తెలంగాణలో ‘లాక్‌డౌన్‌’…!?

  • ‌కరోనాపై అప్రమత్తం అయిన ప్రభుత్వం
  • నేడు తెలంగాణ కేబినేట్‌ ‌కీలక భేటీ
  • లాక్‌డౌక్‌ ‌సహా అనేక అంశాలపై చర్చించే అవకాశం
  • మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన భేటీ
  • తెలంగాణలో తాజాగా 32 మంది కరోనాతో మృతి
  • రాష్ట్రంలో కొత్తగా 4 వేల 826 పాజిటివ్‌ ‌కేసులు నమోదు
  • వరంగల్‌ ఎం‌జిఎం వైద్యురాలు పసునూరి శోభారాణి మృతి

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కరోనాపై కీలక నిర్ణయం తీసుకునే క్రమంలో కేబినెట్‌ ‌మంగళవారం అత్యవసర సమావేశంకానుంది. ఈ భేటీలో లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ ‌విధిస్తే జరిగే పర్యవసానాలపైనా చర్చించనున్నారు. లాక్‌డౌన్‌ ‌వల్ల సాధక బాధకాలు, ధాన్యం కొనుగోళ్ల ప్రభావం వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్‌ ‌సమావేశం జరగనుంది. ఈ భేటీ సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో కరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌విజృంభిస్తోంది. కోవిడ్‌ ‌కేసులు, మరణాలు పెరుగుతుం డడంతో ప్రజలు భయాదోళనకు గురవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తాజా కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా 4 వేల 826 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 5 లక్షల 02 వేల 187లక్షలకు చేరింది. ప్రస్తుతం 62 వేల 797 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. 7 వేల 754 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కరోనాతో 32 మంది మృతి చెందారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2 వేల 771కి చేరింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచించారు. కరోనాను నిర్లక్ష్యం చేయొద్దని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరించారు. తెలంగాణలో కరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌విజృంభిస్తోంది. కోవిడ్‌ ‌కేసులు, మరణాలు పెరుగుతుండడంతో ప్రజలు భయాదోళనకు గురవుతున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన ఫలితం కనిపించడం లేదు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచించారు. కరోనాను నిర్లక్ష్యం చేయొద్దని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరించారు. ఇదిలావుంటే వరంగల్‌ ఎం‌జీఎం డాక్టర్‌ ‌పసునూరి శోభారాణి (40) కరోనాతో మృతి చెందారు. డాక్టర్‌ ‌శోభారాణి ఏడాదిన్నరగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శోభారాణి మృతి చెందారు. శోభారాణి వరంగల్‌ ఎం‌పీ పసునూరి దయాకర్‌ ‌సప బంధువు. మరోవైపు ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా అధికమవుతున్నాయి. అటు ఆక్సిజన్ల కొరత కూడా ఉందని రోగుల బంధువులు అంటున్నారు