తెలుగు భాషను కాపాడుకోవాలి
రాజమహేంద్రవరం,జ్యోతిన్యూస్ :
తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని ప్రముఖ రచయిత,బహుముఖ ప్రజ్ఞాశాలి విశ్వనాథ గోపాలకృష్ణ వెల్లడించారు. అందరికీ అన్నం పెట్టేది భాష అని, సమాజం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు భాష చుట్టూ పరిఢి విల్లుతాయని తెలిపారు.రాజమహేంద్రవరంలోని ధర్మం చెర ఆడిటోరియంలో బహుముఖ ప్రజ్ఞాశాలి విశ్వనాథ గోపాలకృష్ణ, ధూళిపాలి మహాదేవమణి,యువ అవధాని సందీప్ తదితరుల సమక్షంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు కరపత్రాలు విడుదల చేశారు.ఆ సందర్భంగా పెద్దలు విశ్వనాథ గోపాలకృష్ణ మాట్లాడుతూ రాజమహేంద్ర వరంలో రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం మంచి విషయం అని ఎందరో కవులు పండితులు అవధానులు మరి ఎంతోమంది పెద్దలు ఈ సభకు వస్తున్నారని,ఈ సభలు విజయవంతంగా నిర్వహించబడాలని కోరుకుంటున్నానని అన్నారు. ధూళిపాళ మహ దేవమణి మాట్లాడుతూ అమ్మ, భాష రెండు విడదీయలేనివని, అమ్మని భాషని కాపాడుకోవాల్సిందేనని అన్నారు.ఈ కార్యక్రమంలో సారస్వ్వత పరిషత్తు ముఖ్య సంచాలకులు కేశిరాజు రాంప్రసాద్, శోభాయాత్ర సాహసంచాలకులు సుమేధా వెంకట్రావు,ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కోట్ల కనకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.