అందం కోసం ‘పెరుగు’
-పెరుగుతో చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా మార్చుకోవచ్చు. కేవలం పెరుగునే ఫేస్‌మాస్క్‌గా ఐప్లె చేసుకున్నా మెరుగైన ఫలితం ఉంటుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్లు అత్యధిక స్థాయిలో ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ కూడా లభిస్తాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
-దోసకాయ గుజ్జుతో పెరుగును కలిపి ఒక ప్యాక్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి ఐప్లె చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే రెండు దోసకాయ ముక్కలను కళ్లపై ఉంచితే కంటి కింది నలుపు కూడా తగ్గుతుంది.
-ఓట్మీల్, పెరుగు, తేనెను సమాన మోతాదులో తీసుకొని ముఖంపై ఐప్లె చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటిని ముఖంపై చల్లుకొని శుభ్రంగా కడిగేస్తే సరి. ఒక ఎగ్‌వైట్‌లో కొంచెం పెరుగు కలిపి ఫేస్‌ప్యాక్‌ను ప్రిపేర్ చేసుకోవాలి. సున్నితంగా ముఖంపై ఈ ఫేస్‌ప్యాక్‌ను ఐప్లె చేసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత నీటితో ఈ ఫేస్‌ప్యాక్‌ను తొలగించాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ను ఐప్లె చేయాలి.
-రెండు స్ట్రాబెర్రీ పండ్లను నుజ్జుగా చేసి టీ స్పూన్ తేనెను, టీ స్పూన్ పెరుగును కలపాలి. ఆ పేస్ట్‌ను ముఖంపై ఐప్లె చేయాలి. 15-20 నిమిషాలు ఈ ప్యాక్‌ను ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ఈ ప్యాక్‌ను సున్నితంగా తొలగించాలి.
-ఒక టమాటాను తీసుకొని రసం చేయాలి. ఇందులో టీ స్పూన్ తేనె, టీస్పూన్ పెరుగుతో కలిపి ఫేస్ ప్యాక్‌ను సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై రాసుకొని 20 నిమిషాల తర్వాత కడగాలి.
సన్ ట్యాన్ నుండి చర్మాన్ని కాపాడుకోవడం ఎలా
సాధారణంగా వేసవి తాపానికి గురయ్యే చర్మం ఏదైనా భాగం ముదురు రంగు లేదా చర్మం నల్లగా మారుతుంది. ఈ సమస్యను తగ్గించడానికి, ఒక టేబుల్ స్పూన్ తాజా దోసకాయ రసం, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమంలో పత్తితో ముంచి ముఖం మీద అప్లై చేయాలి ఈ ద్రావణాన్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల త్వరగా సాధారణ రంగులోకి వస్తుంది.
ఇంటి చిట్కాలు
చర్మం ప్రకాశవంతంగా ఉండాలని మీరు కోరుకుంటే, ఇలా చేయండి సాధారణంగా మనము వాల్నట్ ను పగలగొట్టి లోపలి భాగాన్నితింటాము. కానీ ఇది చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.వాల్ నట్ ను మిక్సీలో పొడి చేసుకోవాలి. దీన్ని బొప్పాయి పండ్ల గుజ్జు మరియు కొద్దిగా నిమ్మరసం సమాన నిష్పత్తిలో కలపండి. ఈ పూతతో ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. చర్మంలో చనిపోయిన చర్మ కణాలను క్లియర్ చేయడానికి ఇది సహాయపడుతుంది. ఈ మిశ్రమంలో జింక్, ఇనుము మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చర్మం ఉద్రిక్తతను పెంచుతాయి మరియు మెరుపును పెంచుతాయి.ఉత్తమ ప్రయోజనం కోసం ప్రతిరోజూ వాడండి. లేదా మార్కెట్లో లభించే వాల్ నట్ స్క్రబ్బర్ ను వాడండి నాలుగు నుండి ఆరు వాల్నట్ అవసరం అవుతాయి మరియు వాల్ నట్స్ మీ అల్పాహార కోరికను తీర్చినట్లే, వీటిని ఫేస్ ప్యాక్ గా వేసుకోవడం ద్వారా మీ అందాన్ని కాపాడుతుంది.