భలే మంచి చికెన్ బేరము
కరోనా దెబ్బకు రోజురోజుకూ పడిపోతున్న కనిష్ట ధరు
`రూ.100కే 2 కేజీు అమ్ముతున్న చికెన్
`కూరగాయ ధర కన్నా చౌకగా..
`కొన్ని చోట్ల ఉల్లిపాయ రేట్లే ఎక్కువ
`కిలో చికెన్‌కు అరడజను కోడిగుడ్ల ఆఫర్లు
`మూతపడుతున్న కోళ్ల ఫామ్‌ు
`చిరు వ్యాపారు గగ్గోు
`రెస్టరెంట్లలో చికెన్ సేల్స్ ఢమాల్
`వెవెబోతున్న ఆన్‌లైన్ చికెన్ ఆర్డర్లు
హైదరాబాద్:
హౖదరాబాద్ చికెన్ బిర్యానీకి ఫేమస్ . ఇక అక్కడ హోటల్స్ ఎప్పుడూ బిర్యానీ ప్రియుతో రద్దీగా ఉండేవి. కానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ అంటేనే ఆమడ దూరం పారిపోతున్నారు హైదరాబాదీు . దీంతో హోటళ్లు, రెస్టారెంట్ లో బిజినెస్ బాగా తగ్గింది. చికెన్ తినే నాధుడే లేని పరిస్థితి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా చికెన్ అమ్మకాు తగ్గినా హైదరాబాద్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసు ఒకటి నమోదయ్యే వరకు చికెన్ బిర్యానీ అమ్మకాు జోరుగానే సాగాయి.
ఇక ఎప్పుడైతే హైదరాబాద్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు అయిందని మంత్రి ప్రకటించారో ఒక్కసారిగా చికెన్ గిరాకీ తగ్గిపోయింది. రెండు రోజుగా బిజినెస్ 50 శాతం తగ్గిందని హోటల్, రెస్టారెంట్ నిర్వాహకు చెప్తున్నారు. ఫుడ్ ఆర్డర్లపైన కూడా ఈ ఎఫెక్ట్ ఉన్నదని చెప్తున్నారు. ఒకప్పుడు చికెన్ బిర్యానీ అంటే లొట్టలేసి లాగించిన బిర్యానీ ప్రియు ఇప్పడు కరోనా దెబ్బకు బిర్యానీ అంటేనే మాకొద్దు బాబోయ్ అంటూ పారిపోతున్నారు. ఇక మాస్కు ధరించి భయం గుప్పిట్లో ఉంటున్నారు.
తాజా పరిస్థితు నేపధ్యంలో చికెన్ కు చాలా దూరం ఉంటున్న ప్రజను చూసి ఇక హోటళ్ళు, రెస్టారెంట్ లో సైతం చికెన్ వంటకాు తగ్గిస్తున్నారు. దీంతో పౌల్ట్రీ మొత్తానికే దెబ్బ తినే పరిస్థితి ఉందని కోళ్ళ ఫారాు నిర్వహిస్తున్న వారు బోదిబో అంటున్నారు. ఈ పరిస్థితి నుండి తమను ప్రభుత్వమే కాపాడాని కోరుతున్నారు. చికెన్ తినాని , చికెన్ తింటే కరోనా రాదు అని సాక్షాత్తు కేటీఆర్ చెప్పినప్పటికీ ఎప్పుడైతే తెంగాణలో కరోనా వైరస్ ఎంటర్ అయ్యిందో అప్పుడే జనం చికెన్ కి , చికెన్ బిర్యానీకి నో చెప్పారు . దీంతో హైదరాబాదీ బిర్యానీ కొనుగోళ్ళు లేక రెస్టారెంట్లు వెవెబోతున్నాయి
వంద రూపాయకే 3 కేజీు.. ఇది ఉల్లిపాయ కోసమో లేక టమోటా కోసమో పెట్టిన బోర్డు కాదు. చికెన్.. అది కూడా డ్రెస్‌డ్ చికెన్ అమ్మకానికి పెట్టింది. చిత్తూరు జిల్లా కలికిరిలో చికెన్ సెంటర్ల ముందు వందకు 3 కేజీు అంటూ బోర్డుపెట్టి మరీ అమ్ముతున్నారు. అయినా కొనేందుకు జనం ముందుకు రావడం లేదంటే కరోనా స ృష్టించిన కల్లోం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు నెల క్రితం రూ.180 నుంచి రూ.200 వరకూ పలికిన చికెన్ ఇప్పుడిలా కనిష్ఠ స్థాయికి పడిపోయింది. రోజుకు 100 నుంచి 200 కేజీు అవోకగా అమ్మేవారమని.. ప్రస్తుతం రోజుకు 10-20 కేజీు అమ్మడమే గగనంగా మారిందని చికెన్ షాపు యజమాను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికెన్ అమ్మకాు పడిపోయిన నేపథ్యంలో మటన్ ధరు పెరిగిపోయాయి.
చికెన్ వ్యాపారస్తు మధ్య పోటీ ఆ ఊరి జనానికి పండుగ తెచ్చింది. పప్పన్నం మానేసిన జనాు రోజూ చికెన్ కర్రీతో మ ృష్టాన్నభోజనం లాగించేస్తున్నారు. కర్నూు జిల్లా కోడుమూరు మండం కె నాగులా పురంలో కిలో రూ.30కే చికెన్ అమ్ముతున్న విషయం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా సంచన వార్త అయ్యింది. న్లెూరులో కె.నాగలాపురంలో సుంకుమ్మ జాతర జరుగుతోంది. భక్తు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. చికెన్ కిలో రూ.30కే అమ్ముతున్న విషయం తెలియడంతో కోడి కూర కోసం చికెన్ షాపు దగ్గర క్యూ కట్టారు. బహిరంగ మార్కెట్లో కిలో చికెన్ ధర రూ100ు పుకుతోంది. హోల్‌సెల్ చికెన్ ధర వ్యాపారస్తు రూ.46కు వ్యాపారుకు సరఫరా చేస్తున్నారు. కానీ ఇక్కడ కిలో చికెన్ రూ.30కే అమ్ముతున్నారు. విషయం ఏమిటంటే వాహిద్ అనే హోల్‌సెల్ వ్యాపారికి గూడూరులో కోళ్లఫారం ఉంది. ఉళ్లో ఉన్న చికెన్ వ్యాపారస్తు వాహిద్ దగ్గర కోళ్లను తీసుకోకపోతే ఆ గ్రామాల్లో పోటీగా వ్యాపారం పెట్టి తక్కువ ధరకు చికెన్ అమ్మి ఇతరు వ్యాపారాను దెబ్బతీసే పను చేస్తున్నాడు.
గతంలో ప్యాకుర్తి గ్రామంలో కూడా ఇదే విధంగా చికెన్ వ్యాపారస్తు మధ్య పోటీ పెట్టాడు. నాుగైదు రోజుగా కె.నాగలాపురంలో కిలో రూ.40కే చికెన్ అమ్మేందుకు దుకాణం తెరిచాడు. సదరు పోటీదారుడిని దెబ్బతీసేందుకు గ్రామంలో చికెన్ వ్యాపారస్తు కిలో రూ.30కే చికెన్ అమ్మడం మొదు పెట్టడంతో చికెన్ ప్రియు పంట పండిరది.
మార్కెట్లో కిలో కూరగాయు ఏది చూసుకున్నా 30, 40 రూపాయ పైమాటగానే ఉంది. కోడిగుడ్లు కూడా డజను రూ.60ు పుకుతోంది. అంతకంటే తక్కువకే చికెన్ దొరుకుతుంటే ప్రజు కోడి కూర కోసం క్యూ కట్టారు. కె.నాగలాపురంలో మహమ్మద్‌బాషా అనే చికెన్ వ్యాపారి మంగళవారం నాడు దాదాపు 500కిలోకు పైగా చికెన్ అమ్మినట్లు చెప్పాడు.
పోటీ వ్యాపారంలో నిదొక్కునేందుకు నష్టానికైనా వ్యాపారం చేస్తున్నామంటూ మహమ్మద్‌బాషా అనే వ్యాపారి తెలిపారు. ఇద్దరు వ్యాపారు మధ్య పెరిగిన పోటీ కారణంగా గ్రామంలోని చికెన్ ప్రియు కోడి కూరకు రుచి మరిగారు. కరోనా వైరస్ చికెన్ , మటన్ మార్కెట్లను మాత్రమే కాదు హోటళ్ళు, రెస్టారెంట్‌పై కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది. జంతు మాంసం తింటే కరోనా వైరస్ వస్తుందని ఒక ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుండటంతో చికెన్ , మటన్ తినాంటేనే భయపడుతున్నారు ప్రజు . ముఖ్యంగా కోళ్ళు తింటే కరోనా వస్తుందని చికెన్ కు నో చెప్తున్నారు. దీంతో హైదరాబాద్ లో చికెన్ బిర్యానీ గిరాకీ బాగా తగ్గిపోయింది.