నేటినుంచి కర్ఫ్యూ అమలు

  • మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6వరకు అమలు

అమరావతి,జ్యోతిన్యూస్‌ :
ఆం‌ధప్రదేశ్‌లో కరోనా కట్టడికి నేటినుంచి కర్ఫ్యూ అమలు చేయనున్నారు. దీంతో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం నుంచి మధ్యాహ్నం 12గంటల తర్వాత పూర్తిస్థాయి కర్ఫ్యూ అమలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణాతో పాటు, ప్రైవేటు వాహనాలు తిరగడానికి వీల్లేదని మంత్రి పేర్ని నాని డియాకు తెలిపారు. మధ్యాహ్నం 12గంటల తర్వాత అంతర్రాష్ట్ర, దూర ప్రాంత బస్సులు పూర్తి నిలిపివేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ, సహా ప్రైవేటు వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు, దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాల సేవలు కూడా రద్దు చేశారు. ప్రజలు కర్ఫ్యూ టైమ్‌లో బయటకు రావద్దని కోరారు.