టీటీడికి ‘కొత్త పాలకులు’
- 25మందితో టిటిడి పాలకమండలి నియామకం
- తెలుగు రాష్ట్రాల నుంచి 8మందికి అవకాశం
- ఎక్స్ అఫీషియో సభ్యులుగా చెవిరెడ్డి,బూమన
- పారిశ్రామికవేత్తలు జూపల్లి,పార్థసారథిరెడ్డిలకు చోటు
అమరావతి,జ్యోతిన్యూస్ :
తిరుమల తిరుపతి టీటీడీ కొత్త పాలకమండలిని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 25 మందితో టీటీడీ పాలక మండ లిని ప్రభుత్వం నియమించింది.ఈ పాలకమండలిలో ఏపీ నుంచి నలుగురు,తెలంగాణ నుంచి నలుగురు,తమిళనాడు నుంచి ముగ్గురు,కర్ణాటక నుంచి ఇద్దరు,మహారాష్ట్ర నుంచి ఒకరు స్థానం దక్కించుకున్నారు.ఎక్స్అఫిషియో సభ్యు లుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు. పాలకమండలిలో పారిశ్రామిక వేత్త మైహోం రామేశ్వరరావు, హేటిరో పార్దసారధి రెడ్డి, మురంశెట్టి రాములు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,ముంబాయికి చెందిన రాజేశ్ శర్మ, ఇండియా సిమెంట్స్‌కు చెందిన శ్రీనివాసన్ రెండోవసారి సభ్యత్వాన్ని దక్కించుకున్నారు. వ్యాపా రవేత్త మారుతి,ఆడిటర్ సనత్,యంయస్‌యన్ ల్యాబ్స్ జీవన్‌రెడ్డి,కోల్‌కతాకు చెందిన సౌరభ్‌లు కూడా పాలక మండ లిలో చోటు దక్కించుకున్నారు.మహారాష్ట్ర నుంచి శివసేనా కార్యదర్శి మిలింద్‌కు అవకాశం కల్పించారు.ఏపీ నుంచి పోకల అశోక్ కుమార్,మల్లాడి క్రిష్ణారావు,వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, గొర్ల బాబూరావు,తెలంగాణ నుంచి జూపల్లి రామేశ్వ రావు, రాజే శర్మ, పార్థసారధి రెడ్డి,కల్వకుర్తి విద్యాసాగర్,తమిళనాడు నుంచి శ్రీనివాసన్, ఎమ్మెల్యే నందకుమార్, కన్నయ్య,కర్ణాటక నుంచి ఎమ్మెల్యే విశ్వనాధ్‌రెడ్డి, శశిధర్ మహారాష్ట్ర నుంచి శివసేన కార్యదర్శి మిలింద్‌కు అవకాశం లభించింది.బోర్డు సభ్యుల వివరాలను ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధికారికంగా ప్రకటించనున్నారు.పాలకమండలిలో కొత్త వారికే ఎక్కువ అవకాశం కల్పించినట్టు సుబ్బారెడ్డి తెలిపారు.ప్రత్యేక ఆహ్వానితులకు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేశారు.గత పాలక వర్గంలో మొత్తం 36 మంది సభ్యులు ఉండగా అందులో 24 మంది పాలక మండలి సభ్యులు, 8మందికి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమితులయ్యారు.అయితే ఈసారి ఆ సంఖ్యను కుదించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి అవకాశం కల్పి స్తూ పాలకమండలి కూర్పు జరిగింది.