అపోహలు..అపార్థాలు

మన సమాజంలో చాలా రకాల అపోహలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో చాలా తరచుగా ప్రస్తావనకు వచ్చేవీ… ఏమాత్రం శాస్త్రీయ ఆధారాలు లేని కొన్ని అపోహలనూ వాస్తవాలను మీ కోసం ఇక్కడ పేర్కొంటున్నాం. ఇవే అపోహలు మీకూ ఉంటే వాస్తవాలను తెలుసుకొని, వాటిని వీడండి. నిశ్చింతగా ఉండండి. 
పిల్లలకు మెల్ల అదష్టమా? 
చిన్న పిల్లల్లో మెల్ల కన్ను ఉంటే అది అదష్టవుని కొందరు అపోహపడుతుంటారు. కానీ అది వాస్తవం కాదు. ఒక్కోసారి మెల్లకన్ను వల్ల పిల్లలు చూపు కోల్పోయే పరిస్థితీ రావచ్చు. మామూలుగానైతే… ఎటు తిప్పినా రెండు కళ్లూ సవూంతరంగా ఉండాలి. ఈ అలైన్‌మెంట్‌ లోపించడాన్ని మెల్ల అంటారు. అంటే.. రెండు కనుపాపలూ ఒకే వైపు చూడవన్నవూట. దాంతో కనుపాప ఎటో ఒక వైపునకు కాస్తంత పక్కకు తిరిగి ఉండటం వల్ల ఆ కంటిలో ఏర్పడే ప్రతిబింబం స్పష్టంగా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మెల్లకు తగిన చికిత్స అందించి చూపును చక్కదిద్దాలి. అలాగే వదిలేస్తే, పైకి చూడ్డానికి బాగానే ఉన్నా కనుగుడ్డు సక్రమంగా లేని కన్ను నుంచి మెదడు సిగ్నల్స్‌ను స్వీకరించడం క్రమంగా తగ్గిస్తుండటం, నిరాకరిస్తుండటంతో క్రమంగా ఆ కన్ను తన చూపు కోల్పోయే అవకాశం ఉంది. 
అందుకే పిల్లల్లో మెల్లకన్ను ఉంటే కంటి డాక్టర్‌ దగ్గరికి తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఇక కొందరు తల్లిదండ్రులు ఈ విషయాన్ని మొదటే గమనించినా.. పిల్లలు ఎదిగిన తర్వాత పరీక్షలు చేయించవచ్చని భావిస్తుంటారు. అది సరి కాదు. పిల్లల్లో మెల్లకన్నును గుర్తించగానే ఆ చిన్నారులను డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లాలి. మెల్లకన్నుకు వెంటనే సరైన చికిత్స చేయించకపోతే అది ఆంబ్లోపియా (లేజీ ఐ) అనే దుస్థితికి దారితీయవచ్చు. అంటే.. మెల్ల ఉన్న కంటిలో చూపు క్రవుంగా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సాధారణంగా ఆరేళ్ల లోపు మెల్లకంటిని చక్కదిద్దకపోతే ఆ కంటిలోని ద ష్టిలోపం శాశ్వతం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. అందుకే మెల్ల కన్నును గుర్తించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. 
ఏ గుడ్డు మంచిది..? 
ఫారం కోడిగుడ్ల కంటే నాటు కోడి గుడ్లలో చాలా బలం ఉంటుందనీ, శక్తి, ఆరోగ్యం కోసం దాన్ని తింటేనే మంచిదనే ఒక అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అది కేవలం అపోహ మాత్రమే. ప్రజల్లో ఉన్న ఆ భావన వల్లనే గోధుమ రంగు పెంకు ఉన్న గుడ్లు తెల్లటి పెంకు ఉంటుందన్న అభిప్రాయంతో చాలా మంది కాస్త ముదురు రంగు ఉన్న గుడ్లను ఎక్కువ ధరకు కొంటుంటారు. ముదురు రంగు పెంకు ఉన్న గుడ్లు మరింత బలవర్ధకం ఏమీ కాదు. నిజానికి కోడి గుడ్డు పెంకు ఏ రంగులో ఉన్నా వాటిల్లోని పోషకాలు ఒకే విధంగా ఉంటాయి. కాకపోతే నాటు కోడి గుడ్డు పరిమాణం కాస్త చిన్నగానూ, ఫారం కోడి గుడ్లు కాస్త పెద్దగానూ ఉంటాయి. అయితే వాటిల్లోని తెల్లసొన, పచ్చసొనలో పోషక విలువలు మాత్రం ఒకేలా ఉంటాయి. ఆ రెండు రకాల గుడ్లలో ఉండే ఐరన్‌ పాళ్లు కూడా ఒకటే. వినియోగదారులు ముదురు రంగు పెంకు ఉన్న గుడ్లను ఎక్కువ ధర వెచ్చించి కొనడం కేవలం వాళ్ల మానసిక సంత ప్తి కోసం మాత్రమేనని గుర్తించడం మేలు