రెండో డోసుకు రిజిస్టేష్రన్‌ అవసరం లేదు

  • లాక్‌డౌన్‌ ‌పక్కాగా అమలయితేనే కరోనా కంట్రోల్‌
  • ‌ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస రావు వెల్లడి
  • కొత్తగా 4693 కేసులు..మరో 33 మంది మృత్యువాత

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస రావు విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ ‌మినహాయింపు సమయంలో ప్రజలందరూ అత్యంత జాగరూకతతో ఉండాలని సూచించారు. లాక్‌డౌన్‌ ‌లక్ష్యాన్ని దెబ్బతీస్తే కరోనా కట్టడి సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో ఇంకా 15 లక్షల మందికి మే 31 లోపు వారికి రెండో డోస్‌ ‌వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రజలు ఆన్‌లైన్లో రిజిస్టేష్రన్‌ ‌చేయించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కోవిషీల్డ్ ‌రెండో డోసును 6 నుంచి 8 వారాల మధ్యలో తీసుకోవాలని, కోవ్యాగ్జిన్‌ 4 ‌నుంచి 6 వారాల మధ్యలో తీసుకోవాలని సూచించారు. మిగతా వారికి దశల వారీగా టీకాను అందిస్తామని ఆయన తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌ ‌నాటికి 236 ఆస్పత్రులు కోవిడ్‌ ‌సేవలకు అందుబాటులో ఉంటే, వాటిని 1200 కు పైగా పెంచుకున్నామని పేర్కొన్నారు. ఆక్సిజన్‌, ‌రెమిడేసివివర్‌ ‌గురించి స్టేట్‌ ‌టాస్క్‌ఫోర్స్ ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటుందని ప్రకటించారు. ఇకపోతే : తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గురువారం సాయంత్రం 5 గంటల వరకు 71,221 శాంపిల్స్‌ను పరీక్షించగా 4,693 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌-19‌తో 33 మంది మృత్యువాతపడ్డారు. కాగా 6,876 మంది కొవిడ్‌ ‌నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. నూతన కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 5,16,404కు చేరుకుంది.