మటన్ ఘుమఘుమలు😋

మటన్‌ హలీవ్‌

కావల్సినవి:


ఎముకల్లేని మటన్‌ – 200 గ్రా, గోధుమరవ్వ – పావు కప్పు, ఉప్పు – తగినంత, అల్లంవెల్లల్లి ముద్ద – టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి – మూడు, షాజీరా – చెంచా, మిరియాల – అరచెంచా, వేయించిన ఉల్లిపాయ ముక్కల – కప్పు, గరంమసాలా – అరచెంచా, పుదీనా – కట్ట, నెయ్యి – పావుకప్పు, నూనె – టేబుల్‌స్పూను, నీళ్లు – రెండు కప్పుల, ధనియాలపొడి – చెంచా, నిమ్మరసం – టేబుల్‌స్పూను.
తయారీ:
మటన్‌ని శుభ్రంగా కడగాలి. గోధుమరవ్వను అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌ని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక మటన్‌, షాజీరా, మిరియాలూ, గరంమసాలా, పచ్చిమిర్చీ, అల్లంవెల్లల్లి ముద్దా, ధనియాలపొడీ, తగినంత ఉప్పూ, నీళ్లు పోసి మూత పెట్టేయాలి. ఐదు తల వచ్చాక పొయ్యి కట్టేయాలి. తరవాత మటన్‌ని మిక్సీలో మెత్తని ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి గోధుమరవ్వ వేసి కప్పు నీళ్లు పోయాలి. రవ్వ పూర్తిగా ఉడికిందనుకున్నాక దింపేయాలి. మరో బాణలిని పొయ్యిమీద పెట్టి.. నెయ్యి వేయాలి. అది కరిగాక ఉడికించి పెట్టుకున్న గోధుమరవ్వా, మటన్‌ వేయాలి. కాసేపటికి ఇది ముద్దలా అవుతుంది. అప్పుడు ఉల్లిపాయ ముక్కలూ, నిమ్మరసం, పుదీనా వేసి దింపేయాలి.

నిజామీ ఘష్‌

కావల్సినవి: మటన్‌ ముక్కల ఎముకలతో సహా – మూడు, ఉల్లిపాయ – ఒకటి పెద్దది, వెల్లల్లి – ఐదు రెబ్బల, అల్లం – చిన్న ముక్క, నూనె – పావుకప్పు, బిర్యానీ ఆకు – ఒకటి, యాలకుల – రెండు, లవంగాల – మూడు, దాల్చిన చెక్క – చిన్న ముక్క, ధనియాలపొడి – టేబుల్‌స్పూను, టొమాటో గుజ్జు – అరకప్పు, పెరుగు – అరకప్పు, గరంమసాలా – చెంచా, ఉప్పు – తగినంత, మిరియాల -అరచెంచా, కారం -చెంచా.
తయారీ: మటన్‌ ముక్కల్ని కడగాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో నూనె తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అది వేడయ్యాక యాలకులూ, లవంగాలూ, దాల్చినచెక్కా, మిరియాలూ, బిర్యానీ ఆ, ఉల్లిపాయముక్కల వేయాలి. ఉల్లిపాయ ముక్కల రంగు మారాక అల్లంవెల్లల్లి ముద్దా, మటన్‌ ముక్కల వేయాలి. తరవాత కారం, ధనియాలపొడి కలపాలి. ఐదు నిమిషాలయ్యాక టొమాటో గుజ్జూ, పెరుగూ, రెండుకప్పుల నీళ్లూ పోసి మూత పెట్టేయాలి. ఇరవ్కె నిమిషాలకు మటన్‌ పూర్తిగా ఉడుకుతుంది. అప్పుడు తగినంత ఉప్పూ, గరంమసాలా వేయాలి. పది నిమిషాలయ్యాక దింపేయాలి.

గోంగూర మటన్‌

కావలసినవి:


మటన్‌ముక్కల: అరకిలో, ఉల్లిపాయల: పావుకిలో, అల్లంవెల్లల్లి: 2 టేబుల్‌స్పూన్లు, కారం: టేబుల్‌స్పూను, పసుపు: టీస్పూను, కొత్తిమీర: కట్ట, పుల్లగోంగూరకట్టల: పది(సన్నవి), సోయర: 2 కట్టల(సన్నవి), పచ్చిమిర్చి: ఆరు, నూనె: 50గ్రా., ఉప్పు: తగినంత.
తయారుచేసే విధానం:
కడిగిన మటన్‌ముక్కల్ని కుక్కర్‌లో వేయాలి. ఉల్లిముక్కల, నూనె, పచ్చిమిర్చిముక్కల, కారం, అల్లంవెల్లల్లి, ఉప్పు వేసి కలిపి, సుమారు పావులీటరు నీళ్లు పోసి నాలగు విజిల్స్ రానివ్వాలి.తరవాత బాణలిలో వేసి, సోయర వేసి నీళ్లన్నీ ఆవిరైపోయేవర వేయించాలి.మరో బాణలిలో గోంగూర ఆకుల వేసి ఉడికించి మెత్తని ముద్దలా చేసి, ఈ ముద్దను వేయిస్తోన్న మటన్‌లో వేసి మరో పది నిమిషాల ఉడికించి, ఉప్పు సరిచూసి దించాక కొత్తిమీర తురుముతో అలంకరించాలి.

మేక కాళ్ల పాయా

కావలసినవి
మేక కాళ్లు: నాలగు, కారం: 3 చెంచాల, ఉల్లిపాయల: రెండు, పుదీనా ఆకుల: కట్ట (చిన్నది), నూనె: 5 చెంచాల, కొత్తిమీర: కట్ట(చిన్నది), నల్లయాలకుల: రెండు, లవంగాల: రెండు, దాల్చినచెక్క: అంగుళంముక్క, ఉప్పు: రుచికి సరిపడా, అల్లంవెల్లల్లిముద్ద: 6 చెంచాల, పచ్చి కొబ్బరితురుము: 10 చెంచాల, గసగసాల: 10 చెంచాల, పసుపు: చెంచా, పొట్లి మసాలా: 5 చెంచాల (పలావుఆకు, దనియాల, గంధం పొడి, ఎండుగులాబీ రేకుల, నల్లయాలకుల, దాల్చినచెక్క, పత్తర్‌ కా పూల్‌, అనాసపువ్వు, కసూరి మెంతి… లాంటివన్నీ కలిపి మసాలానే పొట్లి మసాలా అంటారు. హైదరాబాదీ వంటల్లో దీన్ని ఎక్కువగా వాడతారు. ఇది మార్కెట్లో నేరుగా దొరుకుతుంది), నిమ్మకాయ: ఒకటి
తయారీ విధానం
మేక కాళ్లకు పసుపు పట్టించి బాగా కడగాలి. గసగసాల, కొబ్బరి ముద్దలా చేయాలి. ప్రెషర్‌కుక్కర్‌లో మేక కాళ్లు వేసి సగం కారం, సగం అల్లంవెల్లల్లిముద్ద, ఉప్పు, పుదీనాతురుము, కొత్తిమీర తురుము, తగినన్ని నీళ్లు పోసి అరగంటసేపు సివ్‌లో పెట్టి ఉడికించాలి. బాణలిలో నూనె వేసి దాల్చినచెక్క, యాలకుల, లవంగాల, మిగిలిన అల్లంవెల్లల్లిముద్ద వేసి వేయించాలి. తరువాత ఉల్లిముక్కల, పసుపు, మిగిలిన కారం, దనియాలపొడి వేసి కలిపి వేయించాలి. ఇప్పుడు కొబ్బరి – గసగసాల ముద్ద వేసి ఓ నిమిషం వేయించాలి. తరువాత కుక్కర్‌లో ఉడికించిన మేక కాళ్లని నీళ్లతో సహా వేసి ఈ మిశ్రమంలో సుమారు పావుగంటసేపు ఉడికించాలి. ఇప్పుడు పొట్లి మసాలాని ఓ పలచని బట్టలో మూటలా కట్టి ఆ మూటని అందులో వేసి సుమారు ఐదు నిమిషాల ఉడికించాలి. ఉప్పు సరిచూసి దించి వేడివేడిగా అందించాలి.

ఖీమా ఫ్రై

కావలసినవి:


మటన్‌ ఖీమా: అరకిలో, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి:రెండు, అల్లంవెల్లల్లి:టేబుల్‌ స్పూను, కొత్తిమీరతురుము:టేబుల్‌స్పూన్లు,కారం: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, గరంమసాలా: టీస్పూను, నూనె: తగినంత
తయారుచేసే విధానం:
బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లిముక్కల, పచ్చిమిర్చి ముక్కల వేసి వేయించాలి. అల్లంవెల్లల్లి డా వేసి వేగాక ఖీమా, ఉప్పు, కారం వేసి కలపాలి. తరవాత మూతపెట్టి మీడియం మంటమీద కలపుతూ వేయించాలి. మటన్‌ పూర్తిగా ఉడికి, వేగిన తరవాత గరంమసాలా, కొత్తిమీర తురుము వేసి దించితే ఖీమా వేపుడు తయార్‌.

మటన్‌తో మహారుచిగా

కావల్సినవి:
మటన్‌- పావుజీ, మునక్కాడల- రెండు, ఉల్లిపాయల- మూడు, బిర్యానీ ఆకుల- రెండు, దాల్చిన చెక్క- ఒకటి(పెద్దది), లవంగాల- ఆరు, అల్లంవెల్లల్లి ముద్ద- చెంచా, కొబ్బరి గసగసాల ముద్ద- చెంచా, ధనియాల, జీలకర్రపొడి- చెంచా చొప్పున, గరంమసాలా- చెంచా, పెరుగు- కప్పు, కారం, పసుపు, ఉప్పు- రుచికి తగినంత, నూనె- నాలగు చెంచాల
తయారీ:
మునక్కాడలను ముక్కలగా కోసి నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్‌ను శుభ్రంగా కడిగి కొద్దిగా అల్లంవెల్లల్లి ముద్ద, ఉప్పు, పసుపు పట్టించి గంటపాటు ఉంచాలి. తరవాత బాణలిలో నాలగు చెంచాల నూనె వేసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక బిర్యానీ ఆకుల, దాల్చిన చెక్క, లవంగాల వేసి కొద్దిసేపయ్యాక ఉల్లిపాయ ముక్కల చేర్చాలి. అవి ఎర్రగా వేగాక మిగిలిన అల్లం వెల్లల్లి ముద్ద, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసి మూతపెట్టాలి. ఐదునిమిషాలయ్యాక పక్కన పెట్టిన మటన్‌ దానిలో వేసి నూనె తేలే వర వేయించాలి. తరవాత కొబ్బరి గసగసాల ముద్ద, వేయించిన మునక్కాడ ముక్కల, పెరుగు వేసి బాగా కలిపి కప్పు నీళ్లు పోసి మూతపెట్టాలి. మటన్‌ ఉడికి కుర్మా దగ్గర పడ్డాక గరంమసాలా వేసి దించాక కొత్తిమీర చల్లితే మటన్‌ కుర్మా సిద్ధమయినట్టే. ఇది బిర్యానీ, చపాతీల్లోకి బాగుంటుంది.

దోసకాయ మటన్‌

కావల్సినవి:


మటన్‌ ముక్కల – పావుకిలో, దోసకాయ – చిన్నది,ఉల్లిపాయ – ఒకటి, టమాటాల – రెండు, పచ్చిమిర్చి – రెండు, కారం – రెండు చెంచాల, ఉప్పు – తగినంత, గరంమసాలా – అరచెంచా, అల్లంవెల్లల్లి ముద్ద – చెంచా, నూనె – రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర తరుగు – పావుకప్పు.
తయారీ:
దోసకాయ, ఉల్లిపాయ, టమాటాల, పచ్చిమిర్చిని విడివిడిగా తరిగి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కల వేయించాలి. ఆ తరవాత మటన్‌ ముక్కల చేర్చాలి. అది డా వేగాక దోసకాయ ముక్కల్ని వేసి మూత పెట్టేయాలి. దోసకాయ ముక్కల మెత్తగా అయ్యాక తగినంత ఉప్పు, కారం, గరంమసాలా, అల్లంవెల్లల్లి ముద్ద ఒకదాని తరవాత మరొకటి వేసి బాగా కలపాలి. రలో చేరిన నీళ్లు ఆవిరయ్యాక కొత్తిమీర తరుగు చల్లి పొయ్యి కట్టేయాలి.

గంగవాయల మటన్‌

కావలసినవి
మటన్‌: కిలో, గంగవాయల ర: 20 కట్టల, అల్లంవెల్లల్లి: 2 టేబుల్‌స్పూన్లు., పచ్చిమిర్చి ముద్ద: 2 టేబుల్‌స్పూన్లు., టొమాటో: పావుకిలో, పసుపు: టీస్పూను, కారం: టేబుల్‌స్పూను, కారం: టేబుల్‌స్పూను, నూనె: 50గ్రా., కొత్తిమీర: కట్ట, ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేసే విధానం
గంగవాయల రను శుభ్రంగా కడిగి ఆకుల్ని తుంచి ఉంచాలి. మటన్‌ ముక్కలను కడిగి గంగవాయల ర తప్ప మిగిలినవన్నీ వేసి కలపాలి. ప్రెషర్‌ కుక్కర్‌లో నూనె వేసి కాగాక, కలిపి ఉంచిన మటన్‌ ముక్కల వేసి ఉడికించాలి. ఐదు విజిల్స్ వచ్చాక తీసి, గంగవాయల ర వేసి మరో పది నిమిషాల ఉడికించాలి.

మటన్‌తో కాశ్మీరీ బిర్యానీ

కావలసినవి:


మటన్‌: ముప్పావుకిలో, బాస్మతిబియ్యం: కిలో, పాల: 200 మి.లీ., పెరుగు: 2 టీస్పూన్లు, శొంఠిపొడి: టీస్పూను, యాలకులపొడి: పావుటీస్పూను, నెయ్యి: కప్పు, వ్రా ఎసెన్స్: పావుటీస్పూను, కుంకుమపువ్వు: 2 గ్రా., కారం: 2 టీస్పూన్లు, ఇంగువ: చిటిడు, గరంమసాలా: 2 టీస్పూన్లు, సోంపుపొడి: 2 టీస్పూన్లు, పంచదార: పావుటీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేసే విధానం: బాణలిలో నెయ్యి వేసి కాగాక ఇంగువ, మటన్‌ ముక్కల వేసి ఓ రెండు నిమిషాల వేయించాలి. అందులోనే పెరుగు డా వేసి కలిపి రంగుమారేవర వేగనివ్వాలి. ఇప్పుడు ఉప్పు, కారం, సొంఠిపొడి, పలావు ఆకు వేసి కాసేపు వేయించాలి. తరవాత అరలీటరు నీళ్లు పోయాలి. అరటీస్పూను గరంమసాలా, టీస్పూను సోంపుపొడి వేసి సివ్‌లో ఉడికించి దించాలి. మటన్‌ముక్కల్ని విడిగా ఓ గిన్నెలో వేసి ఉంచాలి. అదే బాణలిలో రెండు లీటర్ల నీళ్లు పోసి ఉప్పు వేయాలి.
ఇప్పుడు గరంమసాలా మిగిలిన సోంపు పొడి అన్నీ పలచని బట్టలో మూట కట్టి నీళ్లలో వేయాలి. తరవాత బియ్యం వేసి సివ్‌లో సగం ఉడివర ఉంచి దించాలి. తరవాత అందులోనుంచి నీళ్లు వంపేసి మటన్‌ ముక్కలూ అన్నమూ పొరల పొరలగా మందపాటి గిన్నెలో వేసి మూతపెట్టి సివ్‌లో దవ్‌ చేయాలి.

మటన్‌ బిర్యానీ

కావల్సినవి: మటన్‌ – అరకిలో, ఉప్పు – తగినంత, అల్లం వెల్లల్లి ముద్ద – రెండు చెంచాల, పచ్చిమిర్చి ముద్ద – చెంచా, పసుపు – పావు చెంచా, కారం – రెండు చెంచాల, ఉల్లిపాయల – రెండు, గరం మసాలా – చెంచా, నూనె – అరకప్పు, నిమ్మరసం – రెండు చెంచాల, బాస్మతీ బియ్యం – అరజీ, వెన్న – రెండు చెంచాల, కొత్తిమీర, పుదీనా – రెండు కట్టల చొప్పున, పెరుగు – పావుకప్పు, యాలకుల – నాలగు, లవంగాల – మూడు, దాల్చినచెక్క – ఒకటి పెద్దది, బిర్యానీ ఆకుల – రెండు, బిర్యానీ మసాలా – ఒకటిన్నర చెంచా.
తయారీ: బాస్మతీ బియ్యాన్ని ఇరవ్కె నిమిషాల ముందు నానబెట్టి.. తరవాత యాలకులూ, లవంగాలూ, దాల్చిన చెక్కా, బిర్యానీ ఆకులూ.. కాస్త వెన్న వేసి.. ముప్పావువంతు ఉడికించుకుని తీసుకోవాలి. మటన్‌ ముక్కల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వాటిపై అల్లంవెల్లల్లి ముద్ద, పచ్చిమిర్చిముద్ద, పసుపు, కారం, గరం మసాలా, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా తరుగు, పెరుగు వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇరవ్కె నిమిషాల తరవాత బాణలిని పొయ్యిముద్ద.. నూనె వేయాలి. అది వేడయ్యాక మటన్‌ ముక్కల వేసి.. రలా ఉడికించుకుని తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయల ముక్కల్నీ వేయించుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెలో ముందుగా కాస్త అన్నం వేసి, దానిపై కాస్త మటన్‌ ర, కాసిని ఉల్లిపాయముక్కల పరవాలి. అలాగే అన్నీ అయిపోయేవర ఒకదానిమీద మరొకటి వేసుకుంటూ రావాలి. దీన్ని పొయ్యిమీద పెట్టి.. ఇరవ్కెనిమిషాల సన్ననిమంటపై ఉడికించుకుని తీసుకుంటే చాల.

మటన్‌ వేపుడు

కావలసినవి:


మటన్‌: అరకిలో, వెల్లల్లిరెబ్బల: పది, పసుపు: టీస్పూను, గరంమసాలా: టేబుల్‌స్పూను, పెరుగు: కప్పు, పలావుఆకుల: రెండు, ఆవనూనె: కప్పు, అల్లంతురుము: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేసే విధానం:
పెరుగుని బాగా గిలకొట్టాలి. మటన్‌ ముక్కలకు టేబుల్‌స్పూను నూనె, పసుపు, ఉప్పు, పెరుగు పట్టించి రెండు గంటల నాననివ్వాలి. బాణలిలో నూనె పోయాలి. అందులోనే అల్లం, వెల్లల్లి, పలావు ఆకుల వేసి ఓ నిమిషం వేయించాలి. తరవాత అన్నీ పట్టించిన మటన్‌ ముక్కల వేసి సివ్‌లో ఉంచి ఉడికించాలి. చివరగా గరంమసాలా వేసి బాగా కలిపి దించాలి.

మటన్‌ ర

కావలసినవి:
మటన్‌: పావుకిలో, ఉల్లిపాయ: ఒకటి, టొమాటోల: మూడు, అల్లంవెల్లల్లిముద్ద: టేబుల్‌స్పూను, పసుపు: పావుటీస్పూను, కారం: ఒకటిన్నరటీస్పూన్లు, ఉప్పు: తగినంత, దనియాలపొడి: టేబుల్‌స్పూను, గరంమసాలా: అరటీస్పూను, కరివేపాకు: 2 రెబ్బల,నూనె: 3 టేబుల్‌స్పూన్లు
తయారుచేసే విధానం
మటన్‌ శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి. బాణలిలో నూనె వేసి కాగాక సన్నగా తరిగిన ఉల్లిముక్కల వేసి వేయించాలి. తరవాత కరివేపాకు, అల్లంవెల్లల్లి ముద్ద, పసుపు, కారం వేసి రెండు నిమిషాల వేయించాలి. ఇప్పుడు మటన్‌ ముక్కల వేసి తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టి అందులోని నీళ్లన్నీ ఆవిరైపోయేవర ఉడికించాలి. తరవాత దనియాలపొడి, సన్నగా కోసిన టొమాటోముక్కల వేసి కలపాలి. టొమాటోల మెత్తబడ్డాక కప్పు నీళ్లు పోసి ముక్క మెత్తబడేవర ఉడికించాలి. మటన్‌ పూర్తిగా ఉడికి నూనె తేలాక గరంమసాలా వేసి కలపాలి, చివరగా కొత్తిమీరతో అలంకరించి దించాలి. ఇది పూరీ, బగారన్నం రెండింటిలోకీ బాగుంటుంది.