బాలల గేయ రచన పోటీలకు ఆహ్వానం
ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్
అమరావతి,జ్యోతిన్యూస్:
ఆంధ్ర సారస్వత పరిషత్తు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా బాలల కోసం 2026 డిసెంబర్ 5,6 తేదీల్లో ఒంగోలు నెక్టస్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న నాలుగో ప్రపంచ తెలుగు మహా సభలు-బాలలు పురస్కరించుకుని బాల సాహిత్యాన్ని పెంపొందించేందుకు‘బాల గేయాల రచన’పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు.ఈ పోటీలో ఏ వయసు వారైనా పాల్గొనవచ్చని, గేయంహొ15 పంక్తులు (లైన్లు) మించకుండా ఉండాలని కోరారు. గేయ రచన తెలుగు భాష,సంస్కృతి,జీవన విధానం, భారతీయతలపైహొఆసక్తి,అనురాగంహొకలిగించే విధంగా ఉండాలని తెలిపారు.పోటీలకు పంపే గేయాలు రాత ప్రతిని పిడిఎఫ్ పద్దతిలో 2026 ఆగస్టు 10 వరకుహొకోరుప్రోలు మాధవరావు,9866995085 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపాలని సూచించారు. ప్రథమ బహుమతికి వ•డువేల రూపాయలు,ద్వితీయ బహుమతికి రెండువేల రూపాయలు, తృతీయ బహుమతికి వేయి రూపాయలు,పది ప్రోత్సాహక బహుమతులకు ఒక్కొకటిహొఅయిదు వందల రూపాయల చొప్పున అందజేస్తామని, వీటితో పాటు ప్రశంసా పత్రము,పతకం మహాసభల సమయంలో విజేతలకు ప్రదానం చేయ డం జరుగుతుందని కార్యదర్శి ధవేజీ,ముఖ్య సమన్వయకర్తలు డా.మురళీధర్ రెడ్డి,కోగంటి శ్రీకాంత్‌లు తెలిపారు. ఎన్నిక కాబడిన గేయాలను ధ్వని ముద్రణ చేసి,ఏఐ ద్వారా వీడియో లుగా రూపొందించి ప్రచారం చేస్తామనిహొకార్యక్రమ అంతర్జాతీయ,జాతీయ సమన్వయకర్తలు కొల్లి రమావతి,రాధికా మంగిపూడి తెలిపారు.

