అనాథలకు ‘అమ్మ ఆసరా’

బిడ్డల నిరాదరణకు గురైన తల్లులు, తండ్రులు ఎంతమందో రోడ్డు పక్కన అనాథల్లా పడి ఉండే వారెందరో.. ఫుట్‌పాత్‌లపై ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నవారెందరో.. ఇలాంటివారికి తమను ఎవరో ఆదుకుంటారనే భరోసా అస్సలు ఉండదు. అలాగే జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. ఎవరైనా ఆపన్నులు ఆదుకుంటే చివరి నిముషంలో సంతోషంగా వెళ్లిపోతారు..మరి వారిని ఆదుకోవడానికి యాంత్రిక జీవనంలో ఎవరికి ఖాళీ ఉంటుంది. ఉన్నా మనసున్న వారెందరు? కానీ ఇలాంటివారికి తోడుగా నేనున్నా అంటోంది ”అమ్మ ఆసరా ఫౌండేషన్‌”. బిడ్డల నిరాదరణకు గురైన వారిని, అభాగ్యులను, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న అనాథ రోగులను చేరదీసి వారికి కావాల్సినవి అమరుస్తూ చల్లని తల్లిలా ఆదుకుంటోంది సంస్థ వ్యవస్థాపకురాలు విజయలక్ష్మి. 

యాదాద్రి జిల్లా బోనగిరి మండలంలోని వీరవల్లి గ్రామానికి చెందిన విజయలక్ష్మి అనాథలకు సేవజేయడం కోసం నగరంలో స్థిరపడింది. భర్త కస్తూరి భాస్కర్‌, కుమార్తె సౌమ్య, కుమారుడు రాహుల్‌తో ఉంటోంది. కుమారుడు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. సొంతంగా ఏపనీ చేసుకోలేని పరిస్థితి. కొడుకుకు బాగు చేయించడం కోసం ఎంతో శ్రమించింది. కష్టాలుపడింది. తన కొడుకుతోపాటు ఇతరులకూ సేవచేయాలనే ఆలోచన రావడంతో ఈ సంస్థను స్థాపించింది. బోడుప్పల్‌లోని చెంగిచర్లలో ఆశ్రమాన్ని అద్దె భవనంలో నడుపుతోంది. ‘నువ్వు పెరగడానికి నా గర్భస్థానాన్నే ఇచ్చాను. నేను ఉండటానికి నీ ఇంట ఓ చీకటి గది కూడా లేదా కొడుకా’.. అంటూ కన్న కొడుకుల నిరాదరణకు గురైన తల్లుల ఆవేదనను సంస్థ స్లోగన్‌గా మార్చింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో ఎవరైనా అనాథలు కనిపిస్తే చాలు అమ్మ ఆసరాకు సమాచారం అందిస్తారు. వెంటనే వారి వివరాలు కనుక్కుని, ఎవరూ లేరని తెలిస్తే కనుక స్థానిక పోలీసులకు వివరాలు అందజేసి తన ఆశ్రమానికి తీసుకెళ్తుంది విజయలక్ష్మి. ఆశ్రమంలో వారికి ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌, రాత్రి భోజనం అందిస్తున్నారు. ఎవరికి ఏది కావాలంటే అది సమకూరుస్తారు. అమ్మ ఆసరా ఫౌండేషన్‌లో సుమారు 20 మంది వరకు వద్ధులు, మరో 15 మంది చిన్నారులు ఉన్నారు. రెండేళ్ల నుంచి ఆశ్రమాన్ని నడుపుతూ అందులో ఉన్న వారికి ఎలాంటి లోటు రాకుండా సొంత ఖర్చులతో వారి ఆలనాపాలనా చూస్తున్నారు. షణ్ముఖచారి, కొత్త గోపాల్‌ గౌడ్‌, సికింద్రాబాద్‌ వివేక్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు శ్రీనివాస్‌ గుప్తాల సహకారంతో ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నట్లు వ్యవస్థాపకురాలు చెబుతున్నారు. 
అనాథలకు వైద్యసేవ 
సికింద్రాబాద్‌, బోయగూడ, ఉప్పల్‌, బోడుప్పల్‌, గాంధీ ఆస్పత్రి, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, బేగంపేట్‌, ట్యాంక్‌బండ్‌ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లపై ఉన్న అనాథలకు చిన్న జ్వరం వచ్చి బాధపడుతున్నా అమ్మ ఆసరా వారిని ఆదుకుంటుంది. వారిని తమ సొంత ఖర్చుతో ఆటోలో గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయిస్తారు. ఆస్పత్రిలో దొరకని మందులు, ఆహారం ఇలా ఏ అవసరమొచ్చినా సమకూరుస్తున్నారు. 2018 ఆగస్టు 27న మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి ఆశ్రమం కొద్ది దూరంలో హరిత అనే మహిళా కుటుంబ గొడవల కారణంగా ఒంటిపై కిరోసిన్‌ చల్లుకొని నిప్పంటించుకుంది. అటుగా వెళ్తున్న విజయలక్ష్మి ధైర్యంగా మంటలు ఆర్పి, బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి మానవత్వాన్ని చాటుకుంది. 
సొంత ఖర్చులతో దహన సంస్కారాలు 
నగరంలోని ఫుట్‌పాత్‌లపై ఎందరో యాచకులు కనిపిస్తారు. ఎక్కువ మంది ఏ దిక్కూ లేని అనాథలే. ఇలాంటి వారిలో ఎవరైనా మత్యువాత పడితే దహన సంస్కారాలు చేసే వారే ఉండరు. నెలలో సుమారు ఐదు నుంచి పది మంది అనాథలు చనిపోయిన ఉదంతాలూ ఉన్నాయి. ఇలాంటి సమాచారం అందుకున్న పోలీసులు వివేక్‌ ఫౌండేషన్‌, అమ్మ ఆసరా ఫౌండేషన్‌లకు సమాచారం ఇస్తారు. ఫోన్‌కాల్‌ అందుకున్న వెంటనే విజయలక్ష్మి వచ్చి చనిపోయిన వారికి సొంత ఖర్చుతో దహస సంస్కారాలు చేస్తారు. 
ఫోన్‌ చేస్తే చాలు అందుబాటులోకి.. 
సికింద్రాబాద్‌, ఉప్పల్‌, మెట్టుగూడ, హబ్సిగూడ, చిలకలగూడ, వారాసిగూడ పరిసరాల్లో అనాథలు కనిపిస్తే 99851 11567 నంబర్‌కు ఫోన్‌ చేస్తే అమ్మ ఆసరా వెంటనే స్పందించి, వారిని చేరదీసి తమ ఆశ్రమానికి తీసుకెళ్తారు. ఇలాంటి మంచి పనులకు నలుగురూ సాయం చేస్తే మరింత సేవలందించే అవకాశం ఉంటుందని అంటోంది 
”నాన్న టీచర్‌, మేం ముగ్గురం ఆడపిల్లలం. మధ్యతరగతికి చెందిన కుటుంబం మాది. నాన్న చాలా మందిని ఉచితంగా చదివించారు. ఇవన్నీ చూస్తూ పెరిగాను. మమ్మల్ని మగపిల్లల్లా పెంచారు. 2016 డిసెంబర్‌లో క్యాన్సర్‌తో నాన్న చనిపోయారు. ఆయన ఆశయం ఏంటంటే అనాథలను కాపాడమని చెప్పేవారు. గాంధీలో నాన్న అనారోగ్యంతో అనుభవించిన అవస్థలు చూశాం. ఇవన్నీ అనుభవించిన నాన్న తన ఆశయాన్ని నా ద్వారా తీర్చుకోవాలనుకున్నారు. 45 మంది వ ద్ధులు మా ఆశ్రమంలో ఉన్నారు. వారికి తిండి బట్ట అన్నీ సమకూరుస్తున్నాం. కొంతమంది ఇచ్చే విరాళాలతో ఇవన్నీ చేయగలుగుతున్నాం. తల్లిదండులు చనిపోయిన పిల్లలు 20 మంది వరకు ఉన్నారు. వారిని చదివిస్తున్నట్లు” చెబుతోంది విజయలక్ష్మి. 
సొంత ఖర్చులతో దహన సంస్కారాలు 
నగరంలోని ఫుట్‌పాత్‌లపై ఎందరో యాచకులు కనిపిస్తారు. ఇందులో ఎక్కువ మంది ఏ దిక్కూ లేని అనాథలే. ఇలాంటి వారిలో ఎవరైనా మత్యువాత పడితే దహన సంస్కారాలు చేసే వారే ఉండరు. నెలలో సుమారు ఐదు నుంచి పది మంది వరకు అనాథలు చనిపోయిన ఉదంతాలూ ఉన్నాయి. ఇలాంటి సమాచారం అందుకున్న పోలీసులు ముందుగా వివేక్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు శ్రీనివాస్‌ గుప్తా, అమ్మ ఆసరా ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు విజయలక్ష్మి సమాచారం ఇస్తారు. ఫోన్‌కాల్‌ అందుకున్న వెంటనే విజయలక్ష్మి వచ్చి చనిపోయిన వారికి అన్నీ తామే అయి సొంత ఖర్చుతో దహస సంస్కారాలు చేస్తారు. 
అత్యవసర పరిస్థితిలో ఫోన్‌ చేయండి.. 
సికింద్రాబాద్‌, ఉప్పల్‌, మెట్టుగూడ, హబ్సిగూడ, చిలకలగూడ, వారాసిగూడ పరిసరాల్లో అనాథలు కనిపిస్తే 99851 11567 నంబర్‌కు ఫోన్‌ చేస్తే చాలు విజయలక్ష్మి వచ్చేస్తారు. ఒక వేళ అమ్మ ఆసరా ఫౌండేషన్‌కు సహాయం చేయాలనుకునే వారు అమ్మ ఆసరా ఫౌండేషన్‌, విజయలక్ష్మి, హెడీఎఫసీ బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌ -50200029631007, ఐఎప్‌ఎస్‌సీ కోడ్‌ హెచ్‌డీఎఫసీ 0004480న తోచిన సహాయం అందించవచ్చు. 
ప్రభుత్వం ఆదుకోవాలి 
అనాథలకు సేవ చేయడంలో భర్త తోడుగా నిలిచారు. సికింద్రాబాద్‌ పరిసరాల్లోని పలు వురు అనాథలను ఆశ్రమంలో చేర్చుకున్నాను. ఆనారోగ్యంతో ఉన్న యాచకులను, వద్ధు లను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నాను. ఉదయం వెళ్లి రాత్రి 11 గంటలకు తిరిగి వస్తా. ఇంటికి రాగానే భర్త వేడినీళ్లు కాచి ఇస్తారు. స్నానం చేయగానే కూతురు భోజనం వడ్డిస్తుంది. బుద్ధిమాద్యంతో ఉన్న కొడుకు ఆప్యాయంగా తన వద్దకు రావడం ఇలా రోజులు గడిచిపోతుంటాయి. ఆనాథలను ఆశ్రమంలో చేర్చుకొని సేవ చేస్తున్నాననే తప్తి చాలు. తాను చేస్తున్న సేవలకు ప్రభుత్వం చేయూతనిస్తే మరింత సేవ చేస్తా. చిన్నపాటి షెల్టర్‌ ఏర్పాటు చేసి ఇస్తే బాగుంటుంది. స్కూళ్లకు సరఫరా చేసే భోజనం ఇక్కడి వారి కోసం పంపిస్తే అంతకంటే మేలు ఇంకేముంటుంది అంటారు విజయలక్ష్మి.