పెన్‌ కౌంటర్‌ అంతా ‘పచ్చ’పాతమే!

చిన్నపత్రికలంటే వారికి చిన్నచూపు..ఆ పత్రిక చూపు దందాలవైపు
  • -పేరుకు పెద్ద పత్రిక విలేకరులు.. చేసేవి అక్రమ పనులు
  • -అక్రిడేషన్లు అడ్డుపెట్టుకుని బడాబాబులకు బెదిరింపులు
  • -నిఖార్సుగా రాసే చిన్నపత్రికలపై కారుకూతలు
  • -యాజమాన్యానికి తెలియకుండా దందాలు
  • -భారీ జీతాలు అందుకుంటూనే అక్రమార్గాలు
  • -రూ.20 వేలకు అక్రిడేషన్లు కొనుక్కుని విలేకరులుగా చలామణి
  • -ఖమ్మం జిల్లాలో పచ్చపత్రికకు మచ్చ తెస్తున్న విలేకరులు
  • -‘జ్యోతి’ పత్రిక పేరు చూసి వెన్నులో వణుకు
  • -తెలంగాణలో ఉంటూ ఆంధ్రా నేతలకు వత్తాసు
  • -వారు చేసే అక్రమాలు రుజువులతో నిరూపించే సాక్ష్యాలు
  • -చిన్న పత్రిక విలేకరులను తొక్కేసే ప్రయత్నాలు

హైదరాబాద్‌:
రాష్ట్రమంతటా అదొక పచ్చ పత్రిక అని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. ఇలాంటి పచ్చ పత్రికను అడ్డం పెట్టుకుని విప్లవాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో విశృంఖలంగా రెచ్చిపోతున్నారు ఆ పత్రికలో పనిచేసే కొందరు విలేకరులు. అక్కడ బడా పత్రికలు మరికొన్ని ఉన్నా ప్రత్యేకించి పచ్చ పత్రికలో ముక్కుపచ్చలారని జర్నలిస్టు కూనలు పనిగట్టుకుని చిన్న పత్రికల విలేకరులపై విషంగక్కుతున్నారు. వీళ్ల అక్రమ రాతలకు అడ్డువస్తున్నారని చిన్న పత్రికలపై ఇష్టం వచ్చినరీతిగా కథనాలు రాస్తున్నారు. ఒకప్పుడు మీరు కూడా కిందిస్థాయినుంచి వచ్చారన్న సంగతి గుర్తుంచుకుంటే మంచిదని చిన్నపత్రిక విలేకరులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే ఈ పచ్చపత్రిక విలేకరులు చేసిన దందాలు, దౌర్జన్యాలు రికార్డులతో సహా బయటపెడతామంటున్నారు.

హైదరాబాద్‌:
2001లో ఇప్పుడున్న యాజమాన్యం చేతిలో లేనపుడు ఆ పత్రిక తోక పత్రిక కాదు కదా ఈక పత్రికలా కూడా లేదు. రాజ్యాంగబద్ధ్దమైన పదవిలో ఉన్న రాష్ట్ర గవర్నర్‌నే బ్లాక్‌ మెయిల్‌ చేసినట్టు ఆరోపణలు ఉన్న పత్రిక అది. ఇటీవల ఓ ఆసుపత్రిలో అక్రమ అబార్షన్‌లు జరుగుతున్నాయని సదరు ఆసుపత్రి యాజమాన్యం నుంచి అక్షరాలా లక్షరూపాయు వసూలు చేసిన ఘనత ఆ పత్రిక పాత్రికేయులేకే సొంతం. విలేకరుల పై కేసు నమోదైతే వార్తలు రాయడంలో ముందు వరసలో ఉండే సదరు పత్రిక, ఇటీవ అదే అబార్షన్‌ వార్తను అడ్డం పెట్టుకొని కొన్ని ఆసుపత్రుల్లో అడ్డదిడ్డంగా వసూలు చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తెలంగాణ బిడ్డ ఉసురు కొట్టుకుంటున్న ఈ పత్రిక నిర్వాహకుడి దగ్గర్నుంచి, జిల్లాలో ప్రతినిధుల వరకు కమ్మనైన ఓ వర్గంగా ఏలుతున్న వాళ్లే. వీళ్ల ఛానల్లో గానీ, పత్రికలో గానీ దళిత బహుజనులను దగ్గరకు కూడా రానివ్వరు. రానిచ్చినా ఏదో చిన్నా చితక పోస్టుకే పరిమితం చేస్తారు. చిన్నా చితకా పత్రికల్లో ఉపాధి వెతుక్కొని తమ స్థాయిలో అభివద్ధి చేసుకుంటుంటే. గంజిలో మెతుకు చూసి గుణుగుడెందుకో అర్థంకాదు.
ఎవరివి తోక పత్రికు: ఈ పదం ఎక్కడిది ?
తోక పత్రికలు అని రాయడానికి ఇసుమంతైనా విజ్ఞత కరువైందా..తోక పార్టీలు అన్న పదాన్నే తిప్పికొట్టిన ఆ పత్రిక తోక పత్రికలు అన్న పదాన్ని ప్రయోగం చేయడం యాద చ్చికమా, అహంకారమా ? ఇక మీరన్నటువంటితోక జోలికే వద్దాం.. ఆంధ్ర పేరుతో ఎన్ని తోకలు పెట్టుకున్నారు. ఇందులో ఆంధ్ర అనే పదాన్ని తోక అందామా..? పీక అందామా..? వార్త పేరు ముందో వెనుకో వార్త పెట్టుకొని దాదాపు ఓ 10 పత్రికలు ఉన్నాయి. ఏరోజూ ఆ పత్రిక ఇలా మిడిసి పడలేదే ? పొలిటికల్‌ వార్‌ , పొలిటిక్‌ వార్త, పొలిటికల్‌ వాయిస్‌, పొలిటికల్‌ ఎన్‌కౌంటర్‌ ఇలా రకరకా పొలిటికల్‌ పేర్లు ఉన్నా సదరు పత్రిక యాజమాన్యం ఏ రోజు కూడా మీలాగా తోక ఎత్తి పంగ చాపలేదే ? ఒక్క ప్రముఖ టీవీ పేరుకు సారూప్యంగా దాదాపు 10 ఛానళ్లు, 10 యూట్యూబ్‌ ఛానళ్లు ఉన్నాయి. ఏ రోజు కూడా ఆ ఛానల్‌ ఇలా ఉలిక్కి పడి ఊసరవెల్లిలా మారలేదే ? సాక్షాత్తూ ఆంధ్రా సీఎం సొంత పత్రిక సైతం ఇటువంటి అక్కసు వెళ్లగక్కలేదే ? సదరు మాజీ తోకగారు తెలుసుకోవలసిన ముఖ్యవిషయం ఏంటంటే ఈ పేర్లు ఆర్‌ఎన్‌ఐ కి దరఖాస్తు చేస్తే అప్రూవల్‌ చేసిన పేర్లే తప్ప ఇక్కడ అన్న ప్రాసన రోజునో లేక నామకరణం రోజో ఇష్టం వచ్చిన రీతిన పేర్లు పెట్టుకున్నవి కావు, డబ్బు పెట్టుకొని కొన్నవి కావు అన్నది గుర్తించాలి.
‘పచ్చ’ పత్రిక ముసుగులో సాగించిన దందాలు కొన్ని:
– రపర్తినగర్‌ నగర్లో రియల్‌ ఎస్టేట్‌ వారు డబ్బులు ఇవ్వలేదని కథనం పెట్టారు…
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు డబ్బులు ఇవ్వనందుకు వేసేయ్‌ పాగా పెరుతో కథనం
– దీపావళి వ్యాపారులు డబ్బులు ఇవ్వనందుకు వాళ్లపై కథనం రాసి అరెస్ట్‌ చేయించారు.

– ప్రయివేట్‌ హాస్పిటల్స్‌ యాడ్స్‌ ఇవ్వనందుకు మరో కథనం

– శారదా హాస్పిటల్‌ యాజమాన్యం వద్ద 70 వేలు తీసుకుని సీల్‌ వేయించారు.

– మున్సిపాలిటీ నుండి మామూళ్లు రావడంలేదని అక్రమ నిర్మాణాలు పేరుతో కధనం

– వడ్డీ వ్యాపారులు మామూళ్లు ఇవ్వలేదని కథనం

– బెట్టింగ్‌ రాయుళ్లు తిట్టినందుకు వారిపై కథనం

– పురుగు మందుల షాపులు, గుట్కా వ్యాపారులువద్దు పెద్ద మొత్తాల్లో వసూళ్లు ఇవ్వకపోతే కథనాలు

– ఓ వర్గం వారికే అక్రిడేషన్‌ కార్డులు…సీనియర్‌ జర్నలిస్ట్‌ అయినాసరే పక్కన పెట్టి తమ వర్గంవారికి మాత్రమే అక్రిడేషన్‌ కార్డ్స్‌.

– ఆ పత్రికలో ఇద్దరూ తొడుదొంగలే ..నాకింత నీకింత ప్రాసెస్‌


. ఎవరు వసూలు రాయుళ్లు:
పెద్దలను పట్టుకొని గద్దల్లా ఢిల్లీ వరకు వెళ్లి చిన్న పత్రిక వాళ్లకు కనీసం సమాచారం ఇవ్వకుండా తిరిగొచ్చిన వాళ్ల మీద లేవని కలం, ఈ రోజు నలుగురు పాత్రికేయు ఓ విహార యాత్రకు వెళితే అంత కళ్ల మంట దేనికో ? సంఘాల పేరుతో సెటిల్‌మెంట్లు చేసి , గతంలో వీళ్లు చెప్పిన అధికారును అడ్డం పెట్టుకొని కాపు కాసుకొని లక్షల్లో సెటిల్‌మెంట్‌ చేసి, చిట్‌ఫండ్‌ వ్యాపారల వద్ద, వడ్డీ వ్యాపారుల వద్ద, గాంధీ చౌక్‌ షావుకార్ల వద్ద వసూలు చేసుకొన్న విషయాలు వీళ్ల దష్టికి రాలేదా లేక వీరికి కూడా అందులో భాగస్వామ్యం ఉందా ? రాసే వాడికి సిగ్గు లేకున్నా రాసే కలం ఎంత సిగ్గు పడిందో.. ఈ కలంతోనే కదా.. ఎన్ని బ్లాక్‌ మెయిల్‌ వార్తలు రాశామో అని, మొన్నటికి మొన్న మార్కెట్‌లో పెసల కుంభకోణంలో ఎంత మింగారో తెలియదా.. మార్క్‌ఫెడ్‌, సీసీఐ వారి వద్ద నిస్సిగ్గుగా జోలె పట్టుకున్న విషయం లోకోక్తిగా మారలేదా ? ఏ పాపం ఎరుగకుండానే నగర శివారుల్లో ఉన్న వెంచర్లలో , మినీ సిటీలో ప్లాట్లు వచ్చాయా.. కమ్మగా చేసుకున్న వెంచర్లలో తలా పిడికెడు తప్పకుండా ఉంటుంది కదా.. చిన్న పత్రిక తోక లేపి చూడటం ఎందుకు. ప్రెస్‌ క్లబ్‌లో ఆ పత్రికల విలేకరికి 500 చొప్పున ఇవ్వకుంటే వార్త రాదన్న సంగతి తెలిసిందేగా, ఫోటో పెడితే ఓ రేటు, పెట్టకుంటే ఓ రేటు అన్న విషయం క్లబ్బు గబ్బు విదితమే.. ఆచార్యదేవా.. కురు కులము ఏనాడో కులహీనమైనది. కాగా నేడు కులము, కులము అను కుంచిత వధనలేలా” అనే డైలాగులు ప్రస్తావనార్హం.
చిన్న పత్రికల తిరుగుబాటు
చిన్న పత్రికను తోకపత్రికంటూ కించపరుస్తూ ఓ పత్రిక వార్తలు వడ్డించడం పట్ల చిన్న పత్రికలో వివిధ హోదాల్లో పని చేస్తున్న పాత్రికేయులు భగ్గుమంటున్నారు. మరుసటి రోజు సంచికలో భేషరతుగా క్షమాపణలు చెప్పాల్పిందిగా డిమాండ్‌ చేస్తున్నారు. లేని పక్షంలో చిన్న పత్రిక జర్నలిస్టులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఐ అడ్‌ పీఆర్‌ లో కేవలం ప్రధాన, మాధ్యమ, చిన్న పత్రికలుగా ఉన్న పత్రికలను వక్రీకరించి తోక పత్రికలని కించపరచడాన్ని వ్యతిరేఖిస్తూ జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని సంకల్పిస్తున్నారు. ఈ విషయం పై గుర్తింపు సంఘాలుగా చెలామణి అవుతున్న సంఘాలు నోరు విప్పాని విజ్ఞప్తి చేస్తున్నారు.