రూ.10కోట్లు దాటిన మేడారం హుండీ ఆదాయం
ఈ సారి రూ.11 కోట్లు దాటొచ్చని అంచనా
హన్మకొండ: మేడారం మహా జాతర సందర్భంగా వనదేవతకు భక్తజనం సమర్పించుకున్న కానుక హుండీ లెక్కింపు హన్మకొండలోని తితిదే కల్యాణ మండపంలో కొనసాగుతోంది. వారం రోజు నాటికి హుండీ ఆదాయం రూ.10కోట్లు దాటింది. మొత్తం 494 హుండీల్లో ఇప్పటి వరకు 420హుండీు లెక్కించారు. వెండి నాణేతోపాటు విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాు కూడా భక్తు హుండీలో వేశారు. గత జాతరలో రూ.10కోట్లు హుండీ ఆదాయం రాగా ఈసారి రూ.11కోట్లు దాటుతుందని అధికాయి అంచనా వేస్తున్నారు. జాతర సమయంలో వర్షం కారణంగా హుండీల్లో నీరు చేరి నోట్లన్నీ తడిసిపోయినట్లు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ నర్సింహు తెలిపారు. తడిసిన నోట్లను సబ్బు నీటిలో కడిగి ఆరబెడుతున్నట్లు చెప్పారు. దాదాపు 200 మంది సిబ్బంది సీసీ కెమెరా మధ్య హుండీు లెక్కిస్తున్నారు.