‘పాలమూరు’ పరుగులెత్తాలి
పాలమూరు-రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టు రిజర్వాయర్లు పంప్‌హౌస్ పనులు
మూడు షిఫ్టుల్లో యుద్ధప్రాతిపదికన పూర్తవ్వాలి: కేసీఆర్
- అధికారులు, ప్రజాప్రతినిధులతో సీరియస్
- ప్రాజెక్టు పనుల ఆలస్యంపై అసహనం
- కరివెన, భూత్పూర్ రిజర్వాయర్ పనుల పరిశీలన
- నాలుగు నెలల్లో పనులు పూర్తిచేయాలని ఆదేశం
- వట్టెం జలాశయం పనుల పరిశీలన
- బిల్లుల చెల్లింపునకు ఎలాంటి సమస్యలు లేవు
- ఆర్‌అండ్‌ఆర్ భూసేకరణ నిధులను వెంటనే విడుదల చేస్తాం
- ముంపు గ్రామస్తులకు మంచి ధరపై హామీ
”అన్నీ అనుకూలంగా ఉన్నా కరివెన పనులు ఇంకా పూర్తి కాకపోవడానికి కారణమేంటి? నాలుగు నెలల్లో రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలి. పనులను వేగవంతం చేసి మూడు షిఫ్టుల్లో పనిచేసి పూర్తిచేయాలి. ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లుల చెల్లింపునకు ఎలాంటి సమస్యలు లేవు.ఆరు నెలల్లో వట్టెం రిజర్వాయర్ పనులను పూర్తిచేయాలి. ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్‌అండ్‌ఆర్ భూసేకరణ నిధులను వెంటనే విడుదల చేస్తాం. పనులను ఎట్టి పరిస్థితుల్లోను ఆపొద్దు. రిజర్వాయర్, పంప్‌హౌస్ పనులను సమాంతరంగా పూర్తి చేయాలి. పునరావాస, భూ సేకరణకు సమస్య లేకుండా వెంటనే నిధులు విడుదల చేస్తాం” -కేసీఆర్
బిజినేపల్లి :
పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పాలమూరు జిల్లాలో 15 నుంచి 18 లక్షల ఎకరాలకు నీరుందుతాయని చెప్పారు. పాలమూరు జిల్లాలను పాలుగారే జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనలో భాగంగా వనపర్తి జిల్లా ఏదులలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాదిలోపు పాలమూరు-ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులను నీటితో నింపడానికి నిధులు కేటాయిస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తయితే జిల్లాకు మంచి ఫలితాలు రానున్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అసమర్థ పాలకుల వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు.
గోదావరి-కష్ణా అనుసంధానం గొప్ప నిర్ణయమని కేసీఆర్ అన్నారు. దీని ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరగనుందన్నారు. దీనిపై పొరుగు రాష్ట్ర సీఎంతో చర్చలు జరుగుతున్నాయన్నారు. త్వరలో అవి పూర్తయి ఓ నిర్ణయానికి రానున్నామని చెప్పారు. ఏపీలో చంద్రబాబు వంటి నేతలు సంకుచిత మనస్తత్వంతో విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా తగదాలకు దిగడం తప్ప వేరేదేమీ లేదని విమర్శించారు. బాబ్లీ విషయంలో మహారాష్ట్రతో గొడవ పెట్టుకుని ఆయన ఏం సాధించారని ప్రశ్నించారు. అదే మహారాష్ట్రతో తాము సఖ్యతగా మాట్లాడి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.
పాలమూరును వలసల జిల్లాగా మారేందుకు కారణమైన వారే ఇవాళ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. వారే ఇక్కడి రైతుల కడుపు కొడుతున్నారని ఆరోపించారు. పాలమూరు ప్రజలు మమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకున్నారని, వారి రుణం తీర్చుకుంటామని చెప్పారు. గతంలో మిషన్ భగీరథ విషయంలోనూ విమర్శలు చేసిన వారు ఇప్పుడు గుడ్లెళ్లబెట్టి చూస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.
పాలమూరు-రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టు రిజర్వాయర్లు పంప్‌హౌస్ పనులను మూడు షిఫ్టుల్లో యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని గురువారం సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. భూత్పూర్‌లోని కరివెన రిజర్వాయర్ పనులతో పాటు వట్టెం రిజర్వాయర్ పనులనూ ఆయన పరిశీలించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా కరివెన రిజర్వాయర్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం కరివెన రిజర్వాయర్ వద్ద ప్రాజెక్టు పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం మాట్లాడారు. అన్ని అనుకూలంగా ఉన్నా కరివెన పనులు ఇంకా పూర్తి కాకపోవడానికి కారణాలు ఏంటని ఆరా తీశారు. నాలుగు నెలల్లో రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను వేగవంతం చేసి మూడు షిఫ్టుల్లో పనిచేసి పూర్తిచేయాలన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లుల చెల్లింపునకు ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. అనంతరం సీఎం అక్కడి నుంచి బయల్దేరి నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలానికి బయల్దేరివెళ్లారు. అక్కడ వట్టెం జలాశయం పనులను పరిశీలించారు.
ఆరు నెలల్లో వట్టెం రిజర్వాయర్ పనులను పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన బిజినపల్లి మండలం వట్టెం రిజర్వాయర్ పనులను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన అధికారులు, సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులతో ప్రాజెక్టు పనులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులలో మరింత వేగం పెంచడానికి ప్రస్తుతం ఒక షిఫ్ట్ ద్వారా పనులను కొనసాగిస్తున్నందున 3 మూడు షిఫ్టులతో పనులు నిర్వహించాలని ఆరు నెలల్లోగా పూర్తి చేయడానికి ఏజెన్సీలు, అధికారులు ప్రత్యేక దష్టి కేంద్రీకరించాలని ఆయన ఆదేశించారు.
పాలమూరు-రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టు రిజర్వాయర్లు పంప్‌హౌస్ పనులను మూడు షిఫ్టుల్లో యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. భూత్పూర్‌లోని కరివెన రిజర్వాయర్ పనులతో పాటు వట్టెం రిజర్వాయర్ పనులనూ ఆయన పరిశీలించారు. ఈ రెండు రిజర్వాయర్ల పనులను నాలుగు నెలల్లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ” ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్‌అండ్‌ఆర్ భూసేకరణ నిధులను వెంటనే విడుదల చేస్తాం. పనులను ఎట్టి పరిస్థితుల్లోను ఆపొద్దు. రిజర్వాయర్, పంప్‌హౌస్ పనులను సమాంతరంగా పూర్తి చేయాలి.” అని అన్నారు.
భూసేకరణకు సంబంధించిన చెల్లింపులకు నిధులను విడుదల చేస్తామని, తెలిపారు. అదే విధంగా మిగిలి ఉన్న భూసేకరణ ఏమైనా ఉంటే కూడా దానిని పూర్తిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రికి శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి, బాలరాజు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మావతి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ తదితరులు పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడారు. భూములకు మంచి ధర కల్పించాలని రైతులు ముఖ్యమంత్రిని కోరారు. సీఎం , పూర్తి బాధ్యత తనదేనని ముంపు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా చేరుకొని 12:30 కి తిరిగి బయల్దేరారు. సీఎం వెంట మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ , పి ఆర్ ఎల్ ఐ ఎస్ సిఇ రమేష్, బి జి ఆర్ సంస్థ ఎండి ఉమాపతి రెడ్డి, ఎన్ సి సి డైరెక్టర్ ఏబీఎన్ రాజు, పి ఆర్ ఎల్ ఐ ఎస్ ఈ ఈ ప్రభాకర్, తదితరులు ఉన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులలో వేగం పెంచాలని.. యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించిన రిజర్వాయర్లు, పంప్ హౌస్‌ల పనులను వేగంగా చేయాలని సూచించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను కేసీఆర్ పరిశీలించారు. బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరిన ముఖ్యమంత్రి.. మహబూబ్‌నగర్ జిల్లా కరివెన సమీపంలో నిర్మిస్తున్న జలాశయ పనులను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం బట్టుపల్లి తండా సమీపంలో నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. మార్చిలోపు రివిట్మెంట్ పనులతో పాటు రిజర్వాయర్, పంప్ హౌస్ పనులను సమాంతరంగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. పునరావాస, భూ సేకరణకు సమస్య లేకుండా వెంటనే నిధులు విడుదల చేస్తామని తెలిపారు. అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లా వట్టెం జలాశయ పనులను పరిశీలించారు. హెలిప్యాడ్ నుంచి నేరుగా వట్టెం గ్రామస్థుల వద్దకు చేరుకున్న సీఎం.. వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. భూసేకరణ నిధులతో పాటు గ్రామాభివద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా గ్రామస్థులు కేసీఆర్‌ను కోరారు.