కర్నాటకలో మరో విషాద ఘటన ఆక్సిజన్ అందక 24మంది మృత్యువాతం
బెంగుళూరు,జ్యోతిన్యూస్ :
కర్ణాటకలో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. చామరాజనగర్‌లోని ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో తాజాగా 24 మంది చనిపోయారు. హాస్పిటల్‌లో ఆక్సిజన్ సరఫరా నిలిచి పోవడంతోనే వారంతా చనిపోయారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన 24 మంది ఆక్సిజన్ సపోర్ట్‌తో ఉన్నవారేనని, సరఫరా నిలిచిపోవడం వల్లే వారు మరణించారని వార్తలు వస్తున్నాయి. అయితే హాస్పిటల్ సిబ్బంది ఆ ఆరోపణలను ఖండించారు. హాస్పిటల్‌లో ఆక్సిజన్ కొరత లేదని, మైసూరు నుంచి ఆక్సిజన్ తెప్పిస్తున్నామని తెలిపారు. చనిపోయిన వారందరూ వెంటిలేటర్లపై ఉన్నవారేనని, వారికి ఇతర వ్యాధులు కూడా ఉన్నాయని, పోస్ట్‌మార్టమ్ రిపోర్టులు వస్తే మృతికి గల కారణాలు తెలుస్తాయని చామరాజనగర్ డిప్యూటీ కమిషనర్ అన్నారు.