ఎంపీ సస్పెన్షన్‌పై

దద్దరిల్లిన లోక్‌సభ

న్యూఢల్లీి: ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీ సస్పెన్షన్‌ వ్యవహారంపై శుక్రవారంనాడు లోక్‌సభను కుదిపేసింది. కాంగ్రెస్‌ ఎంపీను పార్లమెంటు సమావేశాు పూర్తయ్యేంతవరకూ సస్పెండ్‌ చేయడం అసాధారణమని, ఎంతమాత్రం సహేతుకం కాదని లోక్‌సభలో కాంగ్రెస్‌ విపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరి అన్నారు. వెంటనే ఎంపీపై సస్పెన్షన్‌ను స్పీకర్‌ రద్దు చేయాని కోరారు. ఆయన వాదనతో పార్లమెంటరీ వ్యవహారా శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి విభేదించారు. సమావేశాు పూర్తయ్యేంతవరకూ సస్పెన్సన్‌ కొనసాగించాల్సిందేనని, తద్వారా సభలో ఒక సంప్రదాయం నెకొల్పినట్టు అవుతుందని అన్నారు. ఎంపీ సస్పెన్స్‌ అంశాన్ని అధీర్‌ రంజన్‌ చౌదరి ప్రస్తావిస్తూ, తమ ఎంపీను బడ్జెట్‌ సమావేశాు పూర్తయ్యేంతవరకూ సస్పెండ్‌ చేశారని, ఏ ప్రాతిపదికన సస్పెండ్‌ చేశారో తమకు తెలియడం లేదని అన్నారు. ఇదేమీ చిన్న విషయం కాదని అన్నారు. ఢల్లీి హింసపై చర్చించాని మాత్రమే తాము డిమాండ్‌ చేశామని పేర్కొన్నారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ మాట్లాడుతూ, ఎంపీ సస్పెన్షన్‌ రద్దు చేయాని కోరారు. విపక్షా వాదనతో పార్లమెంటరీ వ్యవహారా మంత్రి ప్రహ్లాద్‌ జోషి విభేదించారు. సమావేశాు పూర్తయ్యేంతవరకూ ఎంపీపై సస్పెన్షన్‌ కొనసాగించాల్సిందేనని అన్నారు. సభలో అనుచిత ప్రవర్తన తగదన్నారు. గతంలో ప్రధానికి, అమిత్‌షాకి వ్యతిరేకంగా వ్యాఖ్యు చేసినప్పుడు తాము ఎలాంటి చర్యకు పోలేదని అన్నారు. పార్లమెంటు బయట ఎంపీను ఉంచాని ప్రభుత్వం కోరుకోవడం లేదని, అయితే గురువారం సభలో ఏమి జరిగిందో అందరికీ తొసునని అన్నారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇలాంటిదెప్పుడూ జరగలేదని ప్లహ్లాద్‌ జోషి అన్నారు. కాగా, ఎంపీ సస్పెన్సన్‌కు వ్యతిరేకంగా పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కూడా కాంగ్రెస్‌ ఎంపీు నిరసనకు దిగారు. రాహుల్‌ గాంధీ సహా పువురు కాంగ్రెస్‌ ఎంపీు ఇందులో పాల్గొన్నారు.
10 దాకా రాజ్యసభ వాయిదా
 ఢల్లీి అ్లర్లపై చర్చ చేపట్టాని శుక్రవారం రాజ్యసభలో ప్రతిపక్షాు డిమాండ్‌ చేశాయి.  విపక్షా నినాదా మధ్య సభను చైర్మన్‌ వాయిదా వేశారు.  హోళీ వేడుక తర్వాత ఈనె 11వ తేదీన మళ్లీ సభ సమావేశంకానున్నది. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో.. చైర్మన్‌ వెంకయ్య సభలో కొన్ని అంశాు మాట్లాడారు. సమాజంలోని అన్ని రంగాల్లో మహిళు విశేష పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‌పై గురువారం కేంద్ర మంత్రి హర్షవర్థన్‌ చేసిన కామెంట్స్‌ను కొన్ని పత్రికు ప్రచురించలేకపోయాయని తెలిపారు. వెంకయ్య మాట్లాడిన తర్వాత.. సభ్యు వెల్‌లోకి దూసుకువెళ్లారు. దీంతో సభను చైర్మన్‌ వాయిదా వేశారు.