అకాల వర్షంతో అన్నదాతల ఆందోళన
జనగామ,జ్యోతిన్యూస్ :
అకాల వర్షాలు రైతుల పంటలను ఆగం చేస్తున్నాయి. జనగామ జిల్లా కేంద్రంలో గురువారం తెల్లవారుజామున భారీ వాన కురిసింది. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని వ్యవసాయ మార్కెట్‌కు తీసుకు వచ్చిన ధాన్యం తడి ముద్దయ్యింది. రాశుల పోసిన ధాన్యం, బస్తాలు పెద్ద ఎత్తున తడిసిపోయాయి. దీంతో రైతులు ఏమిచేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఓ వైపు అకాల వర్షాలు రైతులను ఇబ్బందులు పెడుతుంటే అధికారులు సమయస్ఫూర్తితో పనిచేయాలని, జాప్యం చేయవద్దని కలెక్ట ర్ సూచించారు. రవాణాలో ఇబ్బందులు ఉండకుండ ధాన్యం తరలింపుపైనే దృష్టి పెట్టాలని అన్నారు. రైతులు ధాన్యంపై టార్పాలిన్‌లను కప్పి ఉంచుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు