కొనసాగుతున్న ‘నిమజ్జనాలు’
- నేడు సుప్రీంలో విచారణ
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా హుస్సేన్ సాగర్‌లో గణెళిష్ నిమజ్జనం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్‌కి గణనాథులు తరలి వస్తున్నారు. మట్టి వినాయకులతో పాటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కూడా ఒకే చోట సిబ్బంది నిమజ్జనం చేస్తోంది. జీహెచ్‌ఎంసీ వరుసగా మూడు భారీ క్రేన్స్ పెట్టడంతో చురుకుగా నిమజ్జనాలు సాగుతున్నాయి. పీఓపీ గణపయ్యలనే తేడా లేకుండా భక్తులు నిమజ్జనం చేస్తున్నారు. ఇకపోతే హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది. త్వరగా విచారణ చేపట్టాలని ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. నేడు విచారణకు తీసుకోవాలని ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీంతో గురువారం విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయకూడదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.