కోవిడ్‌ ‌పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం

  • వారికి తప్పనిసరిగా బెడ్లు అందించాలి
  • వైద్యంలో ఎక్కడా తేడా లేకుండా చూసుకోవాలి
  • ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయకుండా చూడాలి
  • కోవిడ్‌ ‌నియంత్రణపై ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం జగన్‌
  • ‌కడపలో ఆస్పత్రికి వైఎస్‌ ‌రాశేఖర్‌ ‌రెడ్డి పేరు
  • వర్చువల్‌గా ఏరియా ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం జగన్‌
  • ‌పుంగనూరులో బస్‌డిపోకు కూడా సీఎం శ్రీకారం

అమరావతి,జ్యోతిన్యూస్‌ :
‌కోవిడ్‌ ‌పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్‌ ‌పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు కేటాయించాలని సూచించారు. ఎంప్యానెల్‌ ‌చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలన్నారు. అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా, తప్పనిసరిగా చేర్చుకోవాలని అధికారులకు జగన్‌ ‌స్పష్టం చేశారు. కోవిడ్‌ ‌నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌క్యాంప్‌ ‌కార్యాలయంలో సక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్‌ ఎం‌ప్యానెల్‌ ఆస్పత్రులూ ఆ బెడ్లను ఇవ్వాలని, అందుకోసం ఆ ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్‌ ‌చేయాలని సూచించారు.టెంపరరీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు ఇవ్వాలని, కలెక్టర్లు నోట్గి• చేసిన నాన్‌ ఎం‌ప్యానెల్‌ ఆస్పత్రులూ ఆ బెడ్లు ఇవ్వాలని చెప్పారు. కోవిడ్‌ ‌పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ సందర్బంగా సిఎం మాట్లాడుతూ మనం రికార్డు స్థాయిలో పరీక్షలు చేస్తున్నాము. మన రికార్డులను మనమే బద్ధలు కొడుతున్నాము. కోవిడ్‌ ‌చికిత్స కోసం అవసరం మేరకు బెడ్ల సంఖ్య మరింత పెంచండి. కోవిడ్‌ ‌చికిత్స కోసం తీసుకున్న అన్ని ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చికిత్స చేయాలి. ఇందులో ఎక్కడా తేడా రాకూడదు. అలా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రులలో ఎన్ని బెడ్లు కోవిడ్‌ ‌రోగులకు ఉన్నాయన్న దానిపై మనకు పూర్తి స్పష్టత ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులు అన్నింటిలో కలిపి కోవిడ్‌ ‌రోగులకు మొత్తం ఎన్ని బెడ్లు ఉన్నాయన్నది తెలుస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల బెడ్లు. ప్రైవేటు ఆస్పత్రుల బెడ్లు. ఎన్నెన్ని అన్నదానిపై స్పష్టత వస్తుందన్నారు. 104 కాల్‌ ‌సెంటర్‌కు ఫోన్‌ ‌వస్తే, ఆ రోగి ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఆ జిల్లాకు మెసేజ్‌ ‌వెళ్తుంది. వెంటనే కలెక్టర్‌, ‌జిల్లా యంత్రాంగం స్పందించి, ఆయా ఆస్పత్రులలో రోగులను చేర్పించాలి. ఏ ఆస్పత్రి కూడా రోగుల నుంచి ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయకుండా చూడాలి. కోవిడ్‌ ‌రోగులకు పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల వద్ద కోవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్లు హ్యాంగర్లు పెట్టి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆస్పత్రి వైద్యులే అక్కడ కూడా సేవలంది స్తారు. అక్కడ అన్ని వసతులు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 108 ప్రభుత్వ ఆస్పత్రులు. 349 కార్పొరేట్‌ ఎం‌ప్యానెల్‌ ఆస్పత్రులు. 47 కార్పొరేట్‌ ‌టెంపరరీ ఎంప్యానెల్‌ ఆస్పత్రులు. 94 ప్రైవేట్‌ ‌కేటగిరీ ఆస్పత్రులు. ఆ విధంగా మొత్తం 598 ఆస్పత్రుల్లో 48,439 ఉండగా, వాటిలో 41,517 మంది చికిత్స పొందుతున్నా రు. మరో 6922 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రులలో ఉన్న వారిలో 24,500 మంది రోగులు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారు.అన్ని కోవిడ్‌ ఆస్పత్రులలో ఫుడ్‌ ‌క్వాలిటీ, శానిటేషన్‌ ‌బాగుండాలి. ఎక్కడా ఏ లోపం లేకుండా ఉండాలి. శానిటేషన్‌, ‌క్వాలిటీ ఫుడ్‌, ‌డాక్టర్ల అందుబాటు, ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు, ఆక్సీజన్‌.. ఈ 5 ‌మనకు చాలా ముఖ్యం. వైద్యులు లేకపోతే వెంటనే తాత్కాలికంగా అయినా నియామకాలు జరగాలి. ఆక్సీజన్‌ ‌సరఫరా, నిల్వలో ఎక్కడా ఏ లోపం ఉండకూడదు. ఎక్కడైనా అవసరం అయితే తగిన మరమ్మతులు చేయండి. కేంద్రం ఇంకా ఎక్కువ ఆక్సీజన్‌ ‌సరఫరా చేసేలా కృషి చేయడంతో పాటు, ఇతర ప్రత్యామ్నాయాలు ఏమిటన్నది ఆలోచించం డి. ప్రతి టీచింగ్‌ ఆస్పత్రి వద్ద 10 కెఎల్‌ ‌సామర్థ్యం, ఇతర ఆస్పత్రుల వద్ద 1 కెఎల్‌ ‌సామర్థ్యంతో ఆక్సీజన్‌ ‌స్టోరేజీ ఉండాలి. వీలైనంత త్వరగా అవి ఏర్పాటు కావాలి. మనకు రోజుకు 500 టన్నుల ఆక్సీజన్‌ ‌కావాలంటే, ఏం చేయాల న్నది ఆలోచించండి. సరఫరా నిల్వ ఎలా అన్నది చూడండని ఆదేశించారు.
కడపలో ఆస్పత్రికి వైఎస్‌ ‌రాశేఖర్‌ ‌రెడ్డి పేరు
కడపలో డాక్టర్‌ ‌వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి ఏరియా ఆస్పత్రిని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌ ‌నుంచి గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. అదే విధంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆర్టీసీ బస్‌ ‌డిపోను కూడా వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా సీఎం ప్రారంభించారు. కడప డిపోకు డాక్టర్‌ ‌వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి బస్‌స్టేషన్‌గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డప్ప, ఆర్టీసీ ఎండీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా… సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మాట్లాడుతూ, ఆర్టీసీ ఆధ్వర్యంలో డిపో, ఆస్పత్రి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పుంగనూరు నుంచి ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డప్ప, పలువురు ఎమ్మెల్యేలు, కడప నుంచి డిప్యూటీ సీఎం అంజద్‌ ‌బాషా, ఎంపీ వైఎస్‌ అవినాష్‌ ‌రెడ్డి, ఎమ్యెల్యేలు, కడప మేయర్‌ ‌సురేష్‌బాబు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మాట్లాడుతూ, ఈ రోజు ఆర్టీసీ ఆధ్వర్యంలో పుంగనూరులో బస్సు డిపోను ప్రారంభించడం, అదే మాదిరిగా కడపలో డాక్టర్‌ ‌వైఎస్సార్‌ ఏరియా ఆస్పత్రి, ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం మంచి పరిణామమని అన్నారు. కోవిడ్‌ ‌సమయంలో ఆరోగ్య శాఖతో పాటు, ఆర్టీసీ కూడా ఆస్పత్రిని ప్రారంభించి, సేవలు అందించడం అభినందనీయం. ఈ ఆస్పత్రి వల్ల సంస్థ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. వీటిపై ఆనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఇది దేవుడు నాకిచ్చిన అదృష్టం. కు ఇంకా మంచి చేయాలని, ఆ అవకాశం దేవుడు నాకివ్వాలని కోరుకుంటున్నానని సీఎం జగన్‌ అన్నారు.. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ బస్సు డిపోలు మూతబడే పరిస్థితి తీసుకువచ్చి, దాన్ని ప్రైవేటుపరం చేసే ప్రయత్నం జరిగింది. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. 50 వేల మంది కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల రూ.3600 కోట్ల భారం ఏటా పడుతున్నా, ప్రభుత్వం వెనుకంజ వేయలేదు. అంత గొప్ప మనసున్న వ్యక్తి సీఎం జగన్‌. ‌కడపలో 20 పడకల ఏరియా ఆస్పత్రి ప్రారంభం. మరో వైపు పుంగనూరు డిపోను ఇవాళ ప్రారంభించారు. కార్మికుల కోసం ఇంతగా ఆలోచిస్తున్న ఇలాంటి సీఎం మనకు ఉండట ం ఎంతో అదృష్టమని మంత్రి పేర్ని నాని అన్నారు. సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హా ఇవాళ నిలబెట్టుకుంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, పుంగనూరు డిపోను ప్రారంభించారు. పుంగనూరు ప్రజలకు ఇది ఎంతో వరం. ఆ పట్టణం 40 ఏళ్లుగా మున్సిపాలిటీగా ఉన్నప్ప టికీ ఇప్పటి వరకు డిపో లేదు. కానీ అది ఇవాళ అది సాకారం అయ్యింది. మహానేత వైఎస్సార్‌ ‌హయాంలో పనులు మొదలు పెట్టినా, ఆ తర్వాత కాలంలో అవి ముందుకు సాగలేదు. మళ్లీ ఆయన తనయుడు సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌దాన్ని పూర్తి చేశారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. కాగా, మొత్తం 7.5 కోట్ల వ్యయంతో 7 ఎకరాల విస్తీర్ణంలో పుంగనూరు బస్సు డిపో నిర్మాణం చేశారు. 65 బస్సులతో డిపో ఏర్పాటు కాగా, ఆ డిపోను ఒక మోడల్‌ ‌డిపోగానూ, అదే విధంగా డిపోలో మోడల్‌ ‌వర్క్‌షాప్‌ ఏర్పాటు చేశారు ఇక కడపలో ఆర్టీసికి చెందిన డాక్టర్‌ ‌వైఎస్సార్‌ ఏరియా ఆస్పత్రి భవన నిర్మాణ వ్యయం రూ.3.8 కోట్లు కాగా, మరో రూ.2 కోట్లతో మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌, ఇతర మౌలిక సదుపాయాల కల్పించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ ‌జగన్‌కు ఎంపీ మిథున్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పుంగనూరులో ఆర్టీసీ డిపో ద్వారా ప్రజల కల సాకారమైందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, పంచాయతీరాజ్‌ ‌గ్రాణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ఏపీఎస్‌ఆర్టీసీ వైస్‌ ‌ఛైర్మన్‌ ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ఆర్‌పీ ఠాకూర్‌, ఆర్టీసీ ఈడీలు కృష్ణమోహన్‌, ‌కోటేశ్వరరావుతో పాటు, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.