రేవంత్‌ విడుదల

షరతుతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ జన్వాడ డ్రోన్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చర్లపల్లి జైు నుంచి రేవంత్‌రెడ్డి సాయంత్రం విడుదయ్యారు. కరోనా కారణంగా జైు దగ్గర 144 సెక్షన్‌ విధించారు. 14 రోజుగా చర్లపల్లి జైులో ఉన్న ఆయనకు.. హైకోర్టు ఇవాళ బెయిల్‌ మంజూరు చేసింది. తొుత కుకట్‌ పల్లి కోర్టు ఆయన బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చగా.. ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖు చేశారు. విచారణ అనంతరం షరతుతో కూడిన బెయిల్‌ను అత్యున్నత న్యాయస్థానం మంజూరు చేసింది. క్వాష్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖు చేయాని పోలీసుకు హైకోర్టు ఆదేశాు జారీ చేసింది. క్వాష్‌ పిటిషన్‌పై విచారణ నాుగు వారాపాటు వాయిదా వేసింది.
అండగా ఉంటాం: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
ఎంపీ రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని తెంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…చిన్న చిన్న సెక్షన్ల కింద నమోదైన కేసుకు   ఇన్ని రోజు జైల్లో ఉంచడమేంటని ప్రశ్నించారు. రేవంత్‌ విషయాన్ని ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌ ద ృష్టికి తీసుకెళ్లామని, ఇవాళ మరోసారి స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రివిలైజ్‌ కమిటీకి పంపించాని స్పీకర్‌ను కోరతామన్నారు. చిన్న కేసును అడ్డంపెట్టుకుని ఎంపీని సభకు రానీయకుండా తెరాస అడ్డుకుంటోందని ఆరోపించారు. కేంద్ర హోం మంత్రిని కలిసి తెంగాణలో పరిస్థితుపై వివరిస్తామని చెప్పారు. ఎంపీకే పౌరహక్కు లేకపోతే సామాన్యు పరిస్థితి ఏంటని ఉత్తమ్‌ ప్రశ్నించారు.