స్నాక్స్‌ తింటూ రిలాక్స్‌

రాజ్‌పథ్‌ దుకాణదారుతో ప్రధాని మోదీ ముచ్చట్లు

న్యూఢల్లీి: ఎంతో బిజీగా ఉండే ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన షెడ్యూల్‌ నుంచి కాస్తంత విరామం తీసుకున్నారు. ఢల్లీిలోని రాజ్‌పథ్‌లో జరుగుతున్న ‘హునర్‌ హాట్‌’ మేళాకు వెళ్లి కాసేపు సరదాగా గడిపారు. అక్కడి దుకాణదారుతో ముచ్చటించారు. ఉత్తరాది ప్రముఖ స్నాక్‌ లిటి చోఖా తిని మట్టి కప్పులో ఛాయ్‌ తాగారు.
ఈ మధ్యాహ్నం కేంద్ర కేబినెట్‌ సమావేశం పూర్తయిన తర్వాత మోదీ అక్కడి నుంచి నేరుగా మేళాకు వెళ్లారు. ప్రధాని రాక గురించి ఎవరికీ ముందస్తు సమాచారం లేదు. దీంతో మోదీని చూడగానే అక్కడి అధికాయి, సిబ్బంది ఒక్కసారిగా సంబ్రమాశ్చర్యాకు లోనయ్యారు. దాదాపు 50 నిమిషా పాటు మోదీ మేళాను సందర్శించారు. వివిధ స్టాల్స్‌ తిరుగుతూ అక్కడి వస్తువు, కళా ప్రదర్శన గురించి అడిగి తొసుకున్నారు. ప్రదర్శనలోని సంగీత పరికరాను వాయించారు.ఒక చిరుతిళ్ల దుకాణంలో లిటి చోఖా తిని రూ. 120 చెల్లించారు. మరో దుకాణంలో కేంద్రమంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీతో కలిసి క్హుద్‌ ఛాయ్‌(మట్టి కప్పులో ఇచ్చే ఛాయ్‌) తాగి రూ. 40 చెల్లించారు. మోదీని చూడగానే దుకాణదాయి, సందర్శకు తెగ సంబరపడిపోయారు. ప్రధానితో సెల్ఫీు దిగేందుకు పోటీపడ్డారు.