సీనియర్‌ పాత్రికేయుడు

పొత్తూరి కన్నుమూత

అమరావతి:
ప్రముఖ పాత్రికేయుడు, సీనియర్‌ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాగా 1934 ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లాలో జన్మించిన పొత్తూరి.. పత్రికా రంగంలో 5 దశాబ్దాకు పైగా సేమ అందించారు. ప్రముఖ పత్రికల్లో విధు నిర్వహించి ప్రత్యేక గుర్తింపు పొందారు. 2000లో ‘నాటి పత్రిక మేటి మిమ’ పేరిట పుస్తకం రచించారు. అదే విధంగా 2001లో చింతన, చిరస్మరణీయు పుస్తకాను రచించిన పొత్తూరి వెంకటేశ్వరరావు.. పీవీ గురించి రాసిన ‘ఇయర్‌ ఆఫ్‌ పవర్‌’కు సహ రచయితగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా ఆయన విధు నిర్వర్తించారు. పొత్తూరి వెంకటేశ్వరరావు అంత్యక్రియు సాయంత్రం 4 గంటకు జూబ్లీహిల్స్‌ మహా ప్రస్థానంలో జరగనున్నాయి. కాగా పొత్తూరి వెంకటేశ్వరావు మరణం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహా పువురు ప్రముఖు సంతాపం వ్యక్తం చేశారు.
  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, తెంగాణ సీఎం కేసీఆర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పొత్తూరి మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయన మరణం జర్నలిజానికి తీరని లోటని, ఐదు దశాబ్దాకు పైగా పొత్తూరి పాత్రికేయ రంగానికి ఎనలేని సేమ అందించారని కొనియాడారు.
ఒక గొప్ప ఆత్మీయుడిని కోల్పోయాను: చంద్రబాబు
సీనియర్‌ జర్నలిస్ట్‌గా పొత్తూరి సేమ ప్రశంసనీయమని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పాత్రికేయుడిగా పొత్తూరి కృషి చిరస్మరణీయమని, ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా ఆయన సేమ మరువలేనివన్నారు. మివతో కూడిన జర్నలిజానికి ఆద్యుడు పొత్తూరి అని కొనియాడిన చంద్రబాబు.. పాత్రికేయుందరికీ ఆయన మార్గదర్శకుడన్నారు. సామాజిక బాధ్యతతో జర్నలిజానికే వన్నెతెచ్చారని చెప్పారు. తన రచనతో, వ్యాసాతో జాతిని జాగ ృతం చేశారన్నారు. తొగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన రైతు సమస్య అధ్యయన కమిటీలో కోడె శివప్రసాద రావు, కరణం బరామ్‌తో కలిసి పొత్తూరి పని చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సాహిత్య, సాంస్క ృతిక రంగాల్లో తనదైన ప్రత్యేక శైలి చూపారన్నారు. వ్యక్తిగతంగా తాను గొప్ప ఆత్మీయుడిని కోల్పోయానని బాబు ఆవేదన చెందారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాని కుటుంబ సభ్యుకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌,  తొగు పత్రికారంగ ప్రముఖుడు, తొలితరం జర్నలిస్టుల్లో ఒకరైన డాక్టర్‌ పొత్తూరి వెంకటేశ్వరరావు మరణం జర్నలిజానికి తీరని లోటని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. ఐదు దశాబ్దాుగా ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్త పత్రికల్లో సంపాదకుగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ అధ్యక్షునిగా పు హోదాల్లో ఆయన చేసిన సేవను కొనియాడారు. పొత్తూరి ఆత్మకు శాంతి చేకూరాని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యుకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  పొత్తూరి వెంకటేశ్వరరావు పత్రికా రంగంలో ఐదు దశాబ్దాకుపైగా సేమ అందించి పాత్రికేయ వృత్తికి వన్నె తెచ్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌  కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యుకు లోకేశ్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.