర అవ యవాల క్షయ. శరీరంలో ఏ అవయవానికి క్షయ వ్యాధి రావచ్చు. ఊపిరితిత్తుల క్షయ వ్యాధి మాత్రం ప్రతి ఒక్కరికీ వ్యాపించే ప్రమాదం ఉంటుంది. మంచి ఆహారం తీసుకోవాలి. స్పైసీ (మసాలా) ఫూడ్ తగ్గించాలి. దగ్గు, జలుబు, జ్వరం లాంటి వాటిని వీలైనంత త్వరగా తగ్గించేసుకోవాలి. లి రెండు వారాల కంటే ఎక్కువ రోజులు పొడి దగ్గు వస్తూ ఉంటే, వెంటనే డాక్టర్ ను కలవాలి. టీబీపై కేంద్ర ప్రభుత్వం పోరాటం చేస్తోంది. టీబీ ఓడిపోవాలి, ఇండియా గెలవాలి అనే నినాదం తీసుకుంది. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఉచితంగా పరీక్షలు చేస్తారు. క్షయవ్యాధి ఉన్న వారికి నెలకు రూ.500లను ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తోంది. కొంతమందిలో సాధారణంగా మందులు వాడగానే వ్యాధి తగ్గిపోతుంది. తాగుడు, స్మోకింగ్ వంటి అలవాట్లు ఉంటే, వ్యాధి త్వరగా తగ్గకపోగా, ఎండీఆర్ టీబీ (మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ)గా మారుతుంది. వ్యాధి నిర్ధారణ సమయంలో రోగికి సాధారణ టీబీ ఉందా లేక ఎండీఆర్ టీబీ ఉందా అనే దానిని నిర్ధారిస్తారు. లి క్షయకు ఇచ్చిన మందులు ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది. మధ్యలో మానేస్తే ప్రమాదం. మళ్లీ వచ్చేస్తుంది. డాక్టర్లు చెప్పిన మాట వినాల్సిందే. 2030 నాటికి క్షయరహిత ప్రపంచమే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పనిచేస్తోంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 2 శాతం దాకా టీబీ వ్యాప్తి తగ్గుతోంది. 2000-17 మధ్య కాలంలో టీబీని గుర్తించి, చికిత్స అందించడం ద్వారా 5.4 కోట్ల మందిని కాపాడగలిగారు. ఇదంతా కాదు. అసలీ వ్యాధి సోకకుండా జాగ్రత్త పడదాం. దురద ఎష్టవశాత్తూ సోకితే… ఇంకా ఎక్కువ జాగ్రత్త పడి… దాన్ని తరిమికొడదాం.