31 దాకా తెలంగాణ బంద్‌

కరోనా ప్రభావంతో విద్యాసంస్థు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ మూసివేయాని నిర్ణయం

ఇంటర్‌, పది పరీక్షు యథాతథం

అవసరమైతే రూ.1000 కోట్లు కాదు రూ.5000 కోట్లు ఖర్చు చేస్తాం: కేసీఆర్‌

`శాసన సభ బడ్జెట్‌ సమావేశా కుదింపు
`ప్రమాదం లేకున్నా అప్రమత్తంగా ఉన్నాం
`కేబినెట్‌లో చర్చించి కీక నిర్ణయాు తీసుకుంటాం
`మాస్కు, శానిటైజర్లు, సూట్లు అందించేందుకు సిద్ధం
`కరోనా కోసం సమన్వయ కమిటీ ఏర్పాటు
`ఇతర రాష్ట్రాలోలాగా అన్ని జాగ్రత్తు తీసుకుంటున్నాం
`శంషాబాద్‌ విమానాశ్రయంలో 200 మంది ఆరోగ్య శాఖ సిబ్బంది
`సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి భేటీ

హైదరాబాద్‌ :
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్‌ -19 కేసు దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తున్న వేళ దాన్ని ఎదుర్కొనేందుకు తెంగాణ ప్రభుత్వం కీక నిర్ణయాు తీసుకుంది. జనసందోహాు లేకుండా చూడాన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశా నేపథ్యంలో విద్యా సంస్థను ఈ నెలాఖరు వరకు మూసివేయాని నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ నేత ృత్వంలో భేటీ అయిన ఉన్నతస్థాయి కమిటీలో ఈ నిర్ణయాు తీసుకున్నారు. రాష్ట్రంలో వివిధ పరీక్షు జరుగుతున్న నేపథ్యంలో వాటిని మాత్రం యథాతథంగా కొనసాగించాని ప్రభుత్వం ఆదేశాు జారీచేసింది. థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ను మూసివేయాని నిర్ణయించారు. అలాగే,  శాసనసభ బడ్జెట్‌ సమావేశాను సైతం కుదించాని నిర్ణయించారు. వాస్తవానికి ఈ నె 20 వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితు నేపథ్యంలో నేడు, రేపు సమావేశాు నిర్వహించి.. సోమవారం ద్రవ్య వినిమయ బ్లిుపై చర్చించి ఆమోదించి ఆ రోజుతో సమావేశాు ముగించనున్నారు.
మరోవైపు, దేశంలో కరోనా  బాధితు సంఖ్య 83కు చేరింది. ఈ మహమ్మారి సోకి ఇప్పటివరకు దేశంలో ఇద్దరు ప్రాణాు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యు తీసుకుంటున్నాయి.
 కరోనావైరస్‌(కోవిడ్‌-19)ను ఎదుర్కొనేందుకు అన్ని విధా సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం పెద్దగా లేదని, అయినప్పటికీ తాము అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. శనివారం శాసనసభలో కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు. ప్రజు భయాందోళనకు గురికావద్దని.. కరోనాపై ముందు జాగ్రత్తు తీసుకుంటున్నామని చెప్పారు. అవసరమైతే రూ.1000 కోట్లు కాదు రూ.5000 కోట్లు ఖర్చు చేసైనా కరోనాను కట్టడి చేస్తామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజకు సరిపడా మాస్కు, శానిటైజర్లు, సూట్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గతంలో కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తి కోుకున్నాడని.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశామన్నారు. తెంగాణలో రెండో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైందని చెప్పారు. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని సభలో కేసీఆర్‌ తెలిపారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని, శాంపిల్స్‌ను పుణె ల్యాబ్‌కు పంపామని కేసీఆర్‌ చెప్పారు.
‘కరోనా వైరస్‌ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి హైలెవల్‌ కమిటీ చర్చిస్తోంది. ప్రస్తుతం ప్రమాదం లేకున్నా ముందుజాగ్రత్తు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాు ముందు జాగ్రత్తు తీసుకుంటున్నాయి. బెంగళూరులో కూడా సంస్థను మూసేశారు. చాలా రాష్ట్రాలో థియేటర్లు, స్కూళ్లు బంద్‌ చేశారు. మేము కూడా అన్ని జాగ్రత్తు తీసుకుంటున్నాం. కరోనా కోసం సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశాం. డీసీపీ ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన కమిటీని పర్యవేక్షిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో 200 మంది స్క్రీనింగ్‌ చేస్తున్నారు.  హైలెవల్‌ కమిటీ చర్చించిన అంశాను రాష్ట్ర మంత్రివర్గం కూడా చర్చిస్తుంది. రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఏ రకమైన చర్యు తీసుకోవానే దానిపై చర్చిస్తాం’ అని కేసీఆర్‌ అన్నారు.  
దేశంలో ఇప్పటి వరకు 65 మందికి కరోనా వైరస్‌ సోకగా ఇందులో 17 మంది విదేశీయు ఉన్నారని సీఎం తెలిపారు. 65 మందిలో 10 మందిని డిశ్చార్జి చేశారని పేర్కొన్నారు. ఈ వైరస్‌ వ్ల కేవం ఇద్దరు మాత్రమే చనిపోయారని కేసీఆర్‌ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం జరిగే కేబినెట్‌ సమావేశంలో కరోనాపై విస్త ృతంగా చర్చిస్తామని చెప్పారు. పాఠశాల బంద్‌, తదితర అంశాపై కేబినెట్‌ సమావేశంలో చర్చించి సాయంత్రం ప్రకటిస్తామని చెప్పారు.
 కరోనా అంశంపై శాసనసభలో జరిగిన చర్చలో తెంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడారు. కరోనాపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా వైరస్‌ సోకింది 65 మందికి అయితే.. 10 మంది కోుకున్నారని.. ఇద్దరు చనిపోయారని వ్లెడిరచారు. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్‌ వచ్చిందని.. గాంధీలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా అనుమానిత క్షణాు ఉన్న మరో ఇద్దరి నమూనాను పుణె పరీక్షా కేంద్రానికి పంపినట్లు చెప్పారు.
‘రాష్ట్రంలో ముందు జాగ్రత్త చర్యు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో పాఠశాలు, సినిమాహాళ్లు బంద్‌ చేశారు. మహారాష్ట్ర, ఒడిశాలోనూ మూసివేతు కొనసాగుతున్నాయి. దేశంలోని 6 ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. శంషాబాద్‌ విమానాశ్రయంలో బాగా రద్దీ పెరిగింది. అంతర్జాతీయ సంబంధాు పెరిగి ప్రయాణ, కార్గో విమానాు పెరిగాయి. హైదరాబాద్‌ మెట్రోలో రోజుకు 4 క్ష మంది ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యు తీసుకోవడం ఎంతో అవసరం. దీనిపై ఉన్నతస్థాయి కమిటీని నియమించాం. పొరుగు రాష్ట్రాు ఏం చేస్తున్నాయ్‌.. మనం ఏం చేయాలి అనే దానిపై చర్చించాలి.  ఏం చేయాలో మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం. వ్యాధి ఒకవేళ ఎక్కువగా వ్యాపిస్తే.. ఎలాంటి చర్యు తీసుకోవానేదానిపై కూడా దృష్టి సారించాం. మనకు ఇప్పటికైతే పెద్ద ప్రమాదమైతే ఏమీ లేదు. అయినప్పటికీ అన్ని రకా ముందస్తు చర్యు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కరోనా నియంత్రణకు వెయ్యి కోట్లు కాదు.. అవసరమైతే రూ.5 వే కోట్లు ఖర్చు పెడతాం’ అని ముఖ్యమంత్రి వివరించారు.
కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు సరైన చర్యు చేపట్టడంలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించడంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవరిపేరూ ప్రస్తావించకుండానే పరోక్షంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. కరోనాలాంటి సున్నిత అంశాల్లో రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. తెంగాణ అసెంబ్లీలో కరోనా వైరస్‌పై చర్చ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..కరోనాపై ముందుజాగ్రత్తు తీసుకోకపోవడం వల్లే అనేక దేశాల్లో కరోనా వ్యాప్తి చెందిందన్నారు. ఈ మహమ్మారి గురించి నవంబర్‌ నుంచే వార్తు వస్తున్నాయన్నాయన్న భట్టి.. ఇప్పటికే ముందు జాగ్రత్తు తీసుకుంటే బాగుండేదన్నారు. వైరస్‌ నియంత్రణకు కేంద్రం సీరియస్‌గా తీసుకోలేదని ఆరోపించారు. కేంద్రం రింగ్‌ టోన్‌ పెట్టి వదిలేసింది తప్ప సీరియస్‌గా తీసుకున్నట్టు కనబడటంలేదని ఆరోపించారు.
భట్టి వ్యాఖ్యపై ఘాటుగా స్పందించిన ముఖ్యమంత్రి.. కరోనా లాంటి సున్నిత అంశాల్లో రాజకీయం చేయడంసరికాదని హితవు పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు కరోనా నివారణకు అన్ని చర్యూ తీసుకుంటున్నాయన్నారు. ప్రజల్ని భయాందోళనకు గురిచేసేలా మాట్లాడొద్దన్న సీఎం.. సంయమనంతో వ్యవహరించాని సూచించారు. ప్రతిదాన్నీ రాజకీయం చేయాని చూడటం మంచిది కాదన్నారు. ‘‘కరోనా నియంత్రణకు కేంద్రం ఏమీ చేయలేదనే మాటు సరికాదు. కేంద్రం అనేక ముందు జాగ్రత్తు తీసుకుంటోంది. విదేశా నుంచి రాకపోకను నిలిపివేసింది. ఇలాంటి సమయంలో నాయకు బాధ్యతగా మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని భయాందోళనకు గురిచేయొద్దు. ఎవరో ప్రచారం చేశారని కొన్ని ప్రాంతాను బదనాం చేయొద్దు. విమానాశ్రయంలో 200 మంది వైద్య సిబ్బంది ఉంచాం. వారు 24గంటూ పనిచేస్తున్నారు. కరోనా ప్రబలితే దూపల్లి, వికారాబాద్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం’’ అని వివరించారు.  ప్రపంచ వ్యాప్తంగా విజ ృంభిస్తున్న కరోనా వైరస్‌ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. శాసనసభలో కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు. ఈ వైరస్‌ కట్టడికి ముందు జాగ్రత్తు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కరోనాపై భయం, ఆందోళన వద్దు. దీన్ని కట్టడి చేసేందుకు అవసరమైతే రూ. 5 వే కోట్లు ఖర్చు చేస్తామన్నారు సీఎం. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజకు సరిపడా మాస్కు, శానిటైజర్లు, సూట్లు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.  దేశంలో ఇప్పటి వరకు 65 మందికి కరోనా వైరస్‌ సోకగా ఇందులో 17 మంది విదేశీయు ఉన్నారని సీఎం తెలిపారు. 65 మందిలో 10 మందిని డిశ్చార్జి చేశారని పేర్కొన్నారు. ఈ వైరస్‌ వ్ల కేవం ఇద్దరు మాత్రమే చనిపోయారని కేసీఆర్‌ పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో చేరిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కూడా కరోనా నుంచి కోుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. మరో ఇద్దరికి కరోనా అనుమానిత క్షణాు ఉన్నాయి. వారి నమూనాను పుణె ల్యాబ్‌కు పంపామని కేసీఆర్‌ చెప్పారు.
 మంత్రివర్గ సమావేశం
కరోనా వైరస్‌ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి హైలెవల్‌ కమిటీ చర్చిస్తోంది. రాష్ట్రంలో ఈ వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యపై హైలెవల్‌ కమిటీ సుదీర్ఘంగా చర్చిస్తోందని సీఎం తెలిపారు. ప్రస్తుతం ప్రమాదం లేకున్నా ముందుజాగ్రత్తు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక హైలెవల్‌ కమిటీ చర్చించిన అంశాను రాష్ట్ర మంత్రివర్గం కూడా చర్చిస్తుందన్నారు. ఈ సాయంత్రం 6 గంటకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఏ రకమైన చర్యు తీసుకోవానే దానిపై చర్చిస్తామని సీఎం తెలిపారు. అనంతరం కరోనాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యను ప్రకటిస్తామన్నారు సీఎం.

ప్రతి వందేళ్లకు ఒకసారి ఈ వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తుందన్నారు సీఎం. దాదాపు వందేళ్ల క్రితం ఈ వైరస్‌ సోకి కోటి 4 క్ష మంది చనిపోయారని సీఎం గుర్తు చేశారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ పరిస్థితును గమనిస్తున్నామని చెప్పారు. ఈ వైరస్‌ నియంత్రణకు  కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాు కూడా అప్రమత్తమయ్యాయి. అన్ని రాష్ట్రాు చర్యు తీసుకుంటున్నాయి. పు రాష్ట్రాల్లో సినిమా హాల్స్‌, స్కూల్స్‌ బంద్‌ చేశారు. పెళ్లిళ్లను కూడా వాయిదా వేసుకుంటున్నారు.

దేశంలోని 6 మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రద్దీ బాగా పెరిగింది. హైదరాబాద్‌ మెట్రోలో ప్రతి రోజు 4 క్ష మంది ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్‌కు 2013-14లో 88 క్షు మంది ప్రయాణికు వస్తే ప్రస్తుతం 2 కోట్ల 17 క్ష మంది ప్రయాణికు వస్తున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు 2013-14లో 23 వే ప్రయాణికు వస్తే ఇప్పుడు 57 వే మంది వస్తున్నారు. నాడు 200కు పైగా విమానాు వచ్చేవి. ఇప్పుడు 500కు పైగా విమానాు వస్తున్నాయి. అంతర్జాతీయ కనెక్టివిటీ పెరిగిందనడానికి ఈ విషయం చెబుతున్నాను.  చైనా, సౌత్‌ కొరియా, ఇరాన్‌, ఇటలీ, ప్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌ దేశాల్లో ఈ వ్యాధి అధికంగా ప్రబలింది. దీంతో ఈ దేశా నుంచి వచ్చే ప్రయాణికును మన దేశంలోని అనుమతించొద్దని కేంద్రం వీసాు రద్దు చేసింది. ఈ దేశా నుంచి వస్తున్న ప్రయాణికును 14 రోజు క్వారంటైన్‌ చేసి.. నెగిటివ్‌ అని తేలితేనే బయటకు పంపాలి అనేది కేంద్ర ప్రభుత్వం సూచన అని సీఎం తెలిపారు. ఈ దేశా నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమానాు ఉన్నాయి. అయితే వచ్చే వారు ఏ దేశం నుంచి వస్తున్నారో కూడా తెలియడం లేదు. గత వారం రోజు నుంచి అప్రమత్తంగా ఉన్నాం. 200 మంది ఆరోగ్య శాఖ సిబ్బంది శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఉండి పరీక్షు నిర్వహిస్తున్నారు అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.