మనుషుల్లో మానవత్వం లేదా ?
- మన చేయూత అధ్యక్షురాలు ఇందారపు సునీత శంకర్
గోదావరిఖని: ప్రభుత్వాలు మారినా కొత్త కొత్త చట్టాలు వచ్చిన రోజు రోజుకు మహిళలపై ,చిన్నారులపై మానవ మృగాలు కళ్లుమూసుకపోయి వయస్సుతో సంబంధం లేకుండా అత్యాచారానికి పాల్పడుతూ హత్యలు చేస్తున్నారని, మన చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షురాలు ఇందారపు సునీత శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.హైదరాబాద్ సింగరేణి కాలనీ ప్రాంతానికి చెందిన ఆరేళ్ల మైనర్ బాలి••పై అత్యాచారం చేసి ఆతికిరాతకంగా హత్య చేయడం జరిగిందన్నారు. మహిళలపై ఇంత జరుగుతున్న ప్రభుత్వాలు గట్టి చర్యలు చేపట్టకపోవడమే ఇలాంటి సంఘటన లకు నిదర్శనమన్నారు.గతంలో అత్యాచారం చేసిన సంఘటనలో ఉన్మాదులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినప్పటికీ, ఉన్మాదుల్లో ఎలాంటి మార్పు రాకపోవడం, ప్రభుత్వం చట్టాలను సరిగా అనుసరించకపోవడమే ఉన్మాదులు ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.ఇప్పటికైనా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణకు మహిళ చట్టాలను తీసుకు వచ్చి మహిళకు రక్షణగా ప్రభుత్వాలు అండగా ఉండాలని, ఇకముందు మహిళలపై సంఘటనలు జరగకుండా ఉండేందుకు చట్టాలను అమలు పరుస్తూ ఆచరణలో తీసుకురావాలని,ఎక్కడైతే చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడో ఆ సంఘటన స్థలంలోనే ప్రజల సమక్షంలో,ఆ ఉన్మాదిని అందరూ చూస్తుండగానే ఉరి తీయాల ని డిమాండ్ చేశారు.