రివాల్వర్‌ రాణి అభాదేవి

సాయంత్రం 5 గంటలు.. బీహార్‌ లోని పట్నా జిల్లా అలంపూర్‌ గోన్‌పుర గ్రామ పంచాయతీ కార్యాలయం.. ఆ గ్రామ సర్పంచ్‌ అభాదేవి విధుల్లో బిజీగా ఉన్నారు.. ఇంతలో ఒక ఫోన్‌ కాల్‌ .. సమీప గ్రామంలో ఒక అమ్మాయిని కొందరు యువకులు వేధిస్తున్నారన్న సమాచారం అందించారు.. వెంటనే అభాదేవి టేబుల్‌పై ఉన్న రివాల్వర్‌ తీసుకొని వాహనంలో అక్కడకు చేరుకుంది. ఆమె రాకను గమనించిన రౌడీలు పారిపోయారు..ఇలా ఒక్క ఈవ్‌టీజింగే కాదు మహిళలకు సంబంధించిన పలు సమస్యలను తీర్చడంలో ఆమె ముందుంటున్నారు. 
ఆమె వస్తుందని తెలిస్తే చాలు అల్లరి మూకలు ఎక్కడికక్కడ పారిపోతాయి. గ్రామ పెద్దకంటే ముందు అభాదేవి ఓ సాధారణ గహిణి. భర్తపేరు రామ్‌ అయోధ్య. ఓసారి దొమ్మీలో అభాదేవిని చుట్టుముట్టాయి రౌడీ మూకలు. అప్పట్లో వారి బారినుంచి ఎలాగోలా ప్రాణాలతో బైటపడింది. అప్పటినుంచి ఆమె తనకు తోడుగా తుపాకీని ఉంచుకుంటోంది. 2016లో తుపాకీ లైసెన్స్‌ తీసుకున్న అభాదేవి ఎప్పుడూ తన వెంట రివాల్వర్‌ ఉంచుకుంటుంది. 
బీహార్‌లోని పాట్నా జిల్లాలో 14 గ్రామాలకు పెద్ద ఆమె. పేరు అభా దేవి. ఎప్పుడూ చీరకట్టులో రివాల్వర్‌ పెట్టుకుని ఉంటుంది. రివాల్వర్‌ రాణి, లేడీ లయన్‌గా బీహార్‌లో పాపులర్‌. ఆ గ్రామంలోనే కాదు, జిల్లాలోనే రివాల్వర్‌ రాణి అంటే అందరికీ హడల్‌. రౌడీ మూకలు ఎక్కువగా తిరిగే బీహార్‌ లో అభా దేవి స్థానికులకు అండగా నిలబడ్డారు. ఎక్కడ ఎలాంటి ఆగడాలు జరిగినా బాధితులు పోలీసులకు కాకుండా నేరుగా అభాదేవికే ఫోన్‌ చేస్తారు. 
ఇంట్లోనుంచి బైటకు వచ్చిందంటే చాలు తుపాకీ ఉండాల్సిందే. తన పరిధిలోని గ్రామాల్లో ఎప్పుడైనా గొడవలు జరిగితే వెంటనే తుపాకీ తీసుకుని అక్కడికి వెళ్లేది. గాల్లోకి బుల్లెట్లు పేల్చి చాలా సందరాÄల్లోే గొడవలు జరగకుండా ఆపింది. ఇటీవలే గోన్‌పురా గ్రామంలో ఓ బాలికను కొంతమంది వేధిస్తుంటే ఆ బాలిక తండ్రి సమాచారం మేరకు వెంటనే ఆ ఊరికి వెళ్లింది అభా దేవి. ఆమె రాకతో ఎక్కడివారక్కడ పరారయ్యారు. చివరికి వారి తల్లిదండ్రుల్ని పిలిపించి గట్టిగా వార్నింగ్‌ ఇచ్చి వదిలేసింది అభాదేవి. రివాల్వర్‌ రాణిగా పాట్నా జిల్లా వాసులకు అండగా నిలబడింది. 
13 గ్రామాల్లో మహిళలకు ఆమే పెద్ద దిక్కు! 
అలంపూర్‌ గోన్‌పుర గ్రామ పంచాయతీ కింద మొత్తం 13 గ్రామాలున్నాయి. ఆకతాయిలు, రౌడీలు, గూండాలకు ఆమె పేరు చెబితేనే హడలిపోతారు. అవసరమైతే కాల్చేందుకు కూడా వెనకాడరని మహిళా సంఘాలు చెబుతున్నాయి. 2011, 2016 సంవత్సరాల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆమె సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మహిళల హక్కులకు ఎలాంటి భంగం కలిగినా ఊరుకోరు. పోలీసులు సైతం ఈవ్‌టీజింగ్‌ కేసులు తమ వద్దకు వస్తే ఆమె దగ్గరకే వెళ్లమని సూచించడం విశేషం. ఆమెను సహించలేని కొందరు 2015లో అభాదేవిపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. కానీ ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకొంది. దీంతో తుపాకీ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. 2016లో ఉన్నతాధికారులు తుపాకీ లైసెన్స్‌ను మంజూరు చేయడంతో రివాల్వర్‌ను కొనుగోలు చేసి ప్రాణ రక్షణగా ఉంచుకుంది. భర్త శిక్షణ ఇవ్వడంతో తుపాకీ ప్రయోగించడం నేర్చుకుంది. 2017లో పంచాయతీ పరిధిలోని ఒక గ్రామంలో మత ఘర్షణలు చెలరేగాయి. ఇరువర్గాలు దాడులకు దిగారు. అక్కడకు చేరుకున్న ఆమె ఒక కర్ర తీసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. 
అభివద్దిలోనూ ముందంజ 
అభాదేవి సర్పంచ్‌గా పదవీబాధ్యతలు స్వీకరించిన అనంతరం పంచాయతీ కార్యాలయానికి నూతన భవనాన్ని నిర్మించారు. పాఠశాల భవనాలను కూడా నిర్మిస్తున్నారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇంకా కళాశాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎప్పుడూ రివాల్వర్‌ చేతబట్టుకొని తిరగడంతో ఆమెను స్థానికులు ‘లేడీ సింగం” రివాల్వర్‌ రాణి’గా పిలుస్తున్నారు. ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు సేవచేయడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. 
బిహార్‌ లోని పట్నా జిల్లా అలంపూర్‌ గోన్‌పుర గ్రామ పంచాయతీ కార్యాలయం.. ఆ గ్రామ సర్పంచ్‌ అభాదేవి విధుల్లో బిజీగా ఉన్నారు.. ఇంతలో ఒక ఫోన్‌ కాల్‌ .. సమీప గ్రామంలో ఒక అమ్మాయిని కొందరు యువకులు వేధిస్తున్నారన్న సమాచారం అందించారు.. వెంటనే అభాదేవి టేబుల్‌పై ఉన్న రివాల్వర్‌ తీసుకొని వాహనంలో అక్కడకు చేరుకుంది. ఆమె రాకను గమనించిన రౌడీలు పారిపోయారు..ఇలా ఒక్క ఈవ్‌టీజింగే కాదు మహిళలకు సంబంధించిన పలు సమస్యలను తీర్చడంలో ఆమె ముందుంటున్నారు. 