‘డ్రగ్స్ ‌మాఫీయా’గా మారింది

  • తెలంగాణ డ్రగ్స్ ‌మాఫియాగా మారింది
  • మత్తులో జోగుతున్న యువతతో అకృత్యాలు
  • సైదాబాద్‌ ‌చిన్నారి విషయంలో ఇంత నిర్లక్ష్యమా
  • నిందితుడిని పట్టుకున్నామని కెటిఆర్‌ ఎలా చెప్పారు
  • తప్పుడు సమాచారమిచ్చిన అధికారిని ఎందుకు ఉపేక్షించారు
  • డ్రగ్స్ ‌కేసును ఎవరి కోసం అణగదొక్కాలని చూశారు
  • కెటిఆర్‌ ‌ట్వీట్‌పై మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌సైదాబాద్‌ ‌చిన్నారి అత్యాచారం కేసు రాజకీయంగా హీట్‌ను పుట్టిస్తోంది. నిందితుడు గత ఆరు రోజులుగా తప్పిం చుకు తిరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసులపై విమర్శలు చుట్టుముడుతున్నాయి. సైదాబాద్‌ అత్యాచార సంఘటన నగర పోలీసులను ముప్పుతిప్పలు పెడుతుండడంతోపాటు రాజకీయ విమర్శలను సైతం ఎదుర్కొంటుంది. ఈనేపథ్యంలోనే టీపీసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా చిన్నారీపై అత్యాచారం జరిగిన తర్వాత మంత్రి కేటీఆర్‌ ‌చేసిన ట్వీట్‌ ‌పై ఆయన విరుచుకుపడ్డాడు. నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడని ,నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేయబట్టాలని ట్వీట్‌ ‌చేశారని, అయితే నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నట్టు చెప్పిన అధికారి ఎవరిని ఆయన ప్రశ్నించాడు.. తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారిని సస్పెండ్‌ ‌చేయాల్సిన అవసరం లేదా అంటూ ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో రాష్ట్రంలో మత్తులో జోగుతుందని ఆయన అన్నారు. సైదాబాద్‌లో గంజాయితో పాటు గుడుంబా విచ్చల విడిగా అమ్ముతున్నారని అయినా.. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందంటూ ఆయన విమర్శించారు. తెలంగాణలో జరుగుతున్న అత్యాచారాలకు మద్యమే కారణమని.. వ్యసనపరులకు తెలంగాణ స్వర్గధామం గా మారిందని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ లో మద్యం అమ్మకాలు రెట్టింపయ్యా యన్నారు. సైదాబాద్‌ ‌బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మంత్రి కేటీఆర్‌ ఐదు రోజుల కిందే ట్వీట్‌ ‌చేశారన్నారు. ఐదు రోజుల తర్వాత నిందితుడు దొరకలేదని పోలీసులు చేతులెత్తేశారని రేవంత్‌ ‌పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ ‌చేశామని కేటీఆర్‌కు ఏ అధికారి సమాచారం ఇచ్చారని ప్రశ్నించారు. తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారిని ఎందుకు బర్తరఫ్‌ ‌చేయలేదని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌ ‌హోష్‌లో ఉండే ట్విట్‌ ‌చేశారా? అని ప్రశ్నించారు. ఉదయం 5 గంటల వరకు పబ్‌లు నడుస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వి• దగ్గరి బంధువులే పబ్‌లు నడుపుతున్నారన్నారు. టాలీవుడ్‌ ‌డ్రగ్స్ ‌కేసులో విచారణ ఏమైందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రోవైపు రాష్ట్ర వ్యాప్తంగా యువత డ్రగ్స్ ‌మత్తులో మునిగి పోతుందని చెప్పిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ ‌కేసును ముందుకు సాగకుండా అడ్డుపడుతుందని ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు విచారణ చేపడుతున్నా వారికి కావాల్సిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, అందుకే కేసు విచారణ సంవత్సరాలుగా కొనసాగుతుందని అన్నారు.విచారణ కొనసాగితే ఎవరు వెలుగులోకి వస్తారని సీఎం కేసిఆర్‌తో పాటు కేటిఆర్‌ ‌భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్ ‌విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ఈ కేసులో విచారణ జరుగుతున్న సమయంలోనే విచారణ అధికారిగా ఉన్న అకున్‌ ‌సబర్వాల్‌ను ఎందుకు బదిలీ చేశారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మత్తులో ఉండడతో విచ్చలవిడిగా డ్రగ్స్ ‌మాఫియా తన కార్యకలాపాలను కొనసాగిస్తుందని దుయ్యబట్టారు. యువత భవిష్యత్‌ ‌పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ఆయన మండిపడ్డారు. డ్రగ్స్ ‌మాఫియాతో హైదరాబాద్‌లో విష సంస్కృతికి అడ్డగా మారుతోందని అన్నారు. 2017లో విచారణ చేపట్టిన డ్రగ్స్ ‌కేసును అటకెక్కించడంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగాయని అయితే వాటికి పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని అన్నారు. అందుకే తాము కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేశామని చెప్పారు. మద్యంతో పాటు డ్రగ్స్ అమ్మకాలకు హైదరాబాద్‌ అడ్డగా మారుతుంటే…విశ్వనగరంగా ఎలా మారుతుందని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ఈ నెల 17న నిర్మల్‌కు రానున్న హోంమంత్రి అమిత్‌ ‌షాను కూడా కలిసి సీఎం కేసిఆర్‌ అ‌క్రమాలపై ఫిర్యాదు చేస్తామని అన్నారు.అయితే ఆయన అపాయింట్‌’‌మెంట్‌ను ఇప్పించాలని మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు .అప్పుడే బీజేపీ తెలంగాణ ప్రభుత్వంపై ఉన్న వైఖరి స్పష్టం అవుతుందని ఆయన అన్నారు.