అంతాస్క్రిప్టు ప్రకారమే జరుగుతోందన్న ఈటెల

  • కుట్ర పూరితంగా అధికార దుర్వినియోగం
  • హైకోర్టు వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం
  • నన్ను పిలిచి అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని
  • మంత్రుల వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నా

హుజురాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌తనపై ఎంత కుట్రపూరితంగా అధికారులను ఉపయోగించారో హైకోర్టు వ్యాఖ్యలే నిదర్వనమని మాజీమంత్రి ఈటెల రా.జేందర్‌ ‌వ్యాఖ్యానించారు. ప్రగతిభవన్‌లో సీఎంను కలిసే అవకాశం కూడా మంత్రులకు ఉండదని విమర్శించారు. సీఎంకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి కలవడానికి మంత్రులు వెళితే అనుమతించలేదని ఆయన ఆరోపించారు. ఇంత అహంకారమా? అని ఆరోజు మంత్రి గంగుల కమలాకర్‌ ‌తనతో వ్యాఖ్యానించారని ఈటల అన్నారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, ‌గంగుల కమలాకర్‌ ‌తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హుజూరాబాద్‌లోని నివాసంలో నిర్వహించిన డియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వారు చేసిన వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. 2014 వరకే కేసీఆర్‌.. ‌ధర్మాన్ని, ప్రజలను నమ్ముకున్నారు. తెలంగాణ గాంధీగా పేరుగాంచిన గొప్ప వ్యక్తి ఇవాళ కక్షపూ రితంగా వ్యవహరిస్తున్నారు. నాకు నోటీసులు కూడా ఇవ్వలేదు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇలాంటి కుట్రపూరితంగా ఎవరూ వ్యవహరించలేదు. ఎవరివో తప్పుడు సలహాలు, నివేదిక వల్ల నాపై కక్ష సాధిస్తున్నారు. నా వ్యవహారం నచ్చకపోతే పిలిపించి అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని. ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నవారంతా నా సహచరులే. నాపై ఈరోజు మంత్రులు చేసిన వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను ముఖ్యమంత్రి కావాలనుకోలేదు. కేసీఆర్‌ ‌తర్వాత ఆయన కుమారుడే సీఎం కావాలని అన్నాను. వ్యక్తులు ఉంటారు.. పోతారు.. కానీ ధర్మం ఎక్కడికీ పోదు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. కోర్టు ద్వారా త్వరలోనే బదులిస్తా. ఒక మనిషికి ఒక పార్టీ, వ్యక్తితో మాట్లాడే అవకాశము ండదా ? 2014 కంటే ముందు కాంగ్రెస్‌ ‌మంత్రుల దగ్గరకు వెళ్లి అభివృద్ధి పనులు తెచ్చుకోలేదా? ఈరోజు మాత్రం ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్‌, ‌భాజపా వాళ్లు తెరాస మంత్రులను కలవడానికి వస్తే ఫిక్స్ అయిపోయిందా? అని అడుగుతున్నారు. ఇతర పార్టీల నేతలతో మాట్లాడితే తప్పా? ఇక అన్ని పార్టీల నాయకులతో మాట్లాడతా అని ఈటల వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే తెలంగాణ తెచ్చింది కుటుంబ పాలన కోసమా? అనే అంశంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కి మద్దతుగా.. తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ అమెరికా ఫోరం ఆధ్వర్యంలో జూమ్‌ ‌కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. పలువురు ఎన్‌ఆర్‌ఐలతో ఈటల మాట్లాడారు. పూర్తిగా తప్పుడు ఆరోపణలతో తనను బయటికి పంపిచారని వెల్లడించారు. సిట్టింగ్‌ ‌జడ్జితో తన మొత్తం వ్యాపారం ద.. సంపాదించిన ఆస్తుల ద విచారణ చేయించాలని సీఎం కేసీఆర్‌ని కోరినట్టు ఈటల చెప్పారు. ఎంగిలి మెతుకుల కోసం ఆశపడనన్నారు. ప్రజలను నమ్ముకున్నానని… ప్రలోభాలకు లొంగ లేదు కాబట్టే ఈ నిందలు వేస్తున్నారని ఈటల పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఐలు తనకు మద్దతు తెలిపినందుకు ఈటల ధన్యవాదాలు తెలిపారు.