అమ్మభాషను మరవవద్దు
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించిన మంత్రి
ఖమ్మం,జ్యోతిన్యూస్ :
ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం ఆంధ్ర సారస్వత పరిషత్తు,చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 2024 జనవరి 5,6,7వతేదీలలో రాజమండ్రి లో జరుగు 2వ ప్రపంచ తెలుగు మహాసభల గోడ పత్రికను మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు చే ఆవిష్కరణ జరుగగా తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి లెనిన్ శ్రీనివాస్,కవి,నటులు,ఉద్యమకారులు వికాస వేదిక సాహిత్య సంస్థ జిల్లా బాధ్యులు నామవరపు కాంతేశ్వరావు, రెంటాల చిన్న హుస్సేన్,గోపిషెట్టి వేంకటేశ్వర్లు, రెళ్ళా శ్రీను,నల్ల కృష్ణ,గుమ్మడి పుల్లయ్య,మలిషెట్టి కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.తెలుగు కోసం సంస్కృతి,సంప్రదాయాల పరిరక్షణ ,ముందు తరాలకు తెలుగు ఓన్నత్య ము కోసం జరుగుతున్న ఈ మహాసభలకు హాజరు కావాలని మంత్రి తుమ్మలను వికాస వేదిక సాహిత్య సంస్థ కార్యదర్శి లెనిన్ శ్రీనివాస్ ఆహ్వనించారు.