‘‌పెత్తనం’ ఏంటీ…?

  • మరోమారు కేంద్రాన్ని,కాంగ్రెస్‌ను ఏకేసిన సీఎం కేసీఆర్‌
  • ‌ప్రాజెక్టులపై కేంద్ర పెత్తనం తగదంటూ ఆగ్రహం
  • కేంద్రం ఇచ్చేదానికన్నా కడుతున్న పన్నులే ఎక్కువ
  • పదేళ్ల కాంగ్రెస్‌ ‌హయాంలో చేసిందేమీ లేదని విమర్శలు
  • శాసనసభ వేదికగా రాష్ట్రంలో సంక్షేమం,అభివృద్దిపై వివరణ
  • త్వరలోనే సొంత జాగాల్లో డబుల్‌ ఇళ్లకు ఆర్థిక సాయం
  • గురుకులాలతో పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం
  • 24 గంటల కరెంట్‌ ఇచ్చి తెలంగాణను ముందువరసలో నిలబెట్టాం
  • అసెంబ్లీలో కేంద్రం తీరుపై మండిపడ్డ కేసీఆర్‌

‌హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌శాసనసభ చివరి రోజు సమావేశాల్లో సిఎం కెసిఆర్‌ ‌మరోమారు కేంద్రాన్ని, కాంగ్రెస్‌ను కడిగి పారేశారు. గతంలో పాలించిన కాంగ్రెస్‌ అభిశృద్ది చేయకపోగా అడ్డుతుగులుతోందని అంటే..కేంద్రం ప్రాజెక్టులపై పెత్తనం చేయాలని చూస్తోందని అన్నారు. గత రెండు రోజులుగా వివిధ సందర్భాల్లో కేంద్రాన్ని, కాంగ్రెస్‌ను విమర్శిస్తూ వచ్చిన కెసిఆర్‌ ‌శుక్రవారం కూడా స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాట్లాడుతూ ఇద్దరినీ ఏకిపారేశారు. రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం సరికాదు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కృష్ణా, గోదావరి గెజిట్‌ అమలు వాయిదా వేయాలని కోరాం. కానీ గెజిట్‌ అమలు వాయిదా వేస్తామని కేంద్రం చెప్పింది. అవసరమైతే ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం సరికాదన్నారు. 2001లో తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టామని, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ అధికారంలోనే ఉందని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నా కాంగ్రెస్‌ ‌పట్టించుకోలేదని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు పెద్ద బాధ్యత అప్పగించారని, అభివృద్ధి, సంక్షేమం అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి రాలేదు. కేంద్రం ఎన్నో అప్పులు చేస్తోంది. కేంద్రం మాకు ఇచ్చేది ఏం లేదు. మేమే కేంద్రానికి ఇస్తున్నాం. కేంద్రానికి అధిక ట్యాక్స్ ‌చెల్లించే 4 రాష్టాల్ల్రో తెలంగాణ ఒకటి. రాజకీయంగా ఎదగాలనుకుంటే అనేక మార్గాలున్నాయి. ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడి అబసుపాలు కావొద్దు. కేంద్రం అనే మాట ఎత్తి నవ్వుల పాలు కాకండి.. అది రాజకీయంగా వి•కే నష్టం‘ అని కేసీఆర్‌ అన్నారు.వైఎస్‌ ‌హయాంలో కొన్ని కార్యక్రమాలు జరిగి ఉండొచ్చు. వైఎస్‌ ‌హయాంలో తెలంగాణకు చాలా అంశాల్లో నష్టం జరిగిందన్నారు. ఇప్పుడు తెలంగాణ గొప్పగా పురోగమి స్తోంది. రాజకీయాల పేరిట రాష్టాన్న్రి మలినం చేయొద్దు.. రాష్టాన్న్రి శపించొద్దు. గంజాయి, డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించాం. 57 ఏండ్లు నిండిన వారికి పెన్షన్‌, ‌కొత్త రేషన్‌ ‌కార్డులకు మళ్లీ అర్జీలు స్వీకరిస్తామని అన్నారు. అనాథల కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటాం అని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వెనుకబడి ఉన్నారు. ఓసీల్లోనూ పేదలు ఉన్నారు. పేదల కోసం ఎంత గొప్పగా చేశామన్నదే పాయింట్‌. 2004 ‌నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలో ఉంది.. పదేళ్లలో ఎంతో చేశామని కాంగ్రెస్‌ ‌గొప్పలు చెప్పుకుంది. కానీ ఫలితాలు కనిపించలేదు. సంక్షేమం, అభివృద్ధిలో వేగంగా ముందుకెళ్తున్నాం. దీర్ఘకాలికమైన ప్రాజెక్టులు జరుగుతున్నాయి. పారిశ్రామిక రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నాం. ఆధ్యాత్మిక పరిమళాలు కూడా వెదజల్లుతున్నాయి. మక్కామసీదు రిపేర్‌ ‌జరుగుతోంది. చర్చిలకు కూడా నిధులు ఇస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నాం. బోనాల పండుగకు నిధులు ఇచ్చి వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నాం. యాదాద్రి ఖ్యాతి విశ్వవిఖ్యాతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని మతాలను గౌరవించాలన్నదే మా ప్రభుత్వ అభిమతం అని వివరించారు. ఈ మధ్య రాజకీయాల్లో చీప్‌గా మాట్లాడుతున్నారు. వి• జేబుల్లో నుంచి ఇస్తున్నారా? అని మాట్లాడు తున్నారు. ప్రజలు కట్టే పనులను సమన్వయం చేసి తిరిగి ప్రజలకు ఎంత ఉజ్వలంగా, వారి అవసరాల కోసం ఎట్ల వాడుతామన్నది వారి నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. మేం మొదటి టర్మ్‌లో తక్కువ మెజార్టీతో గెలిచాం. సెకండ్‌ ‌టర్మ్‌లో మంచి మెజార్టీతో గెలిచాం. 32 జిల్లా పరిషత్‌లను గెలిచాం. మున్సిపాలిటీల్లో 136 గెలిచాం. హైదరాబాద్‌లో మేయర్‌ ‌స్థానాన్ని కైవసం చేసుకున్నాం. మిగతా కార్పొరేషన్లలోనూ టీఆర్‌ఎస్‌దే విజయం. ఈ నేపథ్యంలో ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గ్రామాల్లో వికాసం కనబడుతోంది అని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. టీఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను విమర్శిస్తున్న కాంగ్రెస్‌ ‌పార్టీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కడిగిపారేశారు. వి•రు నీళ్లు ఇవ్వలేదు.. మేం ఇస్తున్నాం. వి•కు మేనేజ్‌మెంట్‌ ‌స్కిల్స్ ‌తక్కువ ఉండే. మాకు స్కిల్స్ ఉన్నాయి. శావి•ర్‌పేట వద్ద కొత్త రిజర్వాయర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. మల్లన్నసాగర్‌ ‌నుంచి నీళ్లు తీసుకువస్తాం. కరెంట్‌ ‌వి•రు ఇవ్వలేదు. మేం ఇస్తున్నాం. ఇది ప్రజలకు తెలుసు. వి•రు పదేపదే మాట్లాడి వి•రే దెబ్బతింటారు. వి• హయాంలో అపర మేధావులు, ప్రపంచ మేధావి ఉండే. ఎందుకు ఉచిత కరెంట్‌ ఇవ్వలేదు. రోశయ్య విద్యుత్‌ ‌మంత్రిగా ఉన్నప్పుడు.. రెండేండ్లలో విద్యుత్‌ ‌వ్యవస్థను మంచిగా చేసి ఇస్తా.. లేదంటే ఇదే శాసనసభలో ఉరేసుకుంటా అన్నారు. ఆయన గాశారం బాగాలేక అది కాలేదు. ఓసారి మధ్యాహ్నం సెషన్‌కు బ్రీఫ్‌కేస్‌లో తాడు తెచ్చుకున్నాడు. మేమందరం వారించి వద్దన్నాం. విద్యుత్‌ ‌విషయంలో మనందరం బాధితులమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 20 వేల కోట్లు ఖర్చు పెట్టి.. నిరంతరాయ విద్యుత్‌ ఇస్తున్నాం. ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఎన్టీపీసీ నుంచి 4 వేల మెగావాట్ల పవర్‌ ‌స్టేషన్‌ ‌ఫలితాలు అందుతాయి. భదాద్రి, యాదాద్రి పవర్‌ ‌ప్లాంట్లు త్వరలోనే పూర్తవుతాయి. నాణ్యమైన విద్యుత్‌ను ఇవ్వగలుగుతున్నాం. దీంతో పెట్టబడులు తరలి వస్తున్నాయి అని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. అలాగే విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌ ‌వివరణాత్మక సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించి, అనుమానాలను నివృత్తి చేశారు. హోంగార్డులకు మంచి జీతాలు ఇస్తున్నాం. ట్రాఫిక్‌ ‌పోలీసులకు రిస్క్ అలవెన్స్ ఇస్తున్నామని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. సెక్రటేరియట్‌లో గుడి, మసీదును అందంగా తీర్చిదిద్దుతాం. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయమని సీఎం స్పష్టం చేశారు. ఇండియా మొత్తంలో కూడా గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో నరేగా కార్యక్రమం జరుగుతోంది. నిజానికి వాస్తవం చెప్పాలంటే ఫీల్డ్ అసిస్టెంట్‌లను తొలగించిన తర్వాతే డబ్బుల వినియోగం పెరిగింది. పని దినాలు పెరిగాయి. అసెట్స్ ‌క్రియేట్‌ అవుతున్నాయి. చాలా అక్రమాలు జరిగాయి. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ ప్రతిపాదనను విచారించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇకపోతే ఐదో తరగతి నుంచి గురుకులాలు ప్రారంభించాం..కేజీ టు పీజీ కార్యక్రమానికి నేనే రూపకల్పన చేశాను. మంచి విద్యను అందిస్తే ప్రపంచంతో పోటీపడి బతుకుతారు. గురుకుల పాఠశాలలు ప్రారంభించడానికి ముందు మేధావులతో మాట్లాడాను. ఇంగ్లీష్‌ ‌వి•డియంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఇవాళ గురుకులాల్లో పెట్టే డైట్‌ను కూడా నేనే తయారు చేశాను. ఐదో తరగతి లోపు పిల్లలను గురుకులాల్లో వేస్తే హోం సిక్‌ అయ్యే అవకాశం ఉంది అని చెప్పారు. మేధావులు, చైల్డ్ ‌సైకాలజిస్టుల సూచనల మేరకు ఐదో తరగతి నుంచి గురుకులాలను ప్రారంభించాం. ఇండియాలోనే ఎక్కడ లేనన్ని గురుకులాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. నాణ్యమైన విద్యను అందిస్తూ.. కడుపునిండా భోజనం పెడుతున్నాం. గురుకులాలకు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నాం. డబుల్‌ ‌బెడ్రూం ఇండ్లు కట్టే చోట ప్రభుత్వమే జాగాలు తీసుకుని నిర్మిస్తుంది. హైదరాబాద్‌లో బహుళ అంతస్తుల్లో డబుల్‌ ‌బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నాం. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఈ ఇండ్లు నిర్మించి ఇస్తున్నాం. సొంత జాగాల్లో ఇండ్లు నిర్మించుకునేవారికి నగదు అందిస్తాం. కరోనా వల్ల ఆలస్యమైంది. వంద శాతం ఈ స్కీంను త్వరలోనే ప్రారంభిస్తాం. నియోజకవర్గానికి వెయ్యా, పదిహేను వందలు ఎంత అనేది ఆలోచిస్తామన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చురకలంటించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ‌చెక్కుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ ‌స్పందించారు. కల్యాణలక్ష్మి పథకం ప్రారంభంలో కొంతమంది లంచాలు తీసుకున్నట్లు రిపోర్టు వచ్చింది. అప్పుడు రూ. 51 వేలు ఉండే. నా దగ్గరి మిత్రుడి ఇంట్లో ఓ పిల్లాడు పని చేస్తాడు. ఆ పిల్లోడికి పెళ్లి అయిన తర్వాత కల్యాణలక్ష్మి చెక్‌ ‌వచ్చిందా? అని నా మిత్రుడు అడిగితే.. రూ. 51వేలకు బదులు.. నాకు రూ. 40 వేలు ఇచ్చిండు అని చెప్పిండంట. ఆయనొచ్చి నాకు చెప్పిండు. ఆ తర్వాత నేనే వి•టింగ్‌ ‌పెట్టి ఎమ్మెల్యేలతో ఆలోచించాను. అవును సర్‌.. ‌నిజమే అని చెప్పారు. కల్యాణలక్ష్మి చెక్‌ల పంపిణీనీ ఎమ్మెల్యే సూపర్‌ ‌వైజింగ్‌లో పెట్టాలని నిర్ణయించాం. ఎమ్మెల్యే సంతకం పెడితేనే చెక్‌ ‌మంజూరు అవుతుంది. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి చెక్‌లు పంపిణీ చేస్తున్నాం. రాజాసింగ్‌ ఎమ్మెల్యే.. వి•కే సర్వాధికారాలు ఉన్నాయి. అలా జరుగుతుందంటే గవర్నమెంట్‌ ‌కంటే వి•కే ఎక్కువ అవమానం. అట్ల జరగనివ్వొద్దు. వి•రంటే భయం లేదని అర్థమైతుంది. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చెక్‌లు పంపిణీ చేసిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ‌రాలేదు. తొలిసారిగా వింటున్నాను. అలాంటి తప్పు జరిగితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు.
……………………