అవినీతి అనేది ఉండొద్దు

  • పనుల కోసం వచ్చిన ప్రజలు సంతృప్తితో వెళ్లాలి
  • కలెక్టర్‌లు, ఎస్పీలు ఆకస్మిక తనికీలు చేయండి
  • సెప్టెంబరు నుంచి కొత్త ఇసుక పాలసీ
  • అన్ని ర్యాంపుల్లో వీడియో కెమెరాలు ఉంటాయి
  •  పారదర్శక విధానంతో ఇసుక కొరత అన్నది లేకుండా చూడాలి
  • అవసరమైతే మరిన్ని ర్యాంపులు తెరవండి
  •  ప్రతి కలెక్టర్‌ గ్రామ సచివాలయాన్ని ఒక బిడ్డ మాదిరిగా చూడాలి
  • సంతృప్తి స్థాయిలో పథకాలు అమలు జరగాలి
  • ‘స్పందన’లో వచ్చే ప్రతీ ఫిర్యాదు పరిష్కారంకు కృషి చేయండి
  •  ప్రజల్లో ప్రభుత్వంపై, అధికారులపై మరింత నమ్మకం పెంచండి
  • స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్మోహన్‌రెడ్డి
  • అమరావతి, జులై30: రాష్ట్రంఓ అవినీతి అనేది ఉండొద్దని, పనుల కోసం కార్యాలయాలకు వచ్చిన ప్రజలు సంతృప్తితో వెళ్లాలని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన(ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ సవిూక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. తాము పెట్టిన అర్జీ చెత్తబుట్టలోకి పోవడం లేదు.. వాటిని కలెక్టర్లు పరిశీలిస్తున్నారనే సంకేతం ప్రజల్లోకి వెళ్లిందని అన్నారు. ఆ నమ్మకంతోనే స్పందన కింద వస్తున్న దరఖాస్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రతీ కలెక్టర్‌ గ్రామ సచివాలయాన్ని ఒక బిడ్డ మాదిరిగా చూడాలని సూచించారు. కలెక్టర్లు ధ్యాస పెడితేనే వివిధ సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయన్నారు. ప్రతీ ఎమ్మార్వో కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం కూడా స్పందనలో పాల్గొంటోందా? లేదా? ప్రతి ఎమ్మార్వో, ఎంపీడీఓ స్పందనను సీరియస్‌గా తీసుకుంటున్నారనే అనుకుంటున్నా. ఎక్కడైనా అలా జరగకుంటే.. ఇకపై జరిగేలా చూసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను జగన్‌ ఆదేశించారు. ఫోకస్‌ విషయంలో ఎక్కడా వెనకడుగు వేయొద్దని, మండలాల్లో ఎక్కడా అవినీతి కూడా లేకుండా చూడాలని సూచించారు. ప్రజలు సంతృప్తిగా ఉండాలని, కలెక్టర్లు, ఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. అవినీతి చేస్తే సహించబోమని ప్రతి సవిూక్షా సమావేశంలో చెప్పాలని, అవినీతి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డపేరు తెచ్చుకోవద్దని, ఎమ్మార్వో కార్యాలయంలో జరిగితే కలెక్టర్‌కు, పోలీస్‌ స్టేషన్‌లో జరిగితే ఎస్పీకి చెడ్డపేరు వస్తుందని, అందుకే ప్రతి సవిూక్షా సమావేశంలో ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నా అని అధికారులతో జగన్‌ అన్నారు. సెప్టెంబరు నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందన్నారు. అన్ని ర్యాంపుల్లో వీడియో కెమెరాలు ఉంటాయని, పారదర్శక విధానం ఉంటుందని, ఇసుక కొరత అన్నది లేకుండా చూడాలని, అవసరమైతే ర్యాంపులు తెరవండని, వాటి సంఖ్య పెంచండని సూచించారు. అదే సమయంలో అవినీతి లేకుండా చూసుకోండి. ఇసుక లభ్యత లేకపోతే రేటు పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడతారని, ఇసుక సమస్యపై కచ్చితంగా దృష్టి పెట్టండి అని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.
    మధ్యాహ్న భోజనం క్వాలిటీపై ప్రవేశపెట్టంది ..
    మధ్యాహ్న భోజనం క్వాలిటీపై దృష్టిపెట్టాలని జగన్‌ అధికారులకు సూచించారు. పాత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నింటినీ విడుదల చేయలమని ఆదేశించానని, మధ్యాహ్న భోజనం పథకానికి సరైన సమయంలో డబ్బులు ఇవ్వాలని, లేకపోతే భోజనం నాణ్యత తగ్గిపోతుందన్నారు. చెల్లింపులు సకాలంలో జరగాలని, ఈ విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టిపెడుతుందని, గుడ్డు నాణ్యత బాగోలేదని నా దృష్టికి వస్తోంది. దానిపై దృష్టిపెట్టాలని జగన్‌ సూచించారు. మధ్యాహ్న భోజన బాధ్యత కలెక్టర్లకే అప్పగిస్తున్నామని, పైస్థాయిలో మధ్యాహ్నభోజనంపై ఎలాంటి నిర్ణయాలు వద్దని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలకు భవనాల గుర్తింపు తప్పనిసర అని, అన్ని వసతులు ఉన్నాయా? లేదా? చూసుకోవాలన్నారు. కంప్యూటర్‌ పెట్టాలని, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండాలని, స్కానర్‌ ఉండాలని, ప్రింటర్‌ ఉండాలని జగన్‌ సూచించారు. దరఖాస్తు పెట్టిన 72 గంటల్లో రేషన్‌ కార్డు, పెన్షన్‌ కార్డు ఇచ్చేట్టు ఉండాలని జగన్‌ ఆదేశించారు. గ్రామ సెక్రటేరియట్‌ పెట్టిన తర్వాత అడిగిన వారికి అడిగిన కార్డు ఇచ్చేట్టు ఉండాలన్నారు. ఇలా అయితేనే గ్రామ సచివాలయానికి ఒక అర్థం వస్తుందని, అలాంటప్పుడే ప్రజల హృదయాల్లో గ్రామ సచివాలయం నిలుస్తుందన్నారు. ఇక మినర్‌ వాటర్‌ ప్లాంట్లు, మురుగునీటి శుద్ధి ఎ/-లాంట్లవిూద కూడా దృష్టిపెట్టండని, వాటిని తిరిగి నిర్వహణలోకి తీసుకురావాలని జగన్‌ సూచించారు. జిల్లాలో ఉన్న ప్లాంట్లు అన్నీ కూడా కచ్చితంగా పనిచేయాలని, కరువు పీడిత ప్రాంతాల్లో నవధాన్యాల సాగుకు దృష్టిపెట్టాలన్నారు. ఈ మేరకు రైతులను ఎడ్యుకేట్‌ చేయాలి అని సీఎం జగన్‌ కలెక్టర్లను ఆదేశించారు.