అభివద్ధిలో రాజీపడే సమస్యే లేదు

  • తెలంగాణ ప్రభుత్వంలో జాతీయ రహదారులకు మహర్దశ
  • మిషన్‌ భగీరధ ద్వారా ప్రతీ ఇంటికీ మంచినీరు
  •   త్వరలోనే పెండింగ్‌ లో ఉన్న రైల్వే లైన్‌ పూర్తి
  • సమీక్షా సమావేశంలో ఆర్థిక మంత్రి హరీష్‌ రావు

మెదక్‌ ప్రతినిధి- జ్యోతి న్యూస్‌ 
తెలంగాణ రాష్ట్రాన్ని అభివ ద్ధిలో పరుగులు పెట్టించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అహర్నిశలూ శ్రమిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు స్పష్టం చేశారు,సోమవారం అసెంబ్లీ హాల్లో మెదక్‌ జిల్లా అభివ ద్ధి సమీక్షా సమావేశం నిర్వహించారు,ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని వినూత్న పథకాలతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు.గత ప్రభుత్వాల హయాంలో మెదక్‌ జిల్లా అన్ని రంగాల్లో తీవ్ర వెనకబాటుకు గురయ్యిందన్నారు,తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్‌ గా తీసుకొని అభివ ద్ధిలో ముందుకు వెళ్తుందన్నారు. 
పెండింగ్‌ ప్రాజెక్టులపై ప్రత్యేక నజర్‌ 
పెండింగ్‌ ప్రాజెక్టులపై ప్రత్యేక చొరవ తీసుకుంటామని ఆయన తెలిపారు.మిషన్‌ భగీరధ పథకం ద్వారా ప్రతీ ఇంటింటికీ త్వరలోనే మంచినీటిని అందిస్తామన్నారు,పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.జాతీయ రహదారులపై ప్రత్యేక ద ష్టి సారిస్తున్నామని ఆయన తెలిపారు.నాందేడ్‌ అంకోలా రహదారి, మెదక్‌ నుండి బై%శీ%సా వరకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు, మెదక్‌ మెయిన్‌ రోడ్డు నుండి డంప్‌ యార్డు వరకు కొత్త రైల్వే స్టేషన్‌ మీదుగా 100 ఫీట్ల రోడ్డు డివైడర్‌ తో పాటు, పట్టణంలో సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు కోసం పనులు వేగవంతం చేస్తున్నామన్నారు.మెదక్‌ మెయిన్‌ రోడ్‌ నుండి చేగుంట రోడ్డుకు లింక్‌ రోడ్‌ ను పట్టణంలోని నర్సకేడ్‌ మీదుగా కలిపేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం కోసం నిధులు పెంచుతున్నట్టు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ 70 లక్షల నిధులు ఇవ్వడానికి అంగీకరించారని ఆయన తెలిపారు. దీంతో పాటు పాపన్నపేట మండలంలోని లక్ష్మీనగర్‌ నుండి గాంధారిపల్లి వరకు కొత్త రోడ్డుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది త్వరలోనే ఈ పనులను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.దీంతో పాటు మెదక్‌ పట్టణంలో స్లాటర్‌ హౌస్‌ కోసం భూమిని కేటాయించడం జరిగిందని తెలిపారు,పనులు మందకొడిగా జరుగుతున్నాయని కాంట్రాక్టర్లను అడిగారు దీంతో నవంబర్‌ 30 వరకు పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పడంతో నవంబర్‌ వరకు గడువు విధించారు,ఈ లోగానే పనులు పూర్తి చెయ్యాలని కాంట్రాక్టర్‌ లను ఆదేశించారు. 
– పనుల్లో జాప్యం వద్దు 
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివ ద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని మంత్రి అధికారులను హెచ్చరించారు,అందరి భాగస్వామ్యంతోనే అభివ ద్ధి జరుగుతుందని అధికారులు దీంట్లో కీలక భూమిక పోషిస్తారన్నారు.కానీ ఇటీవల మిషన్‌ భగీరధ,జాతీయ రహదారుల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని ఫిర్యాదులు వచ్చాయన్నారు అధికారులు ఇలాంటి ఘటనలు పునరావ తం కాకుండా చూడాలని ఆదేశించారు.ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ఆయా నియోజక వర్గాల్లో పెండింగ్‌ ప్రాజెక్టులపై స్థానిక శాసనసభ్యులు పనులు జరుగుతున్న తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరిసుభాష్‌ రెడ్డి, మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి,దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రాంలింగారెడ్డి,జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి,ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.