‘‌కారు’లో నిశ్శబ్దం…!

  • టిఆర్‌ఎస్‌లో రాజకీయ నిశ్శబ్దం
  • ఈటెల బర్తరఫ్‌ ‌తర్వాత సైలెంట్‌ అయిన నేతలు
  • పరోక్షంగా సచనలు చేసిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
ఈటెల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించడం, పుట్టా మధును విచారించడ ంతో ఇప్పుడు తెలంగాణలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది. అధికార పార్టీ నేతల్లో సర్వత్రా ఉతకంఠ నెలకొంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ‌వ్యూహాలు కీలక నేతలకు సైతం అంతుచిక్కడంలేదు. ఇకపోతే అనేకమంది మంత్రులు, నేతలపై ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువగా భూకబ్జా ఆరోపణలే ఉన్నాయి. వారందరిపైనా చర్య తీసుకోవాలని విపక్షాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. మొత్తంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో ప్రస్తుత వ్యవహారాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియడంలేదు. ఆ మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ ‌బర్తరఫ్‌, ‌పెద్దపల్లి జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ‌పుట్ట మధు అరెస్టు వంటి వరుస పరిణామాల నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని, అవినీతి, ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి ఉద్వాసన తప్పదనే ప్రచారం జరుగుతోంది. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలపై కూడా కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కీలక నేతలు సహా ఏ ఒక్కరూ నోరువిప్పడంలేదు. గత ఏడాదిలో జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలతో టీఆర్‌ఎస్‌ ‌కుదుపునకు లోనైంది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా బీజేపీ దూకుడు పెంచడంతో సుమారు రెండు నెలలపాటు పరిస్థితులను మదింపు చేసిన కేసీఆర్‌ ‌తన వ్యూహానికి పదును పెట్టారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో వ్యూహం అమలు కు శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి 7న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య ప్రజాప్రతినిదులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. తాను సీఎంగా పదేళ్లు కొనసాగుతానని కుండబద్దలు కొట్టడంతోపాటు పార్టీ లైన్‌ ‌దాటి మాట్లాడేవారిపై కఠిన చర్యలు ంటాయని హెచ్చరించారు. పార్టీ సంస్థాగత బలోపేతం కోసం సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు షెడ్యూలును ప్రకటించారు. దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలతో దూకుడు పెంచిన బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆ ‌తర్వాత జరిగిన ఇతర ఎన్నికలను అస్త్రంగా ప్రయోగించారు. శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో రెండు సీట్లను గెలవడంతో మళ్లీ ఉత్సాహం నెలకొంది. సాగర్‌ ఉప ఎన్నిక లోనూ టిఆర్‌ఎస్‌ ‌తిరుగులేని ఆదిక్యం సాధించింది. సాగర్‌ ఉప ఎన్నికలో డిపాజిట్‌ ‌దక్కకుండా చేయడం ద్వారా టీఆర్‌ఎస్‌ ‌శిబిరంలో మునుపటి ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అలాగే వరంగల్‌,‌ఖమ్మం, ఇతర మున్సిపాలిటీ ల్లోనూ టిఆర్‌ఎస్‌ ఆధిక్యం ప్రదర్శించింది. దీంతో ఇక టిఆర్‌ఎస్‌కు తిరుగులేని పార్టీగా నిలిచింది. బిజెపివి కూడా తాటాకు చప్పుళ్లు అని తేలింది. ఈటెల రాజేందర్‌ ‌బర్తరఫ్‌తో ఇక పార్టీలో ఎలాంటి చర్చా సాగలేదు. సరికదా ఇప్పుడు ఈటెలకు పోటీగా అన్న చర్చ మొదల య్యింది. దీంతో ఇక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు మంత్రులపై చర్య ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు ప్రధానాంశంగా ఉంది. కేబినెట్‌ ‌భేటీ చివరలో అధికారులు బయటికి వెళ్లిన తర్వాత.. ఇటీవల మంత్రివర్గం నుంచి తొలగించిన ఈటల రాజేందర్‌ ‌విషయాన్ని సీఎం కేసీఆర్‌ ‌క్లుప్తంగా ప్రస్తావించారు. ఈటల రాజేందర్‌ ‌తప్పు చేశారు. దానిని ఆయన స్వయంగా ఒప్పుకొన్నారు. అందుకే కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. లేదంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేదన్నారు. అంతా చట్ట ప్రకారమే జరుగుతుందన్నారు. ఈ వ్యవహారంపై ఎవరూ మాట్లాడవద్దని, ఎవరిపని వారు చేసుకోవాలని మంత్రులకు స్పష్టంచేశారు.