మృగరాజులకు కరోనా…
- నెహ్రూ జూపార్క్‌లో 8 సింహాలకు కరోనా
- నిర్ధారించిన సిసిఎంబి శాస్త్రవేత్తలు
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
ఇటీవల కరోనా భయంతో కొంతమంది తమ పశువులకు కూడా మాస్క్‌లు వేస్తున్నారు. ఇంకొంతమంది తమ పెంపుడు కుక్కలకు కూడా మాస్క్‌లను వేస్తున్నారు. అలాంటి వీడియోలు సోషల్ డియాలో హల్‌చల్ చేశాయి. కానీ దేశంలోనే మొట్టమొదటిసారి 8 సింహాలు కరోనా బారినపడ్డాయి. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లోని ఆసియా సింహాలకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది ! ఈ విషయాన్ని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ సిసిఎంబి ఏప్రిల్ 29 న ఎన్‌జెడ్‌పి అధికారులకు మౌఖికంగా తెలిపింది. సింహాలకు నిర్వహించిన ఆర్‌టిపిసిఆర్ పరీక్షల్లో ఎనిమిది సింహాలకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు సిసిఎంబి పేర్కొంది. నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్, డైరెక్టర్ డాక్టర్ సిద్దానంద్ కుక్రెటి ఈ విషయాన్ని ఖండించలేదు అలాగని ధ్రువీకరించనూలేదు. ఏప్రిల్ 24 న, జూ పార్క్ లో పనిచేస్తున్న వన్యప్రాణి పశువైద్యులు సఫారిలో ఉంచిన సింహాలలో ఆకలి లేకపోవడం, ముక్కునుంచి రసి కారడం, దగ్గు వంటి కోవిడ్ లక్షణాలను గమనించారు. ఇది 40 ఎకరాల సఫారీ ప్రాంతం. ఇక్కడ 10 సంవత్సరాల వయస్సు ఉన్న 12 సింహాలు ఉన్నాయి. వీటిలో నాలుగు ఆడ సింహాలు, నాలుగు మగ సింహాలు. వీటికి కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు తెలుస్తోంది.జూ పార్క్ లో పనిచేస్తున్న పశువైద్యులు పానిక్ పరిస్థితి వివరించిన తరువాత, మేనేజిమెంట్ వారికి నమూనాలను తీసుకోవాలని సూచించింది. ఫీల్డ్ వెట్స్ సింహాల యొక్క ఒరోఫారింజియల్ (మఅదువైన అంగిలి మరియు హైయోడ్ ఎముక మధ్య ఉండే ఫారింక్ల్సో ఒక భాగం) శుభ్రపరచు నమూనాలను తీసుకొని వాటిని హైదరాబాద్‌లోని సిసిఎంబి కి పంపించాయి, దానితో ఎన్‌జెడ్‌పి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మొత్తం పక్రియలో పాల్గన్న వెటర్నరీ డాక్టర్ ఎస్‌ఎ అసదుల్లా అని తెలిసింది. ఆయనను సంప్రదించాలని డియా ప్రయత్నించినా స్పందన రాలేదు. డాక్టర్ కుక్రెటి మాట్లాడుతూ… సింహాలలో కోవిడ్ లక్షణాలు కనిపించాయన్నది నిజమే కాని తాను ఇంకా సిసిఎంబి నుండి ఆర్‌టిపిసిఆర్ నివేదికలను చూడలేదని అన్నారు. అందువల్ల వ్యాఖ్యానించడం సరైనది కాదు అని, సింహాలు ప్రస్తుతం బాగానే ఉన్నాయని తెలిపారు. నగర వైల్డ్‌లైఫ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ శిరీష్ ఉపాధ్యారు మాట్లాడుతూ… గత ఏడాది ఏప్రిల్ లో న్యూయార్క్‌లోని బ్రోంక్స్ జూ లో ఎనిమిది పులులు, సింహాలకు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయిన తరువాత, అడవి జంతువులలో ఎక్కడా ఇలాంటి కేసులు కనిపించలేదు అని అన్నారు. హాంకాంగ్‌లో కుక్కలు, పిల్లులలో మాత్రం ఈ వైరస్ కనబడిందని చెప్పారు.