రేపటి నుంచి లాక్డౌన్ అమలు
హైదరాబాద్,జ్యోతిన్యూస్:-
తెలంగాణలో లాక్డౌన్ విధిస్తూ కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 10 రోజుల పాటు ఈ లాక్డౌన్ కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. లాక్డౌన్ సమయంలో ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే వివిధ కార్యకలాపాలకు అవకాశమిచ్చారు.ప్రతి రోజూ ఉదయం 10 గంటల తర్వాత నుంచి మరు సటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమలు కానుంది. ఈ సమయంలో దాదాపు అన్ని కార్యకలా పాలను నిలిపివేయనున్నారు.అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నారు. మరోవైపు టీకా కొనుగోలుకు గ్లోబల్ టెం డర్లను పిలవాలని మంత్రివర్గం నిర్ణయించింది.లాక్డౌన్కు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.