10 జిల్లాలలోనే నక్సల్స్ సమస్య
ముఖ్యమంత్రుల సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా
న్యూఢిల్లీ:
దేశవ్యాప్తంగా కేవలం 10 జిల్లాల్లోనే నక్సల్స్ సమస్య ఎక్కువగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేతత్వంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. దీన్ని నివారించేందుకు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివ ద్ధి పనులను స్థానికులకే అప్పగించాలని సమావేశం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉన్న పరిమితిని రూ.5లక్షలకు రూ.50లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో బ్యాంకులు, టవర్లు, తపాలా సేవలు అందుబాటులోకి తేవాలని ఈ భేటీలో నిర్ణయించారు. అభివ ద్ధి తప్ప మరో అంశానికి తావు ఉండకూడదని అమిత్‌షా అన్నారు. అవకాశం ఉన్న ప్రతి చోటా ఏటీఎంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏపీ, తెలంగాణలో నక్సల్స్ నిర్మూలన చర్యలు చేపట్టడంలో సఫలీక తమయ్యామని హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ సహా వివిధ రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు.
జగన్ లేవనెత్తిన అంశాలివే..
గిరిజన ప్రాంతంలో ప్రత్యేక మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఏర్పాటు చేయాలని సీఎం జగన్ కోరారు. ప్రత్యేక ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీని నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఐటీడీఏ పరిధిలో ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నెలకొల్పాలని సూచించారు. విజయనగరం
జిల్లా సాలూరులో ఓ ట్రైబల్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరారు.
మావోయిస్ట్ సమస్యను ఎదుర్కోవడంలో తెలుగు రాష్ట్రాలు రోల్ మోడల్‌గా నిలిచాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశంసించారు. దేశంలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పరిస్థితిని బేరీజు వేసేందుకు కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న ఈ సమావేశంలో భద్రత, అభివ ద్ధి, గిరిజన హక్కులపై చర్చిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితుల గురించి హోంశాఖ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశంలో మాట్లాడుతూ.. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. మధ్యాహ్నం సెషన్‌లో కేంద్ర గ్రామీణ అభివద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, నైపుణ్యాభివ ద్ధి శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాల్గొన్నారు.
తెలంగాణ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, జార?ండ్ సీఎం రఘుబర్ దాస్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, చత్తీస్‌గఢ్ సీఎం భాఘెల్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఆయా రాష్ట్రాల డీజీపీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.